Weight Loss Tips: బరువు తగ్గాలనుకునే వారికి.. నెయ్యి లేదా ఆలివ్‌ నూనె వీటిల్లో ఏది మంచిది?

బరువు తగ్గాలనుకునేవారు కొవ్వు పదార్ధాలకు దూరంగా ఉండాలి. అందుకే బరువు తగ్గించే ఆహారంలో నూనెపై అధిక శ్రద్ధ వహించాలి. కొలెస్ట్రాల్, మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా నూనె వినియోగంపై పరిమితులు ఉంటాయి. శుద్ధి చేసిన నూనెను ఆహారంలో అస్సలు ఉపయోగించకూడదు. చాలా మంది బరువు తగ్గడానికి నెయ్యి, ఆలివ్ ఆయిల్ వంటి నూనెలను ఎంచుకుంటారు. నెయ్యి, ఆలివ్ నూనె సహజంగా ఉత్పత్తి చేయబడతాయి. ఇందులో పోషకాలు కూడా ఉంటాయి. అయితే బరువు తగ్గాలనుకునే వారు నెయ్యి లేదా ఆలివ్ నూనె తినొచ్చా..? వీటిల్లో ..

Srilakshmi C

|

Updated on: Nov 05, 2023 | 1:02 PM

బరువు తగ్గాలనుకునేవారు కొవ్వు పదార్ధాలకు దూరంగా ఉండాలి. అందుకే బరువు తగ్గించే ఆహారంలో నూనెపై అధిక శ్రద్ధ వహించాలి. కొలెస్ట్రాల్, మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా నూనె వినియోగంపై పరిమితులు ఉంటాయి. శుద్ధి చేసిన నూనెను ఆహారంలో అస్సలు ఉపయోగించకూడదు. చాలా మంది బరువు తగ్గడానికి నెయ్యి, ఆలివ్ ఆయిల్ వంటి నూనెలను ఎంచుకుంటారు. నెయ్యి, ఆలివ్ నూనె సహజంగా ఉత్పత్తి చేయబడతాయి. ఇందులో పోషకాలు కూడా ఉంటాయి. అయితే బరువు తగ్గాలనుకునే వారు నెయ్యి లేదా ఆలివ్ నూనె తినొచ్చా..? వీటిల్లో ఏది మంచిది? అనే సందేహం చాలా మందికి ఉంది.

1 / 5
Olive Oil - ఆలివ్ ఆయిల్​లో మొక్కల ఆధారిత కొవ్వు ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన.. మోనోఅన్​శాచురేటెడ్ కొవ్వులతో నిండి ఉంటుంది. అయితే దీనిలో ఎక్స్​ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ తక్కువ ప్రాసెస్ రకం కలిగి ఉంటుంది. . దీనిలో గుండెకు మేలు చేసే కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. అయితే వీటిని వంటల్లో కాకుండా సలాడ్స్​లో కలిపి తీసుకుంటే మరింత మంచిదని నిపుణులు సూచిస్తన్నారు.

2 / 5
ఆలివ్ ఆయిల్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి బాడీ ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించి, బరువు పెరగకుండా చేస్తాయి. అలాగే నెయ్యిలో కూడా అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇవి శరీరంలో శోథ నిరోధక పదార్థాలుగా పనిచేస్తాయి. పేగులను ఆరోగ్యంగా ఉంచి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. శరీర బరువును నిర్వహించడానికి నెయ్యి తినవచ్చంటున్నారు పోషకాహార నిపుణులు.

3 / 5
నెయ్యిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి జీవక్రియను పెంచడం ద్వారా బరువు తగ్గడంలో సహాయపడతాయి. నెయ్యిలో విటమిన్ ఎ, డి, ఇ, కె కూడా ఉన్నాయి. ఆలివ్ నూనెలో కూడా విటమిన్ ఇ, కె కూడా ఉన్నాయి.నెయ్యిలోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు గుండెకు ఆరోగ్యకరం.

4 / 5
ఆలివ్ ఆయిల్‌లోని మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు, యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కూడా గుండెకు మేలు చేస్తాయి. ఈ నూనె రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం.. దేశీ నెయ్యి, ఆలివ్ నూనె రెండూ బరువు తగ్గడానికి ప్రయోజనకరంగా ఉంటాయి. అయితే తక్కువ పరిమాణంలో మాత్రమే తీసుకోవాలి. రోజుకు 2-3 చెంచాల కంటే ఎక్కువ తీసుకోకూడదు.

5 / 5
Follow us