AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: చిందేస్తూ గుప్పున గుంజారు.. పోలీసుల ఎంట్రీతో ఉరుకులు పరుగులు.. కట్ చేస్తే..

పోలీసులు ఎన్ని దాడులు చేసినా...హైదరాబాద్‌లో పబ్బుల తీరు మారడం లేదు. ఎన్ని అరాచకాలు జరుగుతున్నా.. వాళ్లకు పైసలే ముఖ్యమా? అన్నట్లు వ్యవహరిస్తున్నారు. తాజాగా నార్కోటిక్ బ్యూరో, ఎస్‌వోటీ పోలీసులు దాడులు చేయడంతో అస్సలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. పబ్బులో గంజాయి, కొకైన్‌, మెత్‌ విచ్చలవిడిగా వినియోగించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

Hyderabad: చిందేస్తూ గుప్పున గుంజారు.. పోలీసుల ఎంట్రీతో ఉరుకులు పరుగులు.. కట్ చేస్తే..
Drugs Case
Shaik Madar Saheb
|

Updated on: Jul 07, 2024 | 1:32 PM

Share

హైదరాబాద్‌ నగరంలో పబ్బుల గబ్బు కల్చర్‌ కంటిన్యూ అవుతోంది. గంజాయి, కొకైన్‌లాంటి మత్తు పదార్థాలు వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. విచ్చలవిడి విష సంస్కృతికి బీజాలు వేస్తున్న పబ్బులపై నార్కోటిక్‌ పోలీసులు శనివారం రాత్రి రైడ్‌ చేశారు. ఈ సందర్భంగా పలువురిని అదుపులోకి తీసుకున్నారు. రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ది కేవ్ క్లబ్‌పై తాజాగా నార్కోటిక్ బ్యూరో, ఎస్‌వోటీ పోలీసులు దాడులు చేయడంతో అస్సలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. పబ్బులో గంజాయి, కొకైన్‌, మెత్‌ విచ్చలవిడిగా వినియోగించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

మణికొండలోని కేవ్ క్లబ్‌పై నార్కోటిక్‌ బ్యూరో అధికారులు అర్థరాత్రి దాడులు చేశారు. కేవ్ క్లబ్‌లో మొత్తం 55మందిని అదుపులోకి తీసుకుని టెస్టులు నిర్వహించారు. 24 మంది డ్రగ్స్‌ తీసుకున్నట్టు గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. అందులో డీజే గౌరవ్ కోకైన్‌ తీసుకున్నట్టు తేల్చారు పోలీసులు.

17మంది గంజాయి, ఇద్దరు గంజాయి + కొకైన్‌, నలుగురు గంజాయి + మెత్‌, ఒకరు మెత్ తీసుకున్నట్లు నిర్ధారణ అయింది.. ప్రస్తుతం పోలీసుల అదుపులో 24మంది ఉన్నారు. నార్కోటిక్‌బ్యూరో, SoT,లోకల్‌ పోలీసుల జాయింట్ ఆపరేషన్‌లో పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.. వీకెండ్స్ లో ప్లాన్ ప్రకారమే డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు సమాచారం..

మరి డ్రగ్స్‌ తీసుకున్నవారిలో బడా బాబులు ఎవరున్నారు? పోలీసుల లిస్టులో ఉన్న వారెవరు? తెలియాల్సి ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us