AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేసీఆర్‌కు గుడి: జగ్గారెడ్డి భజన

టీఆర్ఎస్ ప్రభుత్వంపైనా, కేసీఆర్‌పైనా ఎప్పుడూ ‘సద్విమర్శలు’ చేసే కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి మొదటిసారిగా మళ్లీ లైమ్‌లైట్‌లోకి వచ్చారు. ఈ సారి ఏకంగా కేసీఆర్ అపరభక్తుడిగా మారారు. రైతు పండించిన ప్రతీ గింజకు ఏడాదిలోగా గిట్టుబాటు ధర కల్పిస్తే ఆయనకు గుడికడతానంటూ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఇచ్చినందుకు సోనియా, రాహుల్‌లకు కూడా గుడులు కట్టిస్తానని ఇదే సందర్భంగా వారిపైనా తన భక్తి ప్రపత్తులను ప్రకటించుకుంటున్నారు. అయితే ఇందులో ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని చెప్పుకొచ్చారు. మైనారిటీలందరూ […]

కేసీఆర్‌కు గుడి: జగ్గారెడ్డి భజన
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 18, 2019 | 5:18 PM

Share

టీఆర్ఎస్ ప్రభుత్వంపైనా, కేసీఆర్‌పైనా ఎప్పుడూ ‘సద్విమర్శలు’ చేసే కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి మొదటిసారిగా మళ్లీ లైమ్‌లైట్‌లోకి వచ్చారు. ఈ సారి ఏకంగా కేసీఆర్ అపరభక్తుడిగా మారారు. రైతు పండించిన ప్రతీ గింజకు ఏడాదిలోగా గిట్టుబాటు ధర కల్పిస్తే ఆయనకు గుడికడతానంటూ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఇచ్చినందుకు సోనియా, రాహుల్‌లకు కూడా గుడులు కట్టిస్తానని ఇదే సందర్భంగా వారిపైనా తన భక్తి ప్రపత్తులను ప్రకటించుకుంటున్నారు. అయితే ఇందులో ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని చెప్పుకొచ్చారు.

మైనారిటీలందరూ కాంగ్రెస్‌కే సపోర్ట్ చేశారని.. తమకు ఎమ్మెల్యేలు లేకపోయినా కింది స్థాయిలో పార్టీ బలంగా ఉందని ఆయన అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి స్థానాలు సాదిస్తామని జగ్గారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అవినీతిని నిర్మూలించడం రాజకీయనాయకుల వలన సాధ్యం కాదని.. బతకడానికి రాజకీయ పార్టీలు అధికారులను ఉపయోగించుకోరాదని ఆయన అన్నారు.

Follow Us