
హైదరబాదీలకు ఇది నిజంగానే ఊపిరి పీల్చుకునే వార్త. గత కొన్ని రోజులుగా ట్రాఫిక్ కష్టాలతో ఇబ్బందులు పడ్డ సగటు నగర జీవికి ఉపశమనం కలిగింది. ట్యాంక్‌బండ్‌పై ఫార్ములా ఈ రేసింగ్ జరిగిన విషయం తెలిసిందే. దీంతో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఖైరతాబాద్, లక్డీకాపూల్, తెలుగుతల్లి ఫ్లై ఓవర్ పరిసర ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
అయితే తాజాగా ఫార్ములా ఈ రేసింగ్ ముగియడంతో అధికారులు ట్రాఫిక్ నిబంధనలు ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఎన్టీఆర్ మార్గ్, హుస్సేన్ సాగర్ చుట్టు పక్కల అమల్లో ఉన్న ట్రాఫిక్ నిబంధనలను ఎత్తివేస్తున్నట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్విట్టర్ వేదికగా అధికారికంగా ప్రకటించారు. ఆదివారం సాయత్రం 5.30 గంటల నుంచి ట్రాఫిక్ నిబంధనలను తొలగించినట్లు పేర్కొన్నారు. తెలుగు తల్లి ఫ్లైవర్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్, వీవీ స్టాచ్యూ గుండా వాహనాలకు అనుమతిస్తున్నట్లు తెలిపారు.
#HYDTPinfo
Commuters, please note the traffic restrictions are lifted around NTR Marg & Hussain Sagar Lake today i.e., on 12th Feb, 2023 at 05:30 PM.@AddlCPTrfHyd pic.twitter.com/QfN4u0KAEj— Hyderabad Traffic Police (@HYDTP) February 12, 2023
ఇదిలా ఉంటే ఫార్ములా రేసింగ్ కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంలోనే మంత్రి కేటీఆర్ సైతం ప్రజలకు కష్టాలు నిజమేనని, పెద్ద మనసుతో క్షమించాలని కోరారు కూడా. హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చే క్రమంలో ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతాయని, ఇలాంటి కార్యక్రమాలతో హైదరాబాద్‌కు అంతర్జాతీయ గుర్తింపు లభిస్తుందని, ప్రజలు పెద్ద మనసుతో తనను క్షమించాలని తెలిపిన విషయం విధితమే.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..