IRCTC: తిరుపతికి టూర్‌ ప్లాన్‌ చేస్తున్నారా.? ఐఆర్‌సీటీసీ నుంచి అదిరిపోయే ప్లాన్‌..

ఇంతకీ ఈ టూర్ ప్యాకేజీలో ఏయే ప్రదేశాలు కవర్‌ అవుతాయి.? ప్యాకేజీ ధర వివరాలు ఏంటి.? లాంటి పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి.. ఈ టూర్‌ ప్యాకేజీని 'పూర్వ సంధ్య' పేరుతో ఐఆర్‌సీటీసీ తీసుకొచ్చింది. ఎలాంటి ఇబ్బంది లేకుండా సునాయాసంగా దర్శనీయ ప్రదేశాలను సందర్శించవచ్చు. మొత్తం 3 రాత్రులు, 4 రోజులుగా ఉండే ఈ ప్యాకేజీ ప్రస్తుతం నవంబర్‌ 12, 2023 తేదీన అందుబాటులో ఉండనుంది...

IRCTC: తిరుపతికి టూర్‌ ప్లాన్‌ చేస్తున్నారా.? ఐఆర్‌సీటీసీ నుంచి అదిరిపోయే ప్లాన్‌..
Irctc Tirupati Tour
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 05, 2023 | 2:23 PM

తిరుపతికి టూర్‌ వెళ్లాలనుకునే వారి కోసం ఐఆర్‌సీటీసీ మంచి ప్యాకేజీని అందిస్తోంది. 3 రాత్రులు, 4 రోజుల ప్యాకేజీతో అందిస్తున్న ఈ టూర్‌ ప్యాకేజీలో భాగంగా తిరుమల శ్రీవారి దర్శనంతోపాటు శ్రీకాళహస్తి, కాణిపాకం, తిరుచానూర్ వంటి ప్రదేశాలను సందర్శింవచ్చు.

ఇంతకీ ఈ టూర్ ప్యాకేజీలో ఏయే ప్రదేశాలు కవర్‌ అవుతాయి.? ప్యాకేజీ ధర వివరాలు ఏంటి.? లాంటి పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి.. ఈ టూర్‌ ప్యాకేజీని ‘పూర్వ సంధ్య’ పేరుతో ఐఆర్‌సీటీసీ తీసుకొచ్చింది. ఎలాంటి ఇబ్బంది లేకుండా సునాయాసంగా దర్శనీయ ప్రదేశాలను సందర్శించవచ్చు. మొత్తం 3 రాత్రులు, 4 రోజులుగా ఉండే ఈ ప్యాకేజీ ప్రస్తుతం నవంబర్‌ 12, 2023 తేదీన అందుబాటులో ఉండనుంది.

టూర్‌ ఇలా సాగుతుంది..

టూర్‌లో భాగంగా తొలి రోజు లింగంపల్లి నుంచి సాయంత్రం 5.25 గంటలకు రైలు బయలుదేరుతుంది. రాత్రంతా ప్రయాణం ఉంటుంది. రెండో రోజు తిరుపతికి ఉదయం 5.55 గంటలకు చేరుకుంటారు. అక్కడి నుంచి హోటల్‌లోకి తీసుకెళ్తారు. ఫ్రెష్‌ అప్‌ అయిన తర్వాత శ్రీనివాస మంగాపురం, కాణిపాకం ఆలయాలకు సందర్శించుకుంటారు. అనంతరం శ్రీ కాళహస్తి, తిరుచానూరు ఆలయాన్ని దర్శించుకుంటారు. దర్శనం అనంతరం హోటల్‌కి తిరిగి వెళ్తారు. రాత్రి తిరుపతిలో బస చేయాల్సి ఉంటుంది.

మూడో రోజు ఉదయం టిఫిన్‌ చేసిన తర్వాత హోటల్‌ నుంచి చెక్‌ అవుట్‌ అవ్వాలి. అనంతరం తిరుమలలో వెంకటేశ్వర స్వామి ప్రత్యేక ప్రవేశ దర్శనం కోసం 8.30 గంటలకు తిరుమలకు బయలుదేరాలి. సాయంత్రం 06:25 గంటలకు రైలు ఉంటుంది. అనంతరం తిరుపతి రైల్వే స్టేషన్‌ నుంచి బయలుదేరుతుంది. రాత్రంతా జర్నీ ఉంటుంది. లింగంపల్లికి ఉదయం 6.55 గంటలకు చేరుకుంటారు. దీంతో ఈ టూర్‌ ప్యాకేజీ ముగుస్తుంది.

ప్యాకేజీ ధరలు విషయానికొస్తే..

పూర్వ సంధ్య టూర్‌ ప్యాకేజీ ధర విషయానికొస్తే.. స్టాండర్డ్ క్లాసులో సింగిల్ ఆక్యూపెన్సీకి రూ. 7720గా, డబుల్ ఆక్యూపెన్సీ రూ. 5860, ట్రిపుల్ ఆక్యూపెన్సీ ధర రూ.5,660గా ఉంటుంది. కంఫర్ట్ క్లాసులో సింగిల్ ఆక్యూపెన్సీ ధర రూ.9570, డబుల్ ఆక్యూపెన్సీ రూ. 7720, ట్రిపుల్ ఆక్యూపెన్సీ రూ.7510గా నిర్ణయించారు. ఐదు నుంచి 11 ఏళ్ల మధ్య ఉండే పిల్లల కోసం వేరు వేరు ధరలు ఉన్నాయి. టూర్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు