Hyderabad: కదిలివస్తున్న జగన్నాథ రథయాత్ర.. తరలివస్తున్న భక్తజనం.. సర్వాంగ సుందరంగా ముస్తాబైన ఆలయం..
Jagannath Rath Yatra: జగన్నాథ ఆలయం ఆధ్వర్యంలో రథయాత్రను రంగరంగ వైభవంగా జరిపేందుకు ఆలయ ట్రస్ట్ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటికే ఆలయానికి భక్తులు భారీగా చేరుకుంటున్నారు.రంగురంగుల విద్యుత్ దీపాలు, పూల మాలలతో ఆలయ ప్రాంగణం సర్వాంగ సుందరంగా..
హైదరబాద్, జూన్ 20: జగన్నాథ రథయాత్రకు రంగం సిద్దమైంది. బంజరాహిల్స్ రోడ్ నెం.12 లోని జగన్నాథ ఆలయం ఆధ్వర్యంలో రథయాత్రను రంగరంగ వైభవంగా జరిపేందుకు ఆలయ ట్రస్ట్ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటికే ఆలయానికి భక్తులు భారీగా చేరుకుంటున్నారు.రంగురంగుల విద్యుత్ దీపాలు, పూల మాలలతో ఆలయ ప్రాంగణం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు ఆలయ నిర్వాహకులు. రథయాత్రలో పాల్గొనేందుకు గత ఏడాది కంటే పెద్ద ఎత్తున భక్తజనం పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. ఆలయ పరిసరాల్లో పోలీసులు భద్రత ఏర్పాట్లు చేశారు బంజారాహిల్స్ పోలీసులు.
హైదరాబాద్‌లోని అబిడ్స్ ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఎన్టీఆర్ స్టేడియం నుంచి జలవిహార్ వరకు శ్రీ జగన్నాథ రథయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కూడా భారీ ఏర్పాట్లు చేశారు. అబిడ్స్ ఇస్కాన్ దేవాలయం వద్ద ఏర్పాటు చేశారు.
శ్రీ జగన్నాథ రథయాత్ర జరిగే ప్రాంతంలో ట్రాఫిక్ నిబంధనలు కొనసాగుతున్నాయి. శ్రీ జగన్నాథ రథయాత్ర ఎన్టీఆర్ స్టేడియం నుంచి మొదలై ఆర్టీసీ క్రాస్‌రోడ్డు, చిక్కడపల్లి, నారాయణగూడ, హిమాయత్‌నగర్, జీహెచ్‌ఎంసీ ఆఫీసు, ఎన్టీఆర్ గార్డెన్ మీదుగా జలవిహార్ వరకు ఈ యాత్ర కొనసాగుతుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం