సిటీలో టాయిలెట్స్ మెయింటెనెన్స్‌పై అధికారులను నిలదీసిన మంత్రి కేటీఆర్.. అలాగే వదిలేద్దామా అంటూ ఫైర్..
పబ్లిక్ సమస్యలను సాల్వ్ చేస్తూనే నగర సుందరీకరణపై దృష్టి పెడుతోంది ప్రభుత్వం. అందులో భాగంగా ఇటీవల టీవీ9 ప్రసారం చేసిన టాయిలెట్ల సమస్యపై సమీక్ష చేసిన మంత్రి కేటీఆర్.. అధికారుల అలసత్వాన్ని తూర్పారబట్టారు. పారిశుద్యలోపం, టాయిలెట్ల క్లీనింగ్‌పై నిరంతరం దృష్టి పెట్టకుంటే.. ఎలా అంటూ ప్రశ్నించారు.
హైదరాబాద్‌లో ఆధునిక హంగులతో కోట్ల రూపాయలతో నిర్మించిన టాయిలెట్ల నిర్వహణ లోపంపై టీవీ9లో ప్రసారం అయిన కథనాలను మంత్రి కేటీఆర్ సీరియస్‌గా తీసుకున్నారు. వరుసగా వాటి నిర్వహణపై అధికారులను ఆరా తీస్తున్నారు. అంతలా శ్రమించిన కట్టించిన టాయిలెట్లను పట్టించుకోకపోవడంపై ఫైర్ అయిన మంత్రి కేటీఆర్.. సోమవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన ఆఫీసులో గ్రేటర్ అభివృద్ధి పనులపై సమీక్షించారు.
గ్రేటర్ హైదరాబాద్‌లో శానిటేషన్, రహదారులు, నాలా విభాగాలపై మంత్రి కేటీఆర్ ఈ సమీక్ష చేశారు. బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి అధికారులతో భేటీ అయ్యారు. గ్రేటర్‌లో పారిశుధ్యం, టాయిలెట్ల నిర్వహణపై అడిగి తెలుసుకున్నారు. జోనల్ కమిషనర్ల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సిటీలో పారిశుధ్య లోపంతో పాటు టాయిలెట్స్ మెయింటెనెన్స్ చేయకపోవడంపై నిలదీసిన మంత్రి.. వాటిని అలాగే వదిలేద్దామా అని ప్రశ్నించారు.
అటు.. ట్రాఫిక్ ఫ్రీ సిటీ కోసం నిర్మిస్తున్న రోడ్ అండర్ బ్రిడ్జిలో మరో మైలురాయి దాటింది. కూకట్‌పల్లి, హైటెక్‌సిటీ మధ్య నిర్మించిన ఆర్‌యూబీని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు కింద ఈ రోడ్ అండ్ బ్రిడ్జిని 66 కోట్లతో పూర్తిచేశారు. ఇకపై ఈ మార్గంలో శాశ్వత ట్రాఫిక్ ఇబ్బందులు తొలగిపోనున్నాయి.
ఈ ఆర్‌యూబీ నిర్మాణానికి ముందు.. శేరిలింగంపల్లి నుంచి వచ్చే వరదనీరు ఈ బ్రిడ్జి కింద నుంచే వెళ్లేది. దాంతో ఎప్పుడూ నీరు నిలిచిపోవడం వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు వరదనీటిని నిల్వ చేసేందుకు బ్రిడ్జి కింద పెద్ద సంపును నిర్మించారు. అందులోని నీటిని మూసాపేట సర్కిల్‌లో హరితహారం మొక్కలకు అందిస్తున్నారు.
తకుముందు మూసాపేటలో బీడీసీసీ రోడ్డు నిర్మాణ పనులను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అంబేడ్కర్‌నగర్ నుంచి డంపింగ్ యార్డు వరకు రోడ్డు నిర్మాణం జరగనుంది. నగర శివారు మున్సిపాలిటీల్లో సమగ్ర డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. దీనికోసం రూ.3,500 కోట్లు ఖర్చు చేస్తామన్నారు.