Musheerabad water tank: వాటర్‌ ట్యాంక్‌లో డెడ్‌ బాడీ ఉన్నట్లుగా ఎలా తెలిసింది.. ముషిరాబాద్ కేసులో ఆసక్తికర విషయాలు..

డ్రింకింగ్ వాటర్‌ ట్యాంక్‌లో డెడ్‌ బాడీ అందర్నీ ఉలిక్కిపడేలా చేస్తోంది. నగరం నడిబొడ్డున.. లక్షలాది మంది నిత్యం తాగే నీళ్ల ట్యాంక్‌లో డీకంపోజ్డ్ డెడ్‌ బాడీ ఉండటం ప్రజల్ని ఆందోళనకు గురిచేస్తోంది. అసలు,.

Musheerabad water tank: వాటర్‌ ట్యాంక్‌లో డెడ్‌ బాడీ ఉన్నట్లుగా ఎలా తెలిసింది.. ముషిరాబాద్ కేసులో ఆసక్తికర విషయాలు..
Drinking Water Tap
Follow us
Sanjay Kasula

|

Updated on: Dec 08, 2021 | 12:09 PM

Musheerabad Water Tank: డ్రింకింగ్ వాటర్‌ ట్యాంక్‌లో డెడ్‌ బాడీ అందర్నీ ఉలిక్కిపడేలా చేస్తోంది. నగరం నడిబొడ్డున.. లక్షలాది మంది నిత్యం తాగే నీళ్ల ట్యాంక్‌లో డీకంపోజ్డ్ డెడ్‌ బాడీ ఉండటం ప్రజల్ని ఆందోళనకు గురిచేస్తోంది. అసలు, ఎన్ని రోజులుగా డెడ్ బాడీ ఆ ట్యాంక్‌లో ఉంది? నాలుగు రోజులా? నెల రోజులా? లేక అంతకంటే ఎక్కువా? అసలన్ని రోజులుగా శవం కుళ్లిన నీళ్లు సప్లై అవుతుంటే వాటర్ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్ ఏం చేస్తోంది? ఆ నీళ్లు తాగుతోన్న ప్రజలు అనారోగ్యంపాలైతే బాధ్యత ఎవరిది? ముషీరాబాద్‌ ఇన్సిడెంట్‌లో వాటర్ వర్క్స్ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ట్యాంక్‌ నిర్వహణను గాలికొదిలేసిన వాటర్ వర్క్స్ సిబ్బంది.. ఏడాదిగా అటువైపే చూడలేదంటున్నారు స్థానికులు.

డెడ్‌ బాడీ ఎప్పట్నుంచి వాటర్‌ ట్యాంక్‌లో డీకంపోజ్‌ అవుతుందో పక్కనబెడితే వేలాది కుటుంబాలు.. ఈ నీళ్లనే తాగుతున్నాయి. రిసాలగడ్డ ఓవర్ హెడ్‌ వాటర్ ట్యాంక్ నుంచి శివస్తాన్‌పూర్, ఎస్‌ఆర్కేనగర్, పద్మశాలి సంఘం, హరినగర్‌ కాలనీలకు వాటర్ సప్లై జరుగుతోంది.

వాటర్‌లో వెంట్రుకలు, చిన్నచిన్న మాంసపు ముక్కలు వస్తున్నాయని చెప్పాకే వాటర్ వర్క్స్‌ సిబ్బంది కదిలారు. క్లీన్ చేయడానికి రావడంతో ఈ డెడ్ బాడీ బయటపడింది. అంటే, ఏ రేంజ్‌లో వాటర్ వర్క్స్ నిర్లక్ష్యం ఉందో అర్ధం చేసుకోవచ్చు.

సాధారణంగా జబ్బులన్నీ నీళ్లు, గాలి ద్వారానే వస్తాయి. మరి, ముషీరాబాద్‌లో వేలాది కుటుంబాలు కొన్నిరోజులుగా డెడ్‌ బాడీ డీకంపోజైన నీళ్లనే తాగారు. ఈ నీళ్లు తాగినవాళ్లు సేఫేనా? వీళ్లంతా ఎలాంటి అనర్ధాలను ఎదుర్కోబోతున్నారు. అన్నది ఇప్పుడు వాటర్ వర్క్ డిపార్ట్‌మెంట్‌తోపాటు జీహెచ్ఎంసీ అధికారుల్లో టెన్షన్ మొదలైంది.

ఇవి కూడా చదవండి: చేపలు అమ్ముకునే మహిళను బస్సు ఎక్కనివ్వని అధికారులు.. కన్యాకుమారిలో ఆధునిక అనాగరికం..

Beauty Tips: చలికాలంలో జుట్టు, చర్మం పొడిబారడం వల్ల ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ హోం రెమెడీస్ ప్రయత్నించండి..