Viral: పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేస్తోన్న వధువును చెంపపై కొట్టిన వరుడు.. ఆమె దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది

పెళ్లంటనే సంబంరం.. బంధుమిత్రులతో ఇళ్లంతా సందడిగా ఉంటుంది. ఇక సంగీత్ అంటే చెప్పేది ఏముంది. అందరూ డ్యాన్స్ చేస్తారు. డ్యాన్స్ తెలియనివారు సైతం కాలు కదుపుతారు.

Viral: పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేస్తోన్న వధువును చెంపపై కొట్టిన వరుడు.. ఆమె దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది
Representative image
Follow us

|

Updated on: Jan 21, 2022 | 3:48 PM

పెళ్లంటనే సంబంరం.. బంధుమిత్రులతో ఇళ్లంతా సందడిగా ఉంటుంది. ఇక సంగీత్ అంటే చెప్పేది ఏముంది. అందరూ డ్యాన్స్ చేస్తారు. డ్యాన్స్ తెలియనివారు సైతం కాలు కదుపుతారు. డీజే సాండ్ తో ఆ ఏరియా అంతా మోత మోగిపోతుంది. ఆనందం రెట్టింపు అవుతుంది.  అయితే తమిళనాడు కడలూరులోని పన్రుటిలో మాత్రం ఇందుకు రివర్స్ సీన్ జరిగింది. సంగీత్ కారణంగా వివాహం అర్ధాంతరంగా ఆగిపోయింది. తెల్లారితే పెళ్లి అనగా.. వధువు తనకు అతడితో వివాహం ఇష్టం లేదని ఖరాఖండీగా చెప్పేసింది. ఆమె మాటకు తల్లిదండ్రులు కూడా ఎదురు చెప్పలేదు. దీంతో అక్కడకు వచ్చిన వారంతా షాక్​ తిన్నారు. వివరాల్లోకి వెళ్తే..  జనవరి 20వ తేదీన పెళ్లికి ఇరు కుటుంబాలు అన్ని ఏర్పాట్లు చేశాయి. అంతా సిద్ధమైపోయింది. పెళ్లికి ముందు రోజు సాయంత్రం రెండు కుటుంబాలు కలిసి రిసెప్షన్​ ఏర్పాటు చేశాయి. తరువాత సంగీత్​ నిర్వహించారు. అందులో డీజే కూడా పెట్టించారు. ఈ సందర్భంగా వేడుకకు వచ్చిన బంధువులు, ఫ్రెండ్స్ తో కలిసి వధువు డ్యాన్స్​ చేసింది. అయితే కాబోయే భార్య అలా డ్యాన్స్ చేయడం వరుడుకి ఇబ్బందిగా అనిపించింది. వెంటనే పెళ్లి కూతురు దగ్గరకు వచ్చి డ్యాన్స్​ ఆపమని అన్నాడు. స్టేజ్​ పైకి పిలిచి.. అందరూ చూస్తుండగానే ఆమెను గట్టిగా లాగి చెంప దెబ్బకొట్టాడు.

దీంతో హర్టయిన వధువు.. పెళ్లి ఆపేయాలని తల్లిదండ్రులకు చెప్పింది. కూతురు కోరిన విధంగా తల్లిదండ్రులు పెళ్లి ఆపేసి రాత్రికి రాత్రే మండపం నుంచి ఇంటికి వచ్చారు. అయితే చివర్లో ట్విస్ట్ ఏంటంటే… పెళ్లి ఆగలేదు.  వారికి తెలిసిన సమీప బంధువుతో ముందుగా నిశ్చియించిన ముహుర్తానికే ఆమెకు పెళ్లి చేశారు.

Also Read:  ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు తీసుకున్న రాష్ట్ర మంత్రివర్గం

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ