AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: వీధి కుక్కల దాడిలో గాయాలపాలైన మరో బాలుడు.. జీహెచ్ఎంసీ అధికారులపై స్థానికులు ఆగ్రహం..

వీధి కుక్కల దాడిలో 4ఏళ్ల బాలుడు తీవ్రంగా గాయపడిన సంఘటన ముసారాంబాగ్, లక్ష్మీనగర్ కాలనీలో శని వారం రాత్రి చోటు చేసుకుంది. బాధిత బాలుడి తల్లి దండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లా కదిరి మండలం, వీరేపల్లిపేట గ్రామానికి చెందిన సాయి కుమార్, అలేఖ్య దంపతులకు ఇద్దరు కుమారులు. ఉపాధి కోసం నగరానికి వచ్చి ముసారాంబాగ్‎లోని లక్ష్మీనగర్ కాలనీ శ్రీనిధి నిలయంలో వాచ్ మెన్ గా పనిచేస్తున్నారు.

Hyderabad: వీధి కుక్కల దాడిలో గాయాలపాలైన మరో బాలుడు.. జీహెచ్ఎంసీ అధికారులపై స్థానికులు ఆగ్రహం..
Dog Bites
Noor Mohammed Shaik
| Edited By: |

Updated on: Apr 29, 2024 | 7:43 PM

Share

వీధి కుక్కల దాడిలో 4ఏళ్ల బాలుడు తీవ్రంగా గాయపడిన సంఘటన ముసారాంబాగ్, లక్ష్మీనగర్ కాలనీలో శని వారం రాత్రి చోటు చేసుకుంది. బాధిత బాలుడి తల్లి దండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లా కదిరి మండలం, వీరేపల్లిపేట గ్రామానికి చెందిన సాయి కుమార్, అలేఖ్య దంపతులకు ఇద్దరు కుమారులు. ఉపాధి కోసం నగరానికి వచ్చి ముసారాంబాగ్‎లోని లక్ష్మీనగర్ కాలనీ శ్రీనిధి నిలయంలో వాచ్ మెన్ గా పనిచేస్తున్నారు. తమ కొడుకు ఉజ్వల్ కుమార్ (4) శనివారం రాత్రి అపార్ట్‎మెంట్ గేటును పట్టుకుని ఆడుకుంటున్నాడు. బాలుడిపై ఐదు వీధి కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయని చెబుతున్నారు.

ఒక కుక్క బాలుడి ముఖంపై దాడి చేయగా, మరో కుక్క కాలు పట్టుకుని బయటికి లాకెళ్లేందుకు ప్రయత్నించింది. భయాందోళనకు గురైన బాలుడు బిగ్గరగా ఏడ్చాడు. దీంతో తల్లి అలేఖ్య ఇంట్లో నుంచి పరిగెత్తుకుని వచ్చి వీధి కుక్కలను తరిమేసింది. అప్పటికే బాలుడి ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే తల్లిదండ్రులు బాలుడిని నల్లకుంటలోని ఫీవర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు గాయాలను పరీక్షించి మెరుగైన చికిత్స కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలపడంతో ఇంటికి తీసుకువచ్చారు. వీధి కుక్కల సమస్యపై అధికారులకు ఎన్నిసార్లు మెరపెట్టుకున్నా పట్టించుకోలేదంటున్నారు స్థానికులు. ఇప్పటికైనా జీహెచ్ఎంసీ అధికారులు స్పందించి ఇలాంటి ఘటనలు పురనావృత్తం కాకుండా చూడాలని కోరుతున్నారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి
Follow Us
ట్రంప్ ఆరోగ్యంపై నెట్టింట వైరల్.. స్పందించిన వైట్ హౌస్..నిజమేంటి?
ట్రంప్ ఆరోగ్యంపై నెట్టింట వైరల్.. స్పందించిన వైట్ హౌస్..నిజమేంటి?
చెన్నై హ్యాట్రిక్‌ ఓటమి.. అగ్రస్థానానికి ఆర్‌సీబీ
చెన్నై హ్యాట్రిక్‌ ఓటమి.. అగ్రస్థానానికి ఆర్‌సీబీ
గాడిదను తేలిగ్గా తీసుకోవద్దు.. అవి మనిషికి నేర్పే 5 జీవిత పాఠాలు.
గాడిదను తేలిగ్గా తీసుకోవద్దు.. అవి మనిషికి నేర్పే 5 జీవిత పాఠాలు.
చిలుకకు ‘రామ చిలుక’ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా..?
చిలుకకు ‘రామ చిలుక’ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా..?
పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా
పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా
15 ఏళ్లకే ప్రపంచ రికార్డులో చేరిన వైభవ్.. అదేంటో తెలుసా?
15 ఏళ్లకే ప్రపంచ రికార్డులో చేరిన వైభవ్.. అదేంటో తెలుసా?
టిమ్ డేవిడ్, పాటిదార్ ఊచకోత.. చెన్నై ముందు కొండంత టార్గెట్..!
టిమ్ డేవిడ్, పాటిదార్ ఊచకోత.. చెన్నై ముందు కొండంత టార్గెట్..!
వాట్సప్‌, ఫేస్‌బుక్‌ DP ఫొటో.. మీరెలాంటి వ్యక్తో చెప్పేస్తుంది..!
వాట్సప్‌, ఫేస్‌బుక్‌ DP ఫొటో.. మీరెలాంటి వ్యక్తో చెప్పేస్తుంది..!
ఒకటి రెండు రోజులు కాదు.. అక్కడ ఏకంగా 37 రోజులుగా ఇంటర్నెట్‌ బంద్‌
ఒకటి రెండు రోజులు కాదు.. అక్కడ ఏకంగా 37 రోజులుగా ఇంటర్నెట్‌ బంద్‌
ఏంటీ లీటర్ కొబ్బరి నీళ్లు రూ.180 హా వైరల్ అవుతున్న 'బ్లాక్ బోర్డ్
ఏంటీ లీటర్ కొబ్బరి నీళ్లు రూ.180 హా వైరల్ అవుతున్న 'బ్లాక్ బోర్డ్