Hyderabad: ఏంది న్యూ ఇయర్ పార్టీలు ప్లాన్ చేస్తున్నారా..? పోలీసులు చెప్పేది కూడా వినండి
పార్టీలు చేసుకోండి తప్పలేదు. కానీ పరిమితుల్లో ఉండండి. మన వల్ల వేరే వారికి ఇబ్బందులు కలగకూడదు. మరో విషయం పోలీస్ నిఘా నేత్రాలు మిమ్మల్ని పరిశీలిస్తూనే ఉంటాయి.
ఏంది న్యూ ఇయర్ జోష్‌కు రెడీ అయ్యారా..? డ్యాన్స్, పాటలతో హోరెత్తించాలని ఫిక్సయ్యారా..? కొత్త ఏడాదిని ఖతర్నాక్ సెలబ్రేషన్స్‌తో ఇన్వైట్ చేయాలని ఆరాటపడుతున్నారా..? అయితే నో వర్రీస్. కానీ కాస్త పోలీసులు నుంచి కూడా పర్మిషన్ తీసుకోండి. లేదంటే చిక్కుల్లో పడాల్సి వస్తుంది. అవును.. వేడుకల నిర్వహణకు అనుమతి తప్పనిసరి అని రాచకొండ పోలీసులు తెలిపారు. పార్టీలు, ఇతర కార్యక్రమాల నిర్వాహకులు డిసెంబర్ 23 సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకుని పోలీసుల అనుమతి పొందాలని కోరారు. అనుమతి కోసం దరఖాస్తులను పోలీసు కమిషనర్ కార్యాలయంలో సమర్పించాలన్నారు.
“రాబోయే నూతన సంవత్సర వేడుకల దృష్ట్యా, ఈవెంట్‌లను నిర్వహించడానికి ఆసక్తి ఉన్నవారు అనుమతుల జారీ కోసం డిసెంబరు 23న లేదా అంతకు ముందు వ్రాతపూర్వకంగా దరఖాస్తును సమర్పించవచ్చు. దరఖాస్తు లేఖను రాచకొండలోని సీపీ కార్యాలయం, నేరేడ్‌మెట్‌లోని ఇన్‌వార్డ్ విభాగంలో సమర్పించవచ్చు ”అని పోలీసుల ప్రకటనలో పేర్కొన్నారు.
హోటళ్లు, పబ్‌లు, రెస్టారెంట్‌లు, గేటెడ్ కమ్యూనిటీలతో సహా నిర్వాహకులు నగరం అంతటా రాత్రి ఒంటి గంట వరకు మాత్రమే ఈవెంట్‌లను నిర్వహించుకునేందుకు అనుమతి ఉంటుందని పోలీసులు తెలిపారు. కపుల్స్ కోసం ప్రత్యేకంగా నిర్వహించే కార్యక్రమాల్లో మైనర్లను అనుమతించరాదని, హాజరైన వారి వయస్సును తనిఖీ చేయాలని, పార్టీలకు వచ్చినవారి గుర్తింపు కార్డుల కాపీని తప్పనిసరిగా సేకరించాలని పోలీసు అధికారులు సూచించారు. బహిరంగ ఈవెంట్‌లలో DJలు పర్మిషన్ లేదు. అయితే మ్యూజిక్ ఈవెంట్స్‌లో మాత్రం సౌండ్ ప్రాంగణం దాటి వినిపించకూడదు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..