Hyderabad: ఇంటికి రావాలని ఫోన్ చేసిన ప్రియురాలు.. తీరా అక్కడకు వెళ్లాక షాకింగ్ ట్విస్ట్..! వామ్మో.. వాయ్యో.. అంటూ..
ప్రేమ తెచ్చే కష్టాలు అన్నీ ఇన్నీ కావు.. ప్రేమలో పడినప్పటినుంచే కష్టాలే.. కష్టాలే.. ఇవేవో మేము చెబుతున్న మాటలు కాదు.. స్వయంగా ప్రేమికులే.. ఎన్నో సందర్భాల్లో చెప్పారు.. ఈ సంఘటన గురించి వింటే.. మీరు చెబుతారు ఇదే విషయాన్ని.. పాపం ఆ ప్రియుడు ప్రియురాలు పిలిచింది అని ఆత్రుతగా వెళ్లాడు.. చివరకు అమ్మాయి బంధువుల చేతిలో చావు దెబ్బలు తిన్నాడు. ఇది జరిగింది ఎక్కడో కాదు.. మన తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలిస్తే మీరు కూడా అయ్యో పాపం.. అని అనకుండా ఉండలేరు..

ఇంటికి రావాలని ప్రియురాలు ఫోన్ చేయగానే.. ప్రియుడు ఆగమేఘాలమీద వెంటనే అక్కడకు వెళ్లాడు.. అప్పుడే ఓ షాకింగ్ ట్విస్ట్ జరిగింది.. ఈ షాకింగ్ ఘటన హైదరాబాద్ నగరంలోని పాతబస్తీలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ప్రియురాలు పదేపదే ఫోన్ చేసి ఇంటికి రమ్మని పిలవగానే దొంగ చాటుగా గోడ దూకి ఇంట్లోకి వెళ్ళాడు ఓ యువకుడు. ఇద్దరు ముచ్చటగా బాతాఖానీ మొదలుపెట్టారు. అంత బాగానే ఉంది అనుకుంటూ ఉండగా ఒక్కసారిగా ప్రియుడిపై దాడి చేయడం మొదలుపెట్టారు అక్కడికి వచ్చిన కొందరు.. రక్తం వచ్చేలా కొడుతూ ఆ యువకుడిని చాలా ఇబ్బంది పెట్టారు. ఆ దెబ్బలకు తట్టుకోలేక ఆ యువకుడు కేకలు వేసుకుంటూ పారిపోయే ప్రయత్నం చేశాడు. కానీ అప్పటికప్పుడు ఎటు పోవాలో ఎలా తప్పించుకోవాలో అతనికి అర్థం కాలేదు.
ఈ క్రమంలోనే ఎలాగొలా బయటపడాలి అనుకున్నాడు. వెంటనే అనుకున్నదే తడవుగా ఆ ప్రియురాలి ఇంట్లోనే ఓ గదిలోకి వెళ్లిపోయాడు.. ఆ వెంటనే ఓ సెల్ఫీ వీడియో రికార్డు చేశాడు. తను ఎక్కడ ఉన్నదీ.. ఏం జరిగింది అంతా వివరంగా తెలుపుతూ మొత్తం తన సమస్యను వీడియోగా తీశాడు. ఆ తర్వాత పోలీసులకు ఫోన్ చేసి తను తీసిన వీడియోను వారికి పంపించాడు. ఇది తెలుసుకున్న పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఆ యువకుడు ఇచ్చిన డిటైల్స్ ఆధారంగా లొకేషన్ కనుక్కున్నారు. ఆ ఇంటికి వెళ్లి యువకుడిని రక్షించి బయటికి తీసుకొచ్చారు.
వీడియో చూడండి..
ఆ తర్వాత ఇంకో సీన్ మొదలైంది.. తనకు న్యాయం చేయాలంటూ పోలీసులతో మొర పెట్టుకున్న యువకుడు.. ప్రియురాలితో మాట్లాడే అవకాశం తనకు కల్పించాలంటూ ప్రాధేయపడ్డాడు.. చివరకు పోలీసులు ఎలాగొలా అతన్ని సముదాయించారు.. తనపై దాడి చేిస గాయపరిచిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదుచేశాడు. బాధితుడు, అతని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పాతబస్తీ బండ్లగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం కేసు విచారణలో ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..