Hyderabad: హమ్మయ్య.. హైదరాబాద్ వాసులకు తీరనున్న నీటి కష్టాలు
గ్రేటర్ వ్యాప్తంగా ఎక్కడా తాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు జల మండలి అధికారులు వెల్లడించారు. డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక కార్యాచరణను రూపొందించామని.. అన్ని జలాశయాల నుంచి నగరానికి సరఫరా పెంచినట్లు తెలిపారు. 3 షిఫ్టుల్లో.. రాత్రిళ్లు కూడా నీటిని సరఫరా చేస్తున్నామని చెప్పారు.

పీక్ సమ్మర్ కావడంతో హైదరాబాద్ సిటీలోని కొన్ని ప్రాంతాల్లో ప్రస్తుతం నీటి సమస్య ఇబ్బందికరంగా మారింది. గత సంవత్సరం వర్షాలు సరిగ్గా పడకపోవడంతో భూగర్భజలాలు అడుగంటిపోయాయి. దీంతో బోర్లపై డిపైండ్ అయినవారికి నీటి కష్టాలు తప్పడం లేదు. GHMC నుంచి వాటర్ ట్యాంకులు బుక్ చేసుకుంటున్నారు. ట్యాంకర్లకు కూడా డిమాండ్ పెరగడంతో.. అవి కూడా బుక్ చేసుకున్న వెంటనే వచ్చే పరిస్థితి లేదు. ఈ క్రమంలో సీటీ ప్రజలకు హైదరాబాద్ జలమండలి అధికారులు శుభవార్త చెప్పారు. గ్రేటర్ వ్యాప్తంగా ఎక్కడా తాగునీటికి ఇబ్బందులు లేకుండా పక్క ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తున్నట్లు వెల్లడించారు. కొన్ని ఏరియాల్లో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోవడంతో నీటి సరఫరాకు డిమాండ్ పెరిగిందన్నారు. ఆయా ప్రాంతాల్లో బోర్లపై ఆధారపడే వారంతా ప్రజంట్.. జలమండలి సరఫరా చేసే నీటిపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారని.. అందుకే ఒక్కసారిగా నీటి కొరత ఏర్పడిందని అన్నారు. ప్రజల నుంచి వచ్చే డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక యాక్షన్ ప్లాన్ రూపొందించామని.. అన్ని జలాశయాల నుంచి సిటీకి నీటి సరఫరా పెంచినట్లు తెలిపారు.
కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో రోజుకు 553 MGDలు సప్లై చేయగా…ప్రస్తుతం 575 MGDలు అందిస్తున్నట్లు జల మండలి అధికారులు వెల్లడించారు. ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్, గోదావరి, మంజీరాల నుంచి అదనపు జలాలను తరలించి ప్రజలు అవసరాలు తీరుస్తున్నామన్నారు. వాటర్ ట్యాంకర్ బుకింగ్స్, సప్లై కోసం జలమండలి పక్కాగా చర్యలు చేపట్టిందని.. 3 షిఫ్టుల్లో.. రాత్రి సమయాల్లో కూడా నీటిని సప్లై చేస్తున్నామని అన్నారు. సరఫరా సమయాన్ని తగ్గించడం లాంటి.. చర్యలు తీసుకుంటున్నట్లు జలమండలి తెలిపింది.
అనివార్య కారణాల వల్ల.. ట్యాంకర్ పంపడం లేటయితే ముందుగా సంబంధిత వినియోగదారులకు SMS ద్వారా సమాచారం ఇస్తున్నామని జల మండలి అధికారులు తెలిపారు. తద్వారా నీటి సరఫరాలో పారదర్శకత పాటిస్తున్నట్లు చెప్పారు. సౌత్ సెంట్రల్ రైల్వే నీటి సరఫరాలో ఎలాంటి కోతలు లేవని.. అగ్రిమెంట్ చేసుకున్న దాని కన్నా 20 శాతం ఎక్కువే నీటిని సప్లై చేస్తున్నట్లు జలమండలి అధికారులు తెలిపారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




