ఐటీ దాడులపై ‘మై హోమ్ గ్రూప్’ వివరణ!

హైదరాబాద్: రెండు రోజులుగా ‘మై హోమ్ గ్రూప్’ సంస్థలపై ఐటీ దాడులు జరుగుతున్నాయంటూ వివిధ మీడియాల్లో వస్తున్న కథనాలపై యాజమాన్యం స్పందించింది. బెంగళూరుకు చెందిన ఓ రియల్ ఎస్టేట్ కంపెనీపై ఐటీ దాడుల్లో భాగంగానే మై హోమ్ సంస్థల్లోనూ విచారణ చేపట్టారని మీడియాకు శనివారం అనగా జూలై 6న ఓ ప్రకటన ద్వారా తెలియజేసింది. హైదరాబాద్‌లో బెంగళూరుకు చెందిన సదరు రియల్ ఎస్టేట్ కంపెనీతో మై హోమ్స్ జాయింట్ వెంచర్‌గా ఉన్నందున వివిధ విషయాలపై ఐటీ అధికారులు […]

ఐటీ దాడులపై 'మై హోమ్ గ్రూప్' వివరణ!
Follow us

|

Updated on: Jul 06, 2019 | 11:59 PM

హైదరాబాద్: రెండు రోజులుగా ‘మై హోమ్ గ్రూప్’ సంస్థలపై ఐటీ దాడులు జరుగుతున్నాయంటూ వివిధ మీడియాల్లో వస్తున్న కథనాలపై యాజమాన్యం స్పందించింది. బెంగళూరుకు చెందిన ఓ రియల్ ఎస్టేట్ కంపెనీపై ఐటీ దాడుల్లో భాగంగానే మై హోమ్ సంస్థల్లోనూ విచారణ చేపట్టారని మీడియాకు శనివారం అనగా జూలై 6న ఓ ప్రకటన ద్వారా తెలియజేసింది.
హైదరాబాద్‌లో బెంగళూరుకు చెందిన సదరు రియల్ ఎస్టేట్ కంపెనీతో మై హోమ్స్ జాయింట్ వెంచర్‌గా ఉన్నందున వివిధ విషయాలపై ఐటీ అధికారులు వివరణ కోరారని సంస్థ వెల్లడించింది. ఐటీ అధికారులు కోరిన విధంగా పూర్తి సమాచారాన్ని అందించినట్లు స్పష్టం చేసింది. కాగా మై హోమ్ సంస్థ నియమ, నిబంధనలకు కట్టుబడి వ్యాపారం చేస్తుందని ఆ సంస్థ ప్రకటన ద్వారా పేర్కొంది.