Hyderabad: ఈ సీసీ కెమెరాలు మహా సెడ్డవప్ప.. చోరీ చేస్తూ అడ్డంగా దొరికిపోయిన చెంచులక్ష్మి..

Telangana: దేవుళ్లను నమ్మే మనుషుల్లారా.. మనుషులు చేసిన దేవుళ్లురా.. జరభద్రం బీ కేరఫుల్‌.. ఎందుకంటే.. చెంచు లక్ష్మీ రీ ఎంట్రీతో రఫ్పాడిస్తోంది మరి. ఎనీ సెంటర్‌.. ఎనీ టెంపుల్‌.. సింగిల్‌ హ్యాండెడ్‌గా ఖేల్‌ ఖతమ్‌ అనిపిస్తుంది.

Hyderabad: ఈ సీసీ కెమెరాలు మహా సెడ్డవప్ప.. చోరీ చేస్తూ అడ్డంగా దొరికిపోయిన చెంచులక్ష్మి..
Chenchu Lakshmi
Follow us

|

Updated on: Dec 16, 2022 | 7:32 PM

దేవుళ్లను నమ్మే మనుషుల్లారా.. మనుషులు చేసిన దేవుళ్లురా.. జరభద్రం బీ కేరఫుల్‌.. ఎందుకంటే.. చెంచు లక్ష్మీ రీ ఎంట్రీతో రఫ్పాడిస్తోంది మరి. ఎనీ సెంటర్‌.. ఎనీ టెంపుల్‌.. సింగిల్‌ హ్యాండెడ్‌గా ఖేల్‌ ఖతమ్‌ అనిపిస్తుంది. రీసెంట్‌గా ఏకంగా అంబర్‌పేట అంజన్న గుడిలోనే లూటీ చేసింది ఈ మామాలేడీ. అవును మరి.. చెంచులక్ష్మి ఒకప్పుడు పోలీస్‌ రికార్డులో మోస్ట్‌వాంటెడ్‌. అప్పట్లోనే తాళం వేసిన ఇళ్లే టార్గెట్‌గా సీరియల్‌ చోరీలతో చుక్కుల చూపించింది. దొరికితే జైలు.. ఆ తరువాత బెయిల్‌. పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు పోరళ్లతో విజిల్‌ పెట్రోలింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది.

అప్పట్లోనే దగ్గర దగ్గర హాఫ్‌ సెంచరీ కేసులు ఆమెపై ఉండేవి. ఇప్పుడు సెంచరినో.. డబుల్‌ సెంచరీనో.. లెక్కెంతో తెలీదు కానీ, రోజులు మారాయి కదా. నిఘా పెరగడంతో చెంచులక్ష్మి గ్యాంగ్‌ కనుమరుగైందనుకున్నారు. కానీ టెస్టులు.. వన్డేలు పోయి టీ 20 ఫార్మాట్‌ వచ్చినట్టుగా లేటెస్ట్‌ టెంపుల్‌ రన్‌తో రీ ఎంట్రీ ఇచ్చింది చెంచులక్ష్మి. అదీ సింగిల్‌ హ్యాండ్‌‌గా. తాజాగా అంబర్‌పేట బుర్జుగల్లీలోని అంజన్న గుడితో పాటు పూజారి ఇంట్లో చోరీకి పాల్పడింది చెంచులక్ష్మీనేనని గుర్తించారు పోలీసులు.

ఇన్నాళ్లు చెంచులక్ష్మి సందడి లేదు. ఎందుకంటే ఇన్ని రోజులు జైల్లోనే శిక్ష అనుభవించింది. ఇటీవలే జైలు నుంచి బయటకు వచ్చింది. రావడం రావడమే అంబర్‌పేటలో పంజా విసిరింది. సింగిల్‌గా వచ్చినా సివంగిలా పంజా విసరడం చెంచులక్ష్మి స్టయిల్‌. చోరీ చేసే క్రమంలో ఎవరొడ్డిచ్చినా సరే ఢీ అంటే ఢీ అనే టైపు. ఇక చోరీ కోసం టూల్స్ అండ్‌ టెక్నాలజీ మరో లెవల్‌. అంబర్‌పేటలో రీ ఎంట్రీ ఇచ్చిన చెంచులక్ష్మీ చోరీ కథా చిత్రమ్‌ సీసీ ఫుటేజ్‌లో తళుక్కుమంది. దాంతో పక్కా ఆధారాలతో చెంచులక్ష్మిని అరెస్ట్‌ చేసి చోరి ప్రాపర్టీని రికవరీ చేసిన ఎస్‌ రాంచందర్‌రాజు, మల్లేష్‌ అండ్‌ టీమ్‌ను అభినందించారు డిటెక్టివ్‌ ఇన్‌ప్పెక్టర్‌ ప్రభాకర్‌.

ఇవి కూడా చదవండి

తాజా చోరీ కేసుతో చెంచులక్ష్మి కథ మళ్లీ కటకటాలకు చేరింది. ఇక ఇటీవలి కాలంలో ఆలయాలే టార్గెట్‌గా సీరియల్‌ చోరీలు హడలెత్తిస్తున్నాయి. హుండీలను కొల్లగొట్టడం.. భయం భక్తి లేకుండా ఆ గర్బగుడిలోకి ప్రవేశించి నగలు ఎత్తుకెళ్లడం.. ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. తాజాగా యాదాద్రి జిల్లా మోత్కూరులో వేంకటేశ్వర స్వామి ఆలయంలో దొంగలు పడ్డారు. రెండు కిలోల వెండి కిరీటం, శంకు చక్రాలు, వీడియో రికార్డింగ్ సామగ్రి, పలు సామగ్రి ఎత్తుకెళ్లారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Latest Articles
Horoscope Today: ఆ రాశి వారి ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది
Horoscope Today: ఆ రాశి వారి ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది
ఇండియా వర్సెస్ ఇంగ్లండ్.. ఇరు జట్ల గత రికార్డులు ఎలా ఉన్నాయంటే?
ఇండియా వర్సెస్ ఇంగ్లండ్.. ఇరు జట్ల గత రికార్డులు ఎలా ఉన్నాయంటే?
షాకింగ్.. జింబాబ్వే సిరీస్‌కు తెలుగబ్బాయి నితీశ్ రెడ్డి దూరం..
షాకింగ్.. జింబాబ్వే సిరీస్‌కు తెలుగబ్బాయి నితీశ్ రెడ్డి దూరం..
ఉత్తరాదిని వణికిస్తున్న వర్షాలు.. వరదనీటిలో అల్లాడిపోతున్న ప్రజలు
ఉత్తరాదిని వణికిస్తున్న వర్షాలు.. వరదనీటిలో అల్లాడిపోతున్న ప్రజలు
మనిషి మాంసానికి రుచి మరిగిన లేడీ డాక్టర్.. ఓటీటీలో థ్రిల్లర్ మూవీ
మనిషి మాంసానికి రుచి మరిగిన లేడీ డాక్టర్.. ఓటీటీలో థ్రిల్లర్ మూవీ
ఏ ఆహారాలు తినడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది?
ఏ ఆహారాలు తినడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది?
రామ్ చరణ్‌ పక్కన ఉన్న అమ్మాయిని గుర్తుపట్టారా.?
రామ్ చరణ్‌ పక్కన ఉన్న అమ్మాయిని గుర్తుపట్టారా.?
హైకమాండ్‎తో చర్చలు సఫలం.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
హైకమాండ్‎తో చర్చలు సఫలం.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
జుట్టు ఒత్తుగా ఉండాలంటే ఇవి తినాల్సిందే.. జుట్టు రాలే సమస్య దూరం
జుట్టు ఒత్తుగా ఉండాలంటే ఇవి తినాల్సిందే.. జుట్టు రాలే సమస్య దూరం
ఏపీ టెన్త్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ లింక్
ఏపీ టెన్త్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ లింక్
విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై బీజేపీ ఎంపీ పురంధేశ్వరి స్పెషల్‌ ఫోకస్‌
విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై బీజేపీ ఎంపీ పురంధేశ్వరి స్పెషల్‌ ఫోకస్‌
'ప్రభాస్‌ ఫ్యాన్స్‌.. నన్ను క్షమించండి'.. వీడియో వైరల్..
'ప్రభాస్‌ ఫ్యాన్స్‌.. నన్ను క్షమించండి'.. వీడియో వైరల్..
కల్కి మూవీ టీం కు ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్.. వీడియో.
కల్కి మూవీ టీం కు ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్.. వీడియో.
250 కోట్లు అప్పు చుట్టుముట్టిన కష్ట - నష్టాలు.! చిక్కుల్లో రకుల్
250 కోట్లు అప్పు చుట్టుముట్టిన కష్ట - నష్టాలు.! చిక్కుల్లో రకుల్
దూసుకొస్తున్న గ్రహశకలం.. భూమిని ఢీ కొట్టే చాన్స్..
దూసుకొస్తున్న గ్రహశకలం.. భూమిని ఢీ కొట్టే చాన్స్..
డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలు.. ఉరికిన పోలీసులు. స్వయంగా సీఐకి ఫోన్
డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలు.. ఉరికిన పోలీసులు. స్వయంగా సీఐకి ఫోన్
సబ్బుపై కాలేసి మూడవ అంతస్తు నుంచి జారిపడ్డ మహిళ.. వీడియో వైరల్..
సబ్బుపై కాలేసి మూడవ అంతస్తు నుంచి జారిపడ్డ మహిళ.. వీడియో వైరల్..
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు..
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు..
శ్రీనివాసుని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి. ప్రత్యేక దర్శనం, లడ్డూ ధర
శ్రీనివాసుని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి. ప్రత్యేక దర్శనం, లడ్డూ ధర
ముంచుకొస్తున్న మ‌రో యుద్ధం.. యూఎన్ సెక్రట‌రీ జ‌న‌ర‌ల్‌వార్నింగ్.!
ముంచుకొస్తున్న మ‌రో యుద్ధం.. యూఎన్ సెక్రట‌రీ జ‌న‌ర‌ల్‌వార్నింగ్.!