Hyderabad: పోకిరీల తాట తీస్తున్న షీ టీమ్స్‌.. డెకాయ్‌ ఆపరేషన్స్ నిర్వహిస్తూ..

బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లు, స్కూళ్లు, కాలేజీలు, కూరగాయల మార్కెట్లు, బహిరంగ ప్రదేశాలలో మఫ్టీలో తిరుగుతూ డెకాయ్‌ ఆపరేషన్లు చేస్తున్నారని, మహిళలను వెంబడిస్తూ వేధించే పోకిరీల చేష్టలను సాక్ష్యాధారాలతో సహా పట్టుకొని న్యాయస్థానంలో హాజరు పరుస్తూ.. వారిని తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్‌ ఇస్తున్నారని అన్నారు. రాచకొండ కమిషనర్ శ్రీ డి.ఎస్. చౌహాన్, ఐ‌పిఎస్ గారి ఆదేశాల ప్రకారం..

Hyderabad: పోకిరీల తాట తీస్తున్న షీ టీమ్స్‌.. డెకాయ్‌ ఆపరేషన్స్ నిర్వహిస్తూ..
Rachakonda She Teams
Follow us

|

Updated on: Nov 17, 2023 | 5:02 PM

‘ఎల్లపుడూ..మీకొరకు.., మీతో…’ అనే నినాధంతో రాచకొండ షీ టీమ్స్ పనిచేస్తున్నాయని, నిర్భయంగా, నిశ్చింతగా బాధితులు ఎవరైనా ఉంటే ధైర్యంగా సంప్రదించవచ్చని రాచకొండ మహిళ రక్షణ విభాగం అధిపతి డీసీపీ టి. ఉషా విశ్వనాథ్ తెలిపారు. 15 రోజుల్లో 126 మంది ఆకతాయిలను రాచకొండ టీ షీమ్స్‌ పట్టుకున్నారు. బాలికలను, మహిళలను వేధించే పోకిరీలను రాచకొండ షీ టీమ్స్‌ పోలీసులు వదిలిపెట్టే ప్రసక్తి లేదని, మహిళలు నిర్భయంగా ఫిర్యాదు చేయాలని డీసీపీ ఉషా విశ్వనాథ్ తెలిపారు.

బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లు, స్కూళ్లు, కాలేజీలు, కూరగాయల మార్కెట్లు, బహిరంగ ప్రదేశాలలో మఫ్టీలో తిరుగుతూ డెకాయ్‌ ఆపరేషన్లు చేస్తున్నారని, మహిళలను వెంబడిస్తూ వేధించే పోకిరీల చేష్టలను సాక్ష్యాధారాలతో సహా పట్టుకొని న్యాయస్థానంలో హాజరు పరుస్తూ.. వారిని తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్‌ ఇస్తున్నారని అన్నారు. రాచకొండ కమిషనర్ శ్రీ డి.ఎస్. చౌహాన్, ఐ‌పిఎస్ గారి ఆదేశాల ప్రకారం.. రాచకొండ ఉమెన్ సేఫ్టీ వింగ్, షీ టీమ్స్ ఆధ్వర్యంలో ఈవ్ టీజర్లకు శుక్రవారం కౌన్సిలింగ్ నిర్వహించారు.

రాచకొండ కమిషనరేట్ పరిధిలో మహిళలను, యువతులను వేదింపులకు గురిచేస్తున్న 126 మందిని (మేజర్స్-58, మైనర్స్ -68) అధికారులు అరెస్ట్ చేవారు. వీరికి ఎల్‌బీనగర్‌ సీపీ క్యాంప్‌ ఆఫీస్‌లో కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. గత నెల అక్టోబర్ 16 నుంచి 31 వరకు 148 ఫిర్యాలు అందాయని టి. ఉషా విశ్వనాథ్ గారు తెలిపారు. ఫిర్యాదుల పై విచారణ చేపట్టి దర్యాప్తు పూర్తి చేశామన్నారు.

ఇదిలా ఉంటే ఈవ్‌ టీజింగ్‌పై మహిళల్లో అవగాహన కల్పించేందుకు పలు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగానే గత నె అక్టోబర్‌ 16వ తేదీ నుంచి 31 వరకు రాచకొండ షీ టీమ్స్‌ మొత్తం 53 అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. ఇందులో భాగంగా మొత్తం 4160 మందికి మహిళలకు చట్టాలతో పాటు వారికి లభించే హక్కుల గురించి వివరించి, అవగాహన కల్పించారు. పోకిరీల ఆటకట్టేందుకు మెట్రో రైళ్లలో డెకాయ్‌ ఆపరేషన్స్‌ నిర్వహించి.. మహిళా కంపార్మెంట్‌లోకి వెళ్లి ప్రయాణిస్తున్న ఆరు మందిని పట్టుకుని మెట్రో స్టేషన్ అధికారుల ద్వారా ఫైన్ వేశారన్నారు.

ఇక కుషాయుగూడ షీటీమ్‌.. కుషాయిగూడ ఏరియాలో డెకాయ్ ఆపరేషన్ నిర్వహించి రోడ్డు మీద వెలుతున్న మహిళను, ఆడపిల్లలను వేదిస్తున్న 25 మంది పోకిరీలను అదుపులోకి తీసుకొని వారిపై కేసులు నమోదు చేశారు. అలాగే వనస్థలిపురం, మల్కాజ్-గిరి ఏరియాల్లో కూడా డెకాయర్‌ ఆపరేషన్ నిర్వహించి మహిళను, ఆడ పిల్లలను వేధిస్తున్న 20 మందిపై కేసులు నమోదు చేసి కౌన్సెలింగ్‌ నిర్వహించారు.

She Teams

24 గంటలు అందుబాటులో..

ఆడవారికి ఎలాంటి సమస్యలు ఎదురైనా, వేధింపులు ఎదురైనా.. రక్షించేందుకు రాచకొండ పోలీసులు 24 గంటలు అందుబాటులో ఉంటామని తెలిపార. స్త్రీలను గౌరవించడం తమ వ్యక్తిత్వంలో భాగం కావాలని, ఆడవారిని ఇబ్బందులు పెట్టే వారిని ఉపేక్షించేది లేదని కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. మహిళలు వేధింపులకు గురైతే వెంటనే రాచకొండ వాట్సాప్‌ నెంబర్ 8712662111, లేదా ప్రాంతాల వారిగా భువనగిరి ఏరియా- 8712662598, చౌటుప్పల్‌ – 8712662599, ఇబ్రహీంపట్నం -8712662600, కుషాయిగూడ ఏరియా -8712662601, ఎల్బీ నగర్‌ ఏరియా -8712662602, మల్కాజిగిరీ ఏరియా -8712662603, వనస్థలిపురం ఏరియా -8712662604 నెంబర్ల ద్వారా సంప్రదించాలని తెలిపారు.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..

వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. తగ్గనున్న పెట్రోలు, డీజిల్ ధరలు
వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. తగ్గనున్న పెట్రోలు, డీజిల్ ధరలు
తోటలో పనిచేస్తున్న 50ఏళ్ల మహిళపై పొరుగింటి కుక్కల దాడి .. మృతి
తోటలో పనిచేస్తున్న 50ఏళ్ల మహిళపై పొరుగింటి కుక్కల దాడి .. మృతి
అనుకూల స్థితిలో రాశి అధిపతి.. ఆ రాశుల వారికి సమస్యలు దూరం!
అనుకూల స్థితిలో రాశి అధిపతి.. ఆ రాశుల వారికి సమస్యలు దూరం!
ఎలాంటి తప్పు చేయలేదని మా పేరెంట్స్‌కి చెప్పాను.. యానిమల్‌ బ్యూటీ
ఎలాంటి తప్పు చేయలేదని మా పేరెంట్స్‌కి చెప్పాను.. యానిమల్‌ బ్యూటీ
Telangana: ముందు పానీయం ఇస్తాడు.. ఆ తర్వాతే అసలు కథ..
Telangana: ముందు పానీయం ఇస్తాడు.. ఆ తర్వాతే అసలు కథ..
ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చేసిన కార్తీ జపాన్‌.. ఎక్కడ చూడొచ్చంటే?
ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చేసిన కార్తీ జపాన్‌.. ఎక్కడ చూడొచ్చంటే?
కృష్ణానది తీరంలోని చారిత్రక పుణ్యక్షేత్రం .. ద్వాపరయుగంతో అనుబంధం
కృష్ణానది తీరంలోని చారిత్రక పుణ్యక్షేత్రం .. ద్వాపరయుగంతో అనుబంధం
పాములతో పెంపుడు జంతువుల్లా ఆడుకుంటున్న చిన్నారి బాలిక..
పాములతో పెంపుడు జంతువుల్లా ఆడుకుంటున్న చిన్నారి బాలిక..
ఇంట్లో ఈ చిన్న మార్పులు చేస్తే చాలు.. మానసిక ప్రశాంతత..
ఇంట్లో ఈ చిన్న మార్పులు చేస్తే చాలు.. మానసిక ప్రశాంతత..
కేసీఆర్‌ త్వరగా కోలుకోవాలి.. బీఆర్ఎస్ అధినేతకు చంద్రబాబు పరామర్శ
కేసీఆర్‌ త్వరగా కోలుకోవాలి.. బీఆర్ఎస్ అధినేతకు చంద్రబాబు పరామర్శ
ఆ రెండు రంగాలను కాపాడండి.. సీఎం రేవంత్‌కు మల్లా రెడ్డి వినతి
ఆ రెండు రంగాలను కాపాడండి.. సీఎం రేవంత్‌కు మల్లా రెడ్డి వినతి
నారా లోకేశ్‌ యువగళం పాదయాత్రలో ఆసక్తికర సన్నివేశం..
నారా లోకేశ్‌ యువగళం పాదయాత్రలో ఆసక్తికర సన్నివేశం..
Chandrababu - KCR: మాజీ సీఎం కేసీఆర్‍కు చంద్రబాబు పరామర్శ.. లైవ్
Chandrababu - KCR: మాజీ సీఎం కేసీఆర్‍కు చంద్రబాబు పరామర్శ.. లైవ్
పెంట్‌ హౌస్‌ ధర రూ 1,133 కోట్లు! ఎక్కువ ధర పలికిన పెంట్‌ హౌస్‌.
పెంట్‌ హౌస్‌ ధర రూ 1,133 కోట్లు! ఎక్కువ ధర పలికిన పెంట్‌ హౌస్‌.
ఆకాశంలో దెయ్యం.! ఓ భారీ గెలాక్సీకి దెయ్యం ముఖం వంటి ఆకృతి..
ఆకాశంలో దెయ్యం.! ఓ భారీ గెలాక్సీకి దెయ్యం ముఖం వంటి ఆకృతి..
రేవంత్ అన్నా అంటూ కష్టం చెప్పుకున్న మహిళ.. సీఎం ఏం చేశారంటే
రేవంత్ అన్నా అంటూ కష్టం చెప్పుకున్న మహిళ.. సీఎం ఏం చేశారంటే
సినీ ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో నాకు తెలియాలి.. మంత్రి కోమటిరెడ్డి
సినీ ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో నాకు తెలియాలి.. మంత్రి కోమటిరెడ్డి
ఆర్టికల్‌ 370 రద్దుపై సుప్రీంకోర్టు.! తీర్పు చదువుతున్న ధర్మాసనం.
ఆర్టికల్‌ 370 రద్దుపై సుప్రీంకోర్టు.! తీర్పు చదువుతున్న ధర్మాసనం.
ఘరానా మోసం..నకిలీ టోల్‌ప్లాజాతో కోట్లు కొట్టేశారు.! వీడియో..
ఘరానా మోసం..నకిలీ టోల్‌ప్లాజాతో కోట్లు కొట్టేశారు.! వీడియో..
వరద నీటిలో రజనీకాంత్‌ ఇల్లు.! ఇంటిచుట్టూ నిలిచిపోయిన వరదనీరు.
వరద నీటిలో రజనీకాంత్‌ ఇల్లు.! ఇంటిచుట్టూ నిలిచిపోయిన వరదనీరు.