Hyderabad: మారనున్న తెలంగాణ పోలీసుల యూనిఫామ్స్..? అనుమతులే తరువాయి..
Telangana: త్వరలోనే తెలంగాణ పోలీసుల యూనిఫామ్స్ మారనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయమై అధికారులు ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఈ విషయమై తెలంగాణ ప్రభుత్వం...

Telangana: త్వరలోనే తెలంగాణ పోలీసుల యూనిఫామ్స్ మారనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయమై అధికారులు ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఈ విషయమై తెలంగాణ ప్రభుత్వం గతంలోనే పోలీస్ అధికారుల యూనిఫామ్‌లను మార్చాలని భావించింది. అయితే ఇది కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు తాజాగా మళ్లీ ఈ అంశం తెరపైకి వచ్చింది. ర్యాంకు వారిగా అధికారుల స్థాయిని సులభంగా గుర్తుపట్టేందుకు యూనిఫామ్‌లలో మార్పులు చేయాలని పోలీసులు సూచించారు.
జూనియర్ కానిస్టేబుల్, సీనియర్ కానిస్టేబుల్, సూపర్ సీనియర్ కాన్టిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్లకు ప్రత్యేకంగా యూనిఫామ్స్‌లో మార్పులు చేసేందుకు అధికారులు ప్రతిపాదనాలు సిద్ధం చేశారు. పోలీస్ యూనిఫామ్స్‌లో మార్పులకు సంబంధించి హోమ్ సెక్రటరీతో పాటు ముఖ్యమంత్రికి అధికారులు పంపించారు. సీఎం అనుమతి ఇవ్వగానే కొత్త యూనిఫామ్స్‌ను అమల్లోకి తేనున్నట్లు సమాచారం.
అధికారులు ప్రతిపాదించిన కొత్త యూనిఫామ్స్ ఇవే..

ఇదిలా ఉంటే యూనిఫామ్‌ల మార్పులకు సంబంధించి వార్తలు రావడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ హైదరాబాద్ సిటీ పోలీసుల యూనిఫామ్‌లను మార్చనున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. హైదరాబాద్, సైబరాబాద్ పోలీసుల యూనిఫామ్స్‌ను ఖాకీ నుంచి నేవీ బ్లూ రంగులోకి మార్చనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే దీని అమలు మాత్రం జరగలేదు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..




