Hyderabad: విడాకుల కోసం వచ్చిన మహిళను ట్రాప్ చేసిన లాయర్.. వీడియోలు తీసి.. శారీరకంగా

విడాకుల కోసం తన వద్దకు వచ్చిన మహిళను ఓ లాయర్ ట్రాప్ చేశాడు. లైఫ్ లో భాగస్వామితో విబేధాలతో బాధలో ఉన్న ఆమెను మరింత టార్చర్ చేశాడు.

Hyderabad: విడాకుల కోసం వచ్చిన మహిళను ట్రాప్ చేసిన లాయర్.. వీడియోలు తీసి.. శారీరకంగా
Representative image
Follow us

|

Updated on: Jan 22, 2022 | 2:42 PM

ఆమెకు వైవాహిక బంధంలో ఇబ్బందులు తలెత్తాయి. భర్తతో కలిసి ప్రయాణం సాగించడం కష్టం అనిపించింది. విడాకుల తీసుకుని.. తన దారిలో తాను నడవాలని నిర్ణయించకుంది. ఈ క్రమంలో విడాకులు ఇప్పించాలని ఓ లాయర్‌ను ఆశ్రయించింది. కాగా లైఫ్ లో డిస్టబ్ అయ్యి.. నైరాశ్యంలో ఉన్న ఆ మహిళపై సదరు లాయర్ కన్నేశాడు. మాయమాటలు చెప్పి.. వీడియోలు తీసి.. బెదిరించి ఆమెను లోబరుచుకున్నాడు. అనంతరం పదే, పదే వేధిస్తూ ఉండటంతో.. ఆమె ఇక తాళలేక పోలీసులను ఆశ్రయించింది.  మల్కాజిగిరి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేసే మహిళ(25)కు రెండేళ్ల క్రితం పెళ్లైంది. భర్తతో మనస్పర్థలు తలెత్తడంతో విడాకులు తీసుకునేందుకు గతేడాది జూన్‌లో ఓ లాయర్‌ను కలిసింది. ఈ క్రమంలోనే.. కట్టుకథలు చెప్పి పలుమార్లు తన ఆఫీసుకు రప్పించుకున్న లాయర్ ఆమెతో చనువు పెంచుకున్నాడు. బాధితురాలు అద్దెకు ఇల్లు వెతుకుతోందని తెలుసుకుని… తాను నివసించే ప్రాంతంలోనే ఒక ఫ్లాట్‌ బాగుందని చెప్పి.. అందులో దిగేలా చేశాడు.

ఇక్కడే అతడు తన గేమ్ ప్లాన్ ను అమలు చేశాడు. ఆ ఫ్లాట్ లో  ఆమెకు తెలియకుండా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాడు. బాధితురాలు దుస్తులు మార్చుకునే సమయంలో వీడియోలు షూట్ చేశాడు. ఆ వీడియోలను బాధితురాలికి చూపించి.. బెదిరించి శారీరకంగా లోబరుచుకున్నాడు. తనను వదిలేయాలని ఆమె వేడుకున్న ఆ న్యాయవాది అస్సలు పట్టించుకోలేదు. పైగా అతడి వేధింపులు రోజురోజుకు మరింత పెరుగుతూ ఉండటంతో..   విసిగి వేసారిపోయిన బాధితురాలు మల్కాజిగిరి పోలీసులకు కంప్లైంట్ చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేస్తోన్న వధువును చెంపపై కొట్టిన వరుడు.. ఆమె దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ