Hyderabad: డీఏవీ స్కూల్‌లో పూర్తి ప్రక్షాళన.. చిన్నారుల భద్రత కోసం కీలక నిర్ణయాలు..

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని డీఏవీ పబ్లిక్‌ స్కూల్‌లో చిన్నారిపై జరిగిన ఆత్యాచార సంఘటన రాష్ట్రం మొత్తాన్ని కుదేపిస విషయం తెలిసిదే. అభంశుభం తెలియని చిన్నారిపై స్కూల్ ప్రిన్సిపల్‌ కారు డ్రైవర్‌ లైంగిక వేధింపులకు గురి చేయడం అందరినీ కలచివేసింది. ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న...

Hyderabad: డీఏవీ స్కూల్‌లో పూర్తి ప్రక్షాళన.. చిన్నారుల భద్రత కోసం కీలక నిర్ణయాలు..
Dav School
Follow us

|

Updated on: Nov 03, 2022 | 7:58 AM

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని డీఏవీ పబ్లిక్‌ స్కూల్‌లో చిన్నారిపై జరిగిన ఆత్యాచార సంఘటన రాష్ట్రం మొత్తాన్ని కుదేపిస విషయం తెలిసిదే. అభంశుభం తెలియని చిన్నారిపై స్కూల్ ప్రిన్సిపల్‌ కారు డ్రైవర్‌ లైంగిక వేధింపులకు గురి చేయడం అందరినీ కలచివేసింది. ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న తెలంగాణ  ప్రభుత్వం నిందితులను అరెస్ట్ చేయడంతో పాటు స్కూల్‌ యాజమాన్యంపై కూడా కఠినంగా వ్యవహరించింది. ఇందులో భాగంగానే స్కూల్‌ గుర్తింపును రద్దు చేసింది. అయితే పిల్లల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని స్కూల్‌ను రీఓపెన్‌ చేయాలని పేరెంట్స్‌ ఆందోళన చేయడంతో ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. పాఠశాలను రీపెన్‌ చేసేందుకు అనుమతిచ్చింది. అయితే పలు నిబంధనలు పాటిస్తేనే అనే కండిషన్‌ పెట్టింది. దీంతో డీఏవీ స్కూల్‌లో పూర్తి ప్రక్షాళన చేసింది. చిన్నారుల భద్రత కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అవేంటంటే..

కఠిన నిబంధనల నడుమ డీఏవీ స్కూల్‌ను తిరిగి ప్రారంభించారు. ఇందులో భాగంగా స్కూల్ రీఓపెన్‌కు ముందు పాఠశాల యాజమాన్యం పేరెంట్స్‌తో మీటింగ్ నిర్వహించింది . కొత్త మహిళా ప్రిన్సిపల్ నియమించారు. ఇక నుంచి స్కూల్ లో స్ట్రిక్ట్ రూల్స్ అమలు చేస్తామని పేరెంట్స్ మీట్‌లో చెప్పారు. ప్రతి క్లాస్ రూమ్‌లో సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు బస్సుల్లో మహిళా అటెండర్‌లను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది స్కూల్ యాజమాన్యం. అలాగే క్లాస్ రూం సీసీ కెమెరాల యాక్సిస్ తమకు కూడా కల్పించాలని పేరెంట్స్ రిక్వెస్ట్ ను యాక్సెప్ట్ చేసింది స్కూల్ యాజమాన్యం.

అంతేకాకుండా ఇక నుంచి డ్రైవర్‌లకు స్కూల్ కాంపౌండ్‌లోకి అనుమతి లేదంటూ నోఎంట్రీ బోర్డు పెట్టింది. స్టూడెంట్, టీచర్స్‌కి తప్ప ఇతరులు క్లాస్ రూమ్ ల్లోకి రావడానికి లేదంటూ నోటిఫికేషన్ బోర్డులో పేర్కొన్నారు. అంతేకాదు ఆటోలో వచ్చే స్టూడెంట్స్ సెక్యూరిటీపై కూడా ప్రత్యేక దృష్టి పెడతామని స్పష్టం చేశారు స్కూల్ మేనేజ్‌మెంట్. బస్ డ్రైవర్లు, ఆయాల విషయంలో కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇక నుంచి స్టూడెంట్స్ సెక్యూరిటీ విషయంలో కఠినంగా వ్యవహారిస్తామని.. కొత్త ప్రిన్సిపల్ స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..