BJP Vijaya Sankalpa Sabha: తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తోంది.. అభివృద్ధి ఎజెండగా ప్రధాని మోదీ ప్రసంగం..

PM Modi Hyderabad Rally: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం ఎంతో సహకరిస్తోందన్నారు. సబ్‌కా సాథ్.. సబ్‌కా వికాస్ మంత్రంతో తెలంగాణను మరింత ముందుకు తీసుకు వెళ్లేందుకు బిజెపి కట్టుబడి వుందన్నారు. 8ఏళ్లుగా ప్రజల జీవనప్రమాణాలు పెంచేందుకు ప్రయత్నించాం.

BJP Vijaya Sankalpa Sabha: తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తోంది.. అభివృద్ధి ఎజెండగా ప్రధాని మోదీ ప్రసంగం..
Pm Modi At Hyderabad Rally
Sanjay Kasula

|

Jul 03, 2022 | 8:03 PM

తెలంగాణలో డబుల్‌ ఇంజిన్‌ సర్కారు రావాలని ప్రజలు పట్టాలు వేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi) అన్నారు. సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో ఏర్పాటు చేసిన విజయసంకల్ప సభ(vijaya sankalpa sabha)లో ప్రధాని మోదీ ప్రసంగించారు. సబ్‌కా సాథ్.. సబ్‌కా వికాస్ మంత్రంతో తెలంగాణను మరింత ముందుకు తీసుకు వెళ్లేందుకు బీజేపీ కట్టుబడి ఉందన్నారు. 8ఏళ్లుగా ప్రజల జీవనప్రమాణాలు పెంచేందుకు ప్రయత్నించామని వెల్లడించారు. దళితులు, ఆదివాసీల ఆకాంక్షలను బీజేపీ నెరవేర్చిందన్నారు ప్రధాని మోదీ. కరోనా కష్టకాలంలో ఇక్కడున్న ప్రతి కుటుంబానికి అండగా ఉన్నామని గుర్తు చేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి మంచి ఫలితాలు వచ్చాయని.. తెలంగాణ ప్రజలకు మా పార్టీపై నమ్మకం ఎన్నోరెట్లు పెరిగిందని ధీమా వ్యక్తం చేశారు. ప్రాచీన సంస్కృతి, పరాక్రమానికి తెలంగాణ పురిటిగడ్డ అని అన్నారు ప్రధాని మోదీ.

ప్రసంగాన్ని తెలుగులో..

విజయ సంకల్ప సభలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ “సోదర సోదరీమణులకు నమస్కారాలు” అంటూ ప్రధాని మోదీ తెలుగులో ప్రసంగం ప్రారంభించారు. ‘‘ఎంతోదూరం నుంచి వచ్చిన ప్రతి కార్యకర్తలకు అభినందనలు. తెలంగాణ నేలతల్లికి వందనం సమర్పిస్తున్నా. తెలంగాణ గడ్డకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. తెలంగాణ మొత్తం ఈ మైదానంలో కూర్చున్నట్టుగా ఉంది. హైదరాబాద్‌ నగరం అన్ని రంగాల వారికి అండగా నిలుస్తోంది. ప్రాచీన సంస్కృతి, పరాక్రమానికి తెలంగాణ పుణ్యస్థలం. తెలంగాణ పవిత్ర భూమి. దేశ ప్రజలకు యాదాద్రి నరసింహస్వామి, గద్వాల జోగులాంబ, వరంగల్‌ భద్రకాళి అమ్మవారి ఆశీస్సులు ఉంటాయి’’ అని ప్రధాని మోదీ అన్నారు.

జాతీయ పథకాల ద్వారా అభివృద్ధిలో…

గత 8 ఏళ్లలో ప్రతి భారతీయుడి జీవితంలో సానుకూల మార్పు తీసుకురావడానికి ప్రయత్నించామని ప్రధాని మోదీ అన్నారు. దేశప్రజల జీవితాలను ఎలా సులభతరం చేయాలి, అభివృద్ధి ప్రయోజనాలు ప్రతి వ్యక్తికి, ప్రతి ప్రాంతానికి ఎలా చేరతాయనే దాని కోసం తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు. అణగారిన, దోపిడీకి గురైన వారిని కూడా జాతీయ పథకాల ద్వారా అభివృద్ధిలో భాగస్వాములను చేశామన్నారు. పేదలు, అణగారిన, వెనుకబడిన, గిరిజనులందరూ నేడు తమ అవసరాలు, ఆకాంక్షలు రెండింటినీ బిజెపి ప్రభుత్వం నెరవేరుస్తోందని భావించడానికి ఇదే కారణం అని ప్రధాని మోదీ వెల్లడించారు.

తెలంగాణకు డబుల్ ఇంజన్ ప్రభుత్వం రావాలి..

డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు ప్రధాని మోదీ. రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనకు కేంద్రం ఎంతో కృషి చేస్తోందన్నారు. తెలంగాణలో మెగా టెక్స్‌టైల్ పార్క్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. మా పాలనలో గ్రామాల్లోని యువతకు ప్రోత్సాహం ఇస్తున్నామని, మహిళా సాధికారత దిశగా ముందడుగు వేస్తున్నామని వెల్లడించారు.హైదరాబాద్‌లో సైన్స్‌ సిటీ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామని.. బయో మెడికల్ సైన్సెస్ కేంద్రాలు ఏర్పాటవుతున్నాయన్నారు. తెలుగులో టెక్నాలజీ, మెడికల్ చదువులు ఉంటే ఎంతో బాగుంటుందన్నారు ప్రధాని మోదీ. దానికనుగుణంగా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించామని గుర్తు చేశారు. తెలంగాణలో 5 నీటి ప్రాజెక్టులకు కేంద్రం సహకరిస్తోందని అన్నారు. రైతుల కోసం కనీస మద్దతు ధరను పెంచామన్నారు.హైదరాబాద్‌లో రూ.1500 కోట్లతో ఫైఓవర్లు, ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్‌లు నిర్మిస్తున్నామని, రూ.350 కోట్లతో హైదరాబాద్‌కు మరో రీజనల్ రింగ్‌ రోడ్డు మంజూరు చేశామని ప్రధాని మోదీ ప్రకటించారు.

తెలంగాణలోని ప్రతీ కుటుంబానికి అండగా ఉన్నాం

కరోనా సమయంలో తెలంగాణలోని ప్రతీ కుటుంబానికి అండగా ఉన్నాం. తెలంగాణలోని పేదలకు ఉచితంగా రేషన్‌ అందించాం. తెలంగాణలో బీజేపీపై విశ్వాసం పెరుగుతోంది. మా అభివృద్ది ఫలాలు ప్రతీ ఒక్కరికి అందుతున్నాయి. 2019 నుంచి మాకు అంతకంతకు మద్ధతు పెరుగుతోంది. తెలంగాణ ప్రజలు డబుల్‌ ఇంజన్‌ సర్కారును కోరుకుంటున్నారు. మహిళల సంక్షేమానికి పెద్ద పీట వేశాం. వారికి సులభంగా రుణాలు ఇస్తున్నాం.

హైదరాబాద్‌లో జరిగిన టీకా పరిశోధన ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని కాపాడింది. తెలుగులో మెడికల్‌, ఇంజనీరింగ్ విద్యను తీసుకురాబోతున్నాం. తెలంగాణ నుంచి భారీగా ధాన్యం కొనుగోలు చేశాము. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని తెరిపించేందుకు 2015 నుంచి కృషి చేస్తున్నాం. తెలంగాణ రైతుల జీవితాలను మార్చాలని కోరుకుంటున్నాం.

మోదీ స్పీచ్ ఇక్కడ చూడండి..

 

తెలంగాణ వార్తల కోసం

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu