జయహో ఆపరేషన్ సింధూర్.. ట్యాంక్‌బండ్‌పై తిరంగా ర్యాలీ.. పాల్గొన్న కిషన్‌రెడ్డి, వెంకయ్యనాయుడు
ఆపరేషన్ సింధూర్ విజయాన్ని పురస్కరించుకుని, మన సైనికులకు సంఘీభావంగా హైదరాబాద్ ట్యాంక్‌బండ్ రోడ్డులో తిరంగా ర్యాలీ నిర్వహించారు. సిటిజన్స్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ ఫోరం ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది. ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి సచివాలయం జంక్షన్ మీదుగా సైనిక ట్యాంక్ వరకు ర్యాలీ కొనసాగింది.

ఆపరేషన్ సింధూర్ విజయాన్ని పురస్కరించుకుని, మన సైనికులకు సంఘీభావంగా హైదరాబాద్ ట్యాంక్‌బండ్ రోడ్డులో తిరంగా ర్యాలీ నిర్వహించారు. సిటిజన్స్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ ఫోరం ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది. ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి సచివాలయం జంక్షన్ మీదుగా సైనిక ట్యాంక్ వరకు ర్యాలీ కొనసాగింది. ర్యాలీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, బీజేపీ ఎంపీలు డీకే అరుణ, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి, బీజేపీ యువమోర్చా, మహిళా మోర్చా, కిసాన్ మోర్చా కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ ర్యాలీకి విద్యార్థులు, యువత భారీగా తరలివచ్చారు.
జయహో ఆపరేషన్ సింధూర్.. భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. ట్యాంక్‌బండ్‌పై తిరంగా ర్యాలీ రాత్రి వరకు కొనసాగింది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు వేలాదిమంది యువత, ర్యాలీకి తరలివచ్చారు.
In a short while from now, will be joining the #TirangaYatra in honour of our brave armed forces and commemorating the success of #OperationSindoor 📍Tank Bund, Hyderabad pic.twitter.com/CQ3vDCY5rf
— G Kishan Reddy (@kishanreddybjp) May 17, 2025
ఆపరేషన్ సింధూర్ విజయవంతం అయిన సందర్భంగా దేశవ్యాప్తంగా తిరంగా ర్యాలీలు నిర్వహించాలని బీజేపీ హై కమాండ్ నిర్ణయించింది. దానిలో భాగంగా హైదరాబాద్‌లో ర్యాలీ జరిగింది.
#WATCH | Hyderabad, Telangana | Union Minister & state BJP chief G Kishan Reddy, along with BJP leaders and workers, hold a Tiranga Yatra under the banner Citizens for National Security.#OperationSindoor pic.twitter.com/R44Yqzp7pE
— ANI (@ANI) May 17, 2025
వాయిస్: కశ్మీర్‌లోని పహల్గామ్‌లో గత నెల 22న ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది టూరిస్టులు మృతి చెందారు. దీంతో ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్‌లోని ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేసింది భారత్. ఆ దాడిలో వందమందికి పైగా టెర్రరిస్టులు హతమయ్యారు. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయ్యిందని బీజేపీ శ్రేణులు తిరంగా ర్యాలీ నిర్వహించాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
