Hyderabad: ఓ బెల్ట్ షాపులో తేడాగా మద్యం సీసాలు.. చెక్ చేస్తే ఏకంగా కోటి విలువైన..
Hyderabad: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో భారీ ఎత్తున నకిలీ మద్యం పట్టుబడింది. వేలు కాదు, లక్షలు కాదు.. కోటి రూపాయలకు పైగా విలువైన నకిలీ మద్యాన్ని సీజ్ చేశారు హయత్‌నగర్ ఎక్సైజ్ పోలీసులు.
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో భారీ ఎత్తున నకిలీ మద్యం పట్టుబడింది. వేలు కాదు, లక్షలు కాదు.. కోటి రూపాయలకు పైగా విలువైన నకిలీ మద్యాన్ని సీజ్ చేశారు హయత్‌నగర్ ఎక్సైజ్ పోలీసులు. హైదరాబాద్ శివారు ప్రాంతాలైన పెద్ద అంబర్ పేట్, హయత్ నగర్, చౌటుప్పల్, దేవల్లమ్మ నాగారం ఏరియాలో నకిలీ మద్యం డంప్‌ను గుర్తించిన ఎక్సైజ్ పోలీసులు.. ఆ డంప్‌ని స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో బెల్ట్ షాపుల్లో నకిలీ మద్యం అమ్ముతున్నట్లు హయత్‌నగర్ ఎక్సైజ్ పోలీసులు సమాచారం అందుకున్నారు. వెంటనే ఓ బృందం హయత్ నగర్, పెద్ద అంబర్ పేట్ సహా పలు ప్రాంతాల్లోని బెల్ట్ షాపుల్లో తనిఖీలు చేశారు. సాధారణ మద్యం కొనుగోలుదారుల్లా బెల్ట్ షాపులో మద్యం కొనుగోలు చేసిన ఎక్సైజ్ పోలీసులు.. అవి నకిలీవిగా గుర్తించారు.
బెల్ట్ షాపు నిర్వాహకుడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. నకిలీ మద్యం డంప్ గుట్టు రట్టైంది. అతనిచ్చిన సమాచారం మేరకు ఎక్సైజ్ పోలీసులు.. పెద్ద అంబర్ పేట్, హయత్ నగర్, చౌటుప్పల్, దేవలమ్మ నాగారం ఏరియాలో నకిలీ మద్యం డంప్‌ని గుర్తించారు. ఆ డంప్‌ను స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఈ డంప్ అంతా దేవలమ్మ నాగారానికి చెందిన ఓ బడా మద్యం వ్యాపారికి చెందినదిగా గుర్తించారు పోలీసులు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఎక్సైజ్ పోలీసులు.
పోలీసులు స్వాధీనం చేసుకున్న డంప్ ఇదే..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..