పేద ముస్లింలకు రంజాన్ గిఫ్ట్ ప్యాక్స్

రంజాన్ పండుగ సందర్భంగా పేద ముస్లింలకు పంపిణీచేసేందుకు 4.50 లక్షల గిఫ్ట్ ప్యాకులను అధికార యంత్రాంగం సిద్ధంచేసింది. ఈ నెల 18 నుంచి జిల్లాల్లో, 20 నుంచి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పంపిణీ ప్రారంభించి రాష్ట్రమంతటా మే 25 కల్లా పూర్తిచేయాలని నిర్ణయించారు. గిఫ్ట్‌ప్యాకులో ఒక చీర, సల్వార్ కమీజ్, కుర్తా పైజామా, ఒక బ్యాగు ఉంటాయి. ముస్లింలలో అత్యంత పేదవారిని గుర్తించి వీటిని అందజేయనున్నారు. ఒక్కో మసీదు ద్వారా 500 మందికి చొప్పున జీహెచ్‌ఎంసీ పరిధిలో […]

పేద ముస్లింలకు రంజాన్ గిఫ్ట్ ప్యాక్స్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Srinu

Updated on: May 14, 2019 | 7:05 PM

రంజాన్ పండుగ సందర్భంగా పేద ముస్లింలకు పంపిణీచేసేందుకు 4.50 లక్షల గిఫ్ట్ ప్యాకులను అధికార యంత్రాంగం సిద్ధంచేసింది. ఈ నెల 18 నుంచి జిల్లాల్లో, 20 నుంచి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పంపిణీ ప్రారంభించి రాష్ట్రమంతటా మే 25 కల్లా పూర్తిచేయాలని నిర్ణయించారు. గిఫ్ట్‌ప్యాకులో ఒక చీర, సల్వార్ కమీజ్, కుర్తా పైజామా, ఒక బ్యాగు ఉంటాయి. ముస్లింలలో అత్యంత పేదవారిని గుర్తించి వీటిని అందజేయనున్నారు. ఒక్కో మసీదు ద్వారా 500 మందికి చొప్పున జీహెచ్‌ఎంసీ పరిధిలో ఎంపికచేసిన 448 మసీదుల్లో మొత్తం 2.24 లక్షల గిఫ్ట్ ప్యాకులను పంపిణీ చేయనున్నారు. రంజాన్ గిఫ్ట్ ప్యాకుల లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రతి మసీదులో కమిటీని ఏర్పాటుచేశారు. ఆయా మసీదుల పరిధిలోని ముస్లింల స్థితిగతులను కమిటీ పరిశీలించి లబ్ధిదారులను ఎంపికచేస్తుంది.