- Telugu News Photo Gallery Sachin and Gopichand were the chief guests at the Hyderabad Marathon at the Gachibowli Stadium in Hyderabad
Hyderabad Marathon: హైదరాబాద్ మారథాన్‌లో పాల్గొన్న సచిన్ టెండూల్కర్, పుల్లెల గోపీచంద్
హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో హైదరాబాద్ ఆఫ్ మారథాన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ హాజరయ్యారు. ఫెడరల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సచిన్‌తో పాటూ బ్యాట్మింటెన్ కోచ్ పుల్లెల గోపీచంద్ పాల్గొని సందడి చేశారు. వీరితో పాటూ పోలీసు అధికారులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం, ముఖ్య అతిథిగా రావడం చాలా ఆనందంగా ఉందన్నారు సచిన్.
Updated on: Nov 05, 2023 | 1:27 PM

హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో హైదరాబాద్ ఆఫ్ మారథాన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ హాజరయ్యారు. యువతతో సెల్ఫీ దిగారు

ఫెడరల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సచిన్‌తో పాటూ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ పాల్గొని సందడి చేశారు. వీరితో పాటూ పోలీసు అధికారులు పాల్గొన్నారు.

పుల్లెల గోపీచంద్ పాల్గొని వేదికపై ఉన్న అభిమానులకు అభివాదం చేశారు. ఆ తరువాత జెండా ఊపి 20కె, 10కె, 5కె విభాగాల్లో మారథాన్ నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి యువత పెద్ద ఎత్తున హాజరై ఉత్సాహంగా రన్‌లో పాల్గొన్నారు. ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన వారికి బహుమతులను అందజేశారు. మరి కొందరు యువతులు సచిన్ తో ఫోటో దిగేందుకు ఉత్సాహం చూపించారు.

ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం, ముఖ్య అతిథిగా రావడం చాలా ఆనందంగా ఉందన్నారు సచిన్. ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ద్వారా యువతలో చైతన్యం పెంపొందుతుందన్నారు.




