Telangana: మియాపూర్ మెట్రో వద్ద లారీ బీభత్సం..ట్రాఫిక్ కానిస్టేబుల్ మృతి
ప్రస్తుత రోజుల్లో ఇంటి నుంచి బయటకు వెళ్లిన వారు.. తిరిగి క్షేమంగా ఇంటికి వస్తారో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. కొందరి నిర్లక్షం కారణంగా ఎన్నో కుటుంబాల జీవితాలు తలకిందులు అయిపోతున్నాయి. రోజులాగే విధులు నిర్వహించేందుకు వచ్చిన ఓ కానిస్టేబుల్.. తిరిగి రానిలోకాలకు వెళ్లిపోయాడు. ఓ లారీ డ్రైవర్ నిర్లక్ష్యం..ఆ కానిస్టేబుల్ ఫ్యామిలీకి తీరనిలోటును మిగిల్చింది.

Hyderabad: హైదరాబాద్ లోని మియాపూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మెట్రో స్టేషన్ వద్ద ఓ లారీ బీభత్సం సృష్టించింది. కూకట్ పల్లి వైపు నుంచి వేంగంగా దూసుకొచ్చిన లారీ విధుల్లో ఉన్న ముగ్గురు ట్రాఫిక్ కానిస్టేబుళ్లను ఢీకొట్టింది. ప్రమాదంలో సింహాచలం అనే కానిస్టేబుల్ మరణించగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
మియాపూర్ ట్రాఫిక్ పీఎస్ కు చెందిన కానిస్టేబుళ్లు సింహాచలం, రాజవర్ధన్, విజేందర్. సోమవారం రాత్రి మియాపూర్ లోని మెట్రో పిల్లర్ 600 వద్ద విధులు నిర్వహిస్తున్నారు. ఆదే సమయంలో కూకట్ పల్లి నుంచి వేగంగా దూసుకువచ్చిన ఓ లారీ.. విధుల్లో ఉన్న కానిస్టేబుళ్లను ఢీకొట్టింది. ప్రమాదంలో కానిస్టేబుల్ సింహాచలం మృతి చెందగా..రాజవర్ధన్, విజేందర్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు గాయపడిన కానిస్టేబుళ్లను మదీనాగూడలోని ఓ ప్రైవేటు హాస్పటల్‌కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు లారీ డ్రైవర్ శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్ నిర్లక్షం, అతివేగం కారణంగానే ప్రమాదం జరిగినట్టు పోలీసులు చెబుతున్నారు.




