AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: హైదరాబాద్‌లో పెట్రల్, డీజిల్ కొట్టిస్తున్నారా..? అయితే తస్మాత్ జాగ్రత్త.. అంతా మాయే

అంతా మాయ... మీరు చూసేదంతా మాయే... మీ కళ్లు కూడా మిమ్మల్ని మోసం చేస్తాయ్... అంతా పర్ఫెక్ట్‌గా ఉన్నట్లు కనిపిస్తుంది... కానీ మీరు మోసపోతారు...

Hyderabad: హైదరాబాద్‌లో పెట్రల్, డీజిల్ కొట్టిస్తున్నారా..? అయితే తస్మాత్ జాగ్రత్త.. అంతా మాయే
Petrol Bunks Cheating
Ram Naramaneni
|

Updated on: Oct 08, 2021 | 5:49 PM

Share

అంతా మాయ… మీరు చూసేదంతా మాయే… మీ కళ్లు కూడా మిమ్మల్ని మోసం చేస్తాయ్… అంతా పర్ఫెక్ట్‌గా ఉన్నట్లు కనిపిస్తుంది… కానీ మీరు మోసపోతారు… మన కళ్ల ముందు… మనకు తెలియకుండానే మోసం చేస్తారు… ఇదేమీ మాయామంత్రం కాదు… గారడీ అస్సలే కాదు… అదెలాగంటారా? అదే మైక్రో చిప్ మాయ.  మీరు లీటర్ పెట్రోల్ పోయించుకున్నారా? కానీ, మీకు పోసింది 1000ML కాదు… 950ML మాత్రమే… కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. అదేంటి, డిస్ ప్లేలో లీటర్ చూపించింది కదా అనుకుంటున్నారా? అదే మాయ. మీకు తెలియకుండానే మీ పెట్రోల్ నుంచి 50ML కొట్టేస్తున్నారు.

పెట్రోల్ బంకుల్లో జరిగే మోసాల్లో మైక్రో మాయ ఒకటి. దీని ద్వారా మన కళ్ల మందే మనకు తెలియకుండా మన పెట్రోల్ ను కొట్టేస్తారు. అందుకోసం ప్రత్యేకంగా తయారుచేసిన సాఫ్ట్‌వేర్‌ను వినియోగిస్తారు. ఒకే ఒక్క చిన్న చిప్‌తో దర్జాగా దోపిడీకి పాల్పడతారు. లీటరుకు యాభై నుంచి హండ్రెడ్ ఎంఎల్ కొట్టేస్తున్నారు. ఒకవైపు పెరిగిన పెట్రో ధరలతో వినియోగదారుల జేబులకు చిల్లు పడుతుంటే… మరోవైపు బంకు యజమానులు మైక్రో చిప్స్‌తో నిలువు దోపిడీ చేస్తున్నారు. ఈ మైక్రో చిప్ మాయగాళ్లు దేశమంతటా ఉన్నారు. అయితే, ఇలాంటి ముఠాలు ఎక్కువగా హైదరాబాద్‌లోనే ఉన్నట్లు తేలింది.

గప్‌చుప్‌గా సాగుతోన్న మైక్రో చిప్ మోసాలపై హైదరాబాద్‌లో తీగ లాగితే మూడు రాష్ట్రాల్లో డొంక కదిలింది. తెలంగాణ, ఏపీ, కర్నాటకలో మొత్తం 34 బంకుల్లో ఈ మైక్రో చిప్స్‌ అమర్చినట్లు ముఠా ఒప్పుకుంది. తెలంగాణలో కామారెడ్డి, వనపర్తి, ఖమ్మం, సిద్దిపేట, మహబూబ్‌నగర్‌, సూర్యాపేట తదితర ప్రాంతాల్లో మైక్రో చిప్స్ అమర్చినట్లు నిందితులు చెప్పడంతో స్టేట్ వైడ్‌గా రైడ్స్ చేశారు. ఖమ్మం వైరాలో చిప్స్‌తో మోసాలకు పాల్పడుతోన్న పెట్రోల్ బంక్‌ను పోలీసులు సీజ్ చేశారు.  మీరు కొట్టించుకున్న పెట్రోల్‌కు రావాల్సినంత మైలేజ్ రాకపోతే మీరు మోసపోతున్నట్టే. చిప్పులతో మీ జేబుకు చిల్లు పెట్టేశారని గుర్తించాలి. అనుమానం వస్తే నిలదీయండి. వెంటనే సంబంధిత అధికారులకు కంప్లైంట్ చేయండి.

Also Read: ‘కుంగుబాటు నుంచి కోలుకునేందుకు కొంత టైమ్ ఇవ్వండి’.. సమంత భావోద్వేగ లేఖ

నెట్టింట సంచలనంగా మారిన పూనమ్ కౌర్ ట్వీట్.. విపరీతమైన చర్చ

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!