Munugode By-Poll: పోలింగ్‌ కేంద్రాల వద్ద అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర నిరసన వ్యక్తం చేసిన బండి సంజయ్

తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా మారిన మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ మొదలైంది. గురువారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు జరగనున్న పోలింగ్ కోసం అధికారులు సిద్దమయ్యారు.

Munugode By-Poll: పోలింగ్‌ కేంద్రాల వద్ద అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర నిరసన వ్యక్తం చేసిన బండి సంజయ్

| Edited By: Ram Naramaneni

Updated on: Nov 03, 2022 | 1:58 PM

తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా మారిన మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ మొదలైంది. గురువారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు జరగనున్న పోలింగ్ కోసం అధికారులు సిద్దమయ్యారు. ఈ మేరకు చండూరులోని డాన్ బాస్కో స్కూల్ లో ఏర్పాటు చేసిన పంపిణీ కేంద్రంలో పోలింగ్ సిబ్బందికి సామగ్రి అందించారు. పోలింగ్ తీరుపై మార్గదర్శకాలు, సూచనలు చెప్పారు. అనంతరం వారికి కేటాయించిన ప్రాంతాలకు సిబ్బంది పయనమయ్యారు. కాగా ఈ ఉపఎన్నికలో ఏ పార్టీ గెలుపు సాధిస్తుందనేది ఉత్కంఠగా మారింది. ఇవాళ( బుధవారం) ఉదయం 8 గంటల నుంచి ఎన్నికల సిబ్బందికి పోలింగ్‌ మెటీరియల్‌ పంపిణీ చేశారు. నియోజకవర్గంలో మొత్తం 2,41,855 మంది ఓటర్లు ఉండగా.. వారిలో 1,21,720 మంది పురుషులు, 1,20,128 మంది స్త్రీలు ఉన్నారు. రాష్ట్రంలో ఉప ఎన్నిక తీవ్ర చర్చనీయాంశంగా మారడంతో అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Follow us