కంచ గచ్చిబౌలిలోని భూముల వ్యవహారం.. సీఎం రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించాలి: కిషన్ రెడ్డి
కంచ గచ్చిబౌలిలోని భూముల వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు.. కీలక ఆదేశాలు జారీ చేసింది. రిజిస్ట్రార్ స్పాట్‌కి వెళ్లి రిపోర్ట్ అందించారని.. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు ప్రభుత్వ చర్యలు నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. పర్యావరణ, ఫారెస్ట్ అనుమతులు తీసుకున్నారా.. అత్యవసరంగా ఎందుకు పనులు చేపట్టారని ప్రశ్నించింది.

కంచ గచ్చిబౌలిలోని భూముల వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు.. కీలక ఆదేశాలు జారీ చేసింది. రిజిస్ట్రార్ స్పాట్‌కి వెళ్లి రిపోర్ట్ అందించారని.. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు ప్రభుత్వ చర్యలు నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. పర్యావరణ, ఫారెస్ట్ అనుమతులు తీసుకున్నారా.. అత్యవసరంగా ఎందుకు పనులు చేపట్టారని ప్రశ్నించింది. అఫిడవిట్ దాఖలు చేయాలని తెలంగాణ సీఎస్‌ను ఆదేశించింది. ఏదైనా ఉల్లంఘన జరిగితే సీఎస్‌దే బాధ్యత అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఒక్క రోజులో వంద ఎకరాల్లో చెట్లు కొట్టేయడం మామూలు విషయం కాదని.. తమ ప్రశ్నలకు సీఎస్ సమాధానం చెప్పాలని సుప్రీం ఆదేశించింది. వీటన్నింటిపై అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన సుప్రీం కోర్టు.. తదుపరి విచారణను ఈ నెల 16కి వాయిదా వేసింది. కాగా.. సుప్రీంకోర్టు ఆదేశాలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల పచ్చదనాన్ని కాపాడటంపై తక్షణ స్టే మంజూరు చేయడం, సకాలంలో జోక్యం చేసుకున్నందుకు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి సుప్రీంకోర్టుకు కృతజ్ఞతలు తెలిపారు.
2016 నుంచి IUCN (ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్) రెడ్ లిస్ట్ కింద వర్గీకరించిన స్టార్ తాబేలుతో సహా గొప్ప జీవవైవిధ్యం ఉన్న ఈ ప్రాంతంలోని అనేక జంతు, వృక్ష జాతుల రక్షణలో ఇది మొదటి అడుగు.. సుప్రీం కోర్టు ఉదయం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వు ఉన్నప్పటికీ, కంచ గచ్చిబౌలి ప్రాంతంలో సుప్రీంకోర్టు ఆదేశానికి విరుద్ధంగా చెట్ల నరికివేతతో సహా భారీ కార్యకలాపాలు ఇప్పటికీ చేపట్టడం దురదృష్టకరం.. అంటూ కిషన్ రెడ్డి ప్రకటనలో పేర్కొన్నారు.
My gratitude to the Hon’ble Supreme Court for their timely intervention by granting an immediate stay and protecting 400 acres of Green cover in Kancha Gachibowli.
The SC has until further orders clearly stated that no activity of any sort, except protection of trees already… https://t.co/xUmIwb0IXd
— G Kishan Reddy (@kishanreddybjp) April 3, 2025
తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ నివేదిక ద్వారా కోర్టు స్వయంగా చూసిన దాని ప్రకారం.. గత 3 రోజులుగా దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో అనేక చెట్లు నరికివేశారు.. పెద్ద సంఖ్యలో యంత్రాలను మోహరించి దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో కార్యకలాపాలు చేస్తున్న దృశ్యం కనిపించింది. ఆ ప్రాంగణంలో నెమళ్ళు – జింకలు కనిపించినందున, కోర్టు సుమోటో రిట్ పిటిషన్‌ను నమోదు చేయడం సముచితమని భావించింది.. దీని ద్వారా ఈ క్రింది ప్రశ్నలపై సమాధానం దాఖలు చేయాలని తెలంగాణ ప్రధాన కార్యదర్శిని ఆదేశించిందని.. దీనికి సంబంధించిన వివరాలను కిషన్ రెడ్డి ప్రకటనలో వివరించారు.
1. ఆరోపించిన అటవీ ప్రాంతం నుండి చెట్ల తొలగింపుతో సహా విధ్వంసక కార్యకలాపాలను చేపట్టాల్సిన అత్యవసర పరిస్థితి
2. అటువంటి కార్యకలాపాల కోసం, రాష్ట్రం పర్యావరణ ప్రభావ అంచనా ధృవీకరణ పత్రాన్ని ఎంచుకున్నదా లేదా అనే దానిపై నిర్ణయం తీసుకున్నదా లేదా అనే దానిపై నిర్ణయం తీసుకున్నదా.
3. అటవీ అధికారుల నుండి లేదా మరే ఇతర అధికారుల నుండి అవసరమైన అనుమతిని ఎంచుకున్నదా లేదా అనే దానిపై నిర్ణయం తీసుకున్నదా.
4. నరికివేయబడిన చెట్లకు సంబంధించి రాష్ట్రం తీసుకోవలసిన తదుపరి చర్యలు
సుప్రీంకోర్టు తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు రాష్ట్రం ఇప్పటికే ఉన్న చెట్ల రక్షణ తప్ప మరే విధమైన కార్యకలాపాలను చేపట్టకూడదని స్పష్టంగా పేర్కొంది.. ఆ ఆదేశాన్ని నిజమైన స్ఫూర్తితో పాటించకపోతే, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వ్యక్తిగతంగా బాధ్యత వహిస్తారని.. వారిపై చర్యలు తీసుకుంటారని పేర్కొంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వ్యక్తిగత అహాన్ని పక్కనపెట్టి సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించాలని అభ్యర్థిస్తున్నట్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కోరారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఈ పర్యావరణ వ్యతిరేక చర్యకు నిరసన తెలిపినందుకు అరెస్టు చేసినా లేదా చట్టవిరుద్ధంగా నిర్బంధించబడిన వారందరినీ విడుదల చేయాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఏప్రిల్ 7 వరకు చెట్లు కొట్టేయవద్దు: హైకోర్టు
మరోవైపు, కంచ గచ్చిబౌలి భూముల్లో ఈ నెల 7 వరకు చెట్లు కొట్టేయవద్దని హైకోర్టు ఆదేశించింది. విచారణను ఈ నెల 7కు వాయిదా వేసింది. కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ.. చెట్ల కొట్టివేత కొనసాగుతోందని పిటిషనర్ తరపు లాయర్ కోర్టుకు ఆధారాలు సమర్పించారు. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అయితే.. కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..