Hyderabad: లిక్కర్ ప్రియులకు బ్యాడ్‌న్యూస్.. రేపు మద్యం షాపులు బంద్!
Hyderabad: మద్యం షాపులు మూసివేస్తున్నారంటే మందుబాబులకు బ్యాడ్ న్యూసే. ఎందుకంటే లిక్కర్ ప్రియులకు మద్యం లేనిది రోజు గడవదు. అలాంటిది షాపులు బంద్ ఉండనున్నాయంటే అప్రమత్తమైపోతారు. ముందు రోజే మద్యాన్ని తెచ్చుకుని పెట్టుకుంటారు. మార్చి 14న మద్యం షాపులు మూసివేయనున్నట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు..

హోలీ పండుగ సందర్భంగా మార్చి 14న ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలను మూసివేయాలని రాచకొండ పోలీస్ కమిషనర్ జి సుధీర్ బాబు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని స్టార్ హోటళ్లు, క్లబ్‌లకు అనుబంధంగా ఉన్న వైన్ షాపులు, కల్లు దుకాణాలు, రెస్టారెంట్లకు అనుబంధంగా ఉన్న బార్‌లు (స్టార్ హోటళ్లలోని బార్‌లు, రిజిస్టర్డ్ క్లబ్‌లను మినహాయించి) పండుగ రోజున మూసివేయనున్నట్లు కమిషనర్ తెలిపారు.
చికాకు కలిగించవద్దు- పోలీసుల హెచ్చరిక
హోలీ పండుగను దృష్టిలో ఉంచుకుని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మొహంతి బుధవారం ఒక ఉత్తర్వు జారీ చేశారు. తెలియని వ్యక్తులు, ప్రదేశాలు, వాహనాలపై రంగులు లేదా నీటిని చల్లడం లేదా రోడ్లపై వ్యక్తులను రంగులు పూయడం వంటివి చేయవద్దని హెచ్చరించారు.
గుంపులు గుంపులుగా వాహనాలపై రోడ్లపై తిరగకుండా, ఇతరులకు అసౌకర్యం కలిగించే విధంగా తిరగకుండా నిషేధించనున్నారు పోలీసులు. ఈ ఆర్డర్ మార్చి 14 ఉదయం 6 గంటల నుండి మార్చి 15 ఉదయం 6 గంటల వరకు అమలులో ఉంటుంది.
ఇది కూడా చదవండి: ఇక ATM, PhonePe, GooglePay, Paytm, BHIM యాప్ ద్వారా పీఎఫ్ డబ్బు విత్‌డ్రా!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి