Hyderabad: అమ్మాయిల జోలికెళ్తే ఇక అంతే.. హైదరాబాద్‌లో 15 రోజుల్లో 108 మంది జైలుకి..
బాలికలను, మహిళలను వేధించే పోకిరిలను వదిలిపెట్టే ప్రసక్తి లేదని, నిర్భయంగా ఫిర్యాదు చేయాలని రాచకొండ సీపీ జి.సుధీర్ బాబు సూచించారు. బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లు, స్కూళ్లు, కాలేజీలు, కూరగాయల మార్కెట్లు, బహిరంగ ప్రదేశాలలో మఫ్టీలో తిరుగుతూ షిటీం డెకాయ్ ఆపరేషన్లు చేస్తున్నారని తెలిపారు.

బాలికలను, మహిళలను వేధించే పోకిరిలను వదిలిపెట్టే ప్రసక్తి లేదని, నిర్భయంగా ఫిర్యాదు చేయాలని రాచకొండ సీపీ జి.సుధీర్ బాబు సూచించారు. బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లు, స్కూళ్లు, కాలేజీలు, కూరగాయల మార్కెట్లు, బహిరంగ ప్రదేశాలలో మఫ్టీలో తిరుగుతూ షిటీం డెకాయ్ ఆపరేషన్లు చేస్తున్నారని, బాలికలను, మహిళలను వెంబడిస్తూ వేధించే పోకిరీల చేష్టలను సాక్ష్యాధారాలతో సహా పట్టుకొని న్యాయస్థానంలో హాజరు పరుస్తూ.. వారిని తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇస్తున్నారని అన్నారు. రాచకొండ ఉమెన్ సేఫ్టీ వింగ్, షి టీమ్స్ ఆధ్వర్యంలో ఈవ్ టీజర్లకు ఈరోజు రాచకొండ క్యాంప్ కార్యాలయంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. రాచకొండ కమిషనరేట్ పరిదిలో మహిళలను, యువతులను వేదింపులకు గురిచేస్తున్న 108 మందిని (మేజర్స్-67 , మైనర్స్ -41) షీ టీమ్స్ అరెస్టు చేశారు. వారికి ఎల్‌బి నగర్ CP Camp office (ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆఫీసు )లో కౌన్సిలర్స్ తో వారి కుటుంబ సబ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించారు.
గత నెల 16 నుండి 31 వరకు 133 ఫిర్యాదులు అందాయని, రాచకొండ మహిళ రక్షణ విభాగం అధిపతి టి. ఉషా విశ్వనాథ్ తెలిపారు. ఫిర్యాదులపై విచారణ చేపట్టి దర్యాప్తు పూర్తి చేశామన్నారు. అందిన ఫిర్యాదులలో.. ఫోన్ల ద్వారా వేధించినవి -29 , WhatsApp కాల్స్ & messages ద్వారా వేధించినవి – 18, Social media apps ద్వారా వేధించినవి- 32, నేరుగా వేధించినవి – 54 అని.. వాటిలో క్రిమినల్ కేసులు-5, పెట్టి కేసులు- 68, 38 మందికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందన్నారు.
అంతేకాకుండా.. ప్రేమ పేరుతో యువతిని లైంగికంగా వేధించిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు తెలిపారు. నేరెడ్ మెట్ కు చెందిన యువతి.. కుషాయిగూడ షి టీమ్ ను ఆశ్రయించగా.. సకాలంలో చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. దీంతోపాటు.. ప్రేమ పేరుతో బాలిక పై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడిని సైతం ఇబ్రహీంపట్నం షీ టీమ్స్ కటకటాల వెనక్కి పంపినట్లు తెలిపారు. బోడుప్పల్ లో స్విమ్మింగ్ కోచ్ పదోతరగతి బాలికను ప్రేమ పేరుతో వేధింస్తుండగా.. నిందితుడిని అరెస్టు చేసి జైలుకు పంపామన్నారు. చౌటుప్పల్ లో నివాసం ఉంటున్న యువతిని.. ఆమె స్నిహితుడు తెలియకుండ ఫోటోలు తీస్తుండగా.. మాటువేసి పట్టుకున్నట్లు తెలిపారు. అంతేకాకుండా.. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో బాల్య వివాహాన్ని అడ్డుకున్నట్లు తెలిపారు.
గత నెల 16-31 వరకు షీ టీమ్స్ రాచకొండ 50 అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, దాదాపు 8850 మందికి మహిళా చట్టాలు, వారి హక్కులు, నేరాల గురించి వివరించి అవగాహన కల్పించడం జరిగింది.
మెట్రో-రైల్ డెకాయ్ ఆపరేషన్..
రాచకొండ షీ టీమ్స్ మెట్రో రైళ్లలో డెకాయ్ ఆపరేషన్సు నిర్వహించి, మహిళా కంపార్మెంట్‌లోకి వెళ్ళి ప్రయాణిస్తున్న (04) మందిని పట్టుకుని మెట్రో స్టేషన్ అధికారుల ద్వారా ఫైన్ వేయించడం జరిగిందన్నారు.
డెకాయ్ ఆపరేషన్..
నగరంలో డెకాయ్ ఆపరేషన్ నిర్వహించి మహిళలను, ఆడపిల్లలను వేధిస్తున్న 38 మంది పోకిరిలను అదుపులోకి తీసుకొని వారిపై కేసులు నమోదు చేసి కౌన్సెలింగ్ ఇచ్చినట్లు తెలిపారు.
మహిళలకు ఎదురయ్యే.. భౌతిక పరమైన, సామాజిక మాద్యమాల ద్వారా జరిగే దాడులు, లైంగిక వేదింపులు, ప్రయాణ సమయాల్లో వేధింపులు వంటి ఇబ్బందుల నుంచి రక్షించేందుకు రాచకొండ పోలీసులు ఇరవై నాలుగు గంటలూ అందుబాటులో ఉంటున్నారని పేర్కొన్నారు. మహిళలు వేధింపులకు గురి అయినప్పుడు వెంటనే SHE Teams ని, Rachakonda WhatsApp నెంబర్ 8712662111 ద్వారా నిర్భయంగా ఫిర్యాదు చేయాలని తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




