AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lulu Hypermarket: వామ్మో.. కూకట్‌పల్లి లూలూ మార్కెట్‌ బండారం ఇదా? ఫుడ్‌సేఫ్టీ తనిఖీల్లో దారుణాలు

తీవ్రమైన ఆహార భద్రతా ఉల్లంఘనలు, అపరిశుభ్రత పరిస్థితులు, కుళ్ళిపోయిన కూరగాయలు, చిరిగిన- తప్పుదారి పట్టించే లేబుల్‌లతో ఉన్న గడువు ముగిసిన ప్యాక్ చేసిన ఆహార పదార్థాలు.. ఇదీ హైదరాబాద్ మహా నగరంలోని ప్రముఖ లూలూ హైపర్‌మార్కెట్‌లో దర్శనమిచ్చిన శుభ్రత. పైకి ఎంతో విలాసవంతంగా కనిపించే ఈ షాప్.. ఫుడ్ సేఫ్టీ తనిఖీల్లో పైన పటారం లోన లొటారంలా..

Lulu Hypermarket: వామ్మో.. కూకట్‌పల్లి లూలూ మార్కెట్‌ బండారం ఇదా? ఫుడ్‌సేఫ్టీ తనిఖీల్లో దారుణాలు
Lulu Hypermarket In Kukatpally
Srilakshmi C
|

Updated on: May 19, 2026 | 12:04 PM

Share

హైదరాబాద్‌, మే 19: నగరంలోని కల్తీ రాయుళ్లపై ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్‌ కొరడా విధిలించింది. పలు షాపులు, హోటళ్లు, సూపర్ మార్కెట్లపై ఆకస్మిక దాడులు జరుపుతుంది. ఈ క్రమంలో కూకట్‌పల్లిలోని ప్రముఖ లూలూ హైపర్‌మార్కెట్‌లో ఆహార భద్రతా శాఖ కమిషనర్ ఆకస్మిక తనిఖీ నిర్వహించించింది. ఈ దాడిలో స్వీట్లు, నూనెలు, పిండి, మాంసం, పప్పుధాన్యాలతో సహా మొత్తం 150 కిలోగ్రాముల సురక్షితం కాని ఆహార పదార్థాలను ఆహార భద్రతా అధికారులు స్వాధీనం చేసుకుంది.

తీవ్రమైన ఆహార భద్రతా ఉల్లంఘనలు, అపరిశుభ్రత పరిస్థితులు, కుళ్ళిపోయిన కూరగాయలు, చిరిగిన- తప్పుదారి పట్టించే లేబుల్‌లతో ఉన్న గడువు ముగిసిన ప్యాక్ చేసిన ఆహార పదార్థాలు గుర్తించారు. అంతేకాకుండా రిఫ్రిజిరేటర్లలో మిగిలిపోయిన ఆహారం నిల్వ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ లూలూ హైపర్‌మార్కెట్‌లో అనేక ఉత్పత్తులకు FSSAI లైసెన్స్ కూడా లేదు. పైగా షాప్‌ లోపల నేలంతా పురుగులతో అపరిశుభ్రంగా ఉంది. శనగపిండి, గోధుమ పిండి, పప్పుల ప్యాకెట్లలో సైతం పురుగులు కనిపించాయి.

ఇవి కూడా చదవండి

మాంసం విభాగంలో ఘాటైన కుళ్లు వాసన వెలువడటంతో పాటు, మురుగునీటి కాలువలు మూసుకుపోయి కనిపించాయి. అక్కడి పరిస్థితులు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు కలిగించేవిగా దర్శనమిచ్చాయి. ఇక మాంసం కోసే ప్రాంతం, రిటైల్ విభాగం, ఇన్‌ హౌస్‌ కిచెన్‌తో సహా దాదాపు ప్రతి సెక్షన్‌లోనూ తీవ్రమైన ఉల్లంఘనలు కనించాయి. దీంతో మాల్‌లోని ఆహార పదార్ధాల నమూనాలను సేకరించి, వాటిని ల్యాబ్ పరీక్ష కోసం అధికారులు పంపించారు. నిత్యం రద్దీగా ఉండే కూకట్‌పల్లీ లూలూ హైపర్‌ మార్కెట్లో పెద్ద ఎత్తున ఆహార పదార్ధాలను సీజ్‌ చేశారు. అపరిశుభ్ర వాతావరణంలో ఆహార పదార్ధాలను విక్రయిస్తున్న లూలూ మార్కెట్‌ బండారం బయటపడటంతో జనాలు అప్రమత్తమయ్యారు. పైకి ఎంతో విలాసవంతంగా కనిపించే ఇలాంటి మార్కెట్లలో సరుకులు కొనుగోలు చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించే పరిస్థితి నెలకింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us
90s డ్రీమ్ గర్ల్ మహేశ్వరి వారసురాలు.. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్..
90s డ్రీమ్ గర్ల్ మహేశ్వరి వారసురాలు.. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్..
నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపం
నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపం
తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ.. ఇంట్లోనే ఈజీగా..
తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ.. ఇంట్లోనే ఈజీగా..
వానల్లేవు.. ఉపాధి లేదు.. వలస పోతున్న జనం..
వానల్లేవు.. ఉపాధి లేదు.. వలస పోతున్న జనం..
యమ్మీ యమ్మీగా చిప్స్‌ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? డేంజర్
యమ్మీ యమ్మీగా చిప్స్‌ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? డేంజర్
పవన్ కల్యాణ్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం..అల్లు అరవింద్ స్పెషల్ విషెస్
పవన్ కల్యాణ్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం..అల్లు అరవింద్ స్పెషల్ విషెస్
విండీస్ సిరీస్‌తోనే కెరీర్ క్లోజ్.. టీమిండియాలో ఇకపై నో ఛాన్స్..!
విండీస్ సిరీస్‌తోనే కెరీర్ క్లోజ్.. టీమిండియాలో ఇకపై నో ఛాన్స్..!
మోకులేకుండా తాటిచెట్టుపైకి..గీతకార్మికులను ఆశ్చర్యపరుస్తున్న రైతు
మోకులేకుండా తాటిచెట్టుపైకి..గీతకార్మికులను ఆశ్చర్యపరుస్తున్న రైతు
దసరా స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి 25కు పైగా సినిమాలు
దసరా స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి 25కు పైగా సినిమాలు
ఇంట్లో కూరగాయలు లేనప్పుడు 2 ఉల్లిపాయలతో ఇలా చేయండి
ఇంట్లో కూరగాయలు లేనప్పుడు 2 ఉల్లిపాయలతో ఇలా చేయండి