AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Traffic Rules: మీరు హైదరాబాద్‌లో రాంగ్‌ రూట్లో వెళ్తున్నారా? ఇక మీ పని అంతే..!

Hyderabad Traffic Rules: వారు ఇంకా నిర్లక్ష్యంగా నడిపే భారీ వాహనాలపై కఠిన చర్యలు, వాణిజ్య వాహనాలపై క్రమిత తనిఖీలు జరపాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు, మోటారిస్టులు మాత్రం ఇంజినీరింగ్ మార్పులు, సీసీటీవీ ఆధారిత పర్యవేక్షణ, ప్రజలతో కలసి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారానే ఈ సమస్యను

Traffic Rules: మీరు హైదరాబాద్‌లో రాంగ్‌ రూట్లో వెళ్తున్నారా? ఇక మీ పని అంతే..!
Subhash Goud
|

Updated on: Nov 07, 2025 | 4:03 PM

Share

Hyderabad Traffic Rules: ప్రతి రోజు ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. వాహనదారుల పొరపాట్ల కారణంగా ఎందరో బలవుతున్నారు. అతివేగం, రాంగ్‌ రూట్‌లో డ్రైవింగ్‌ చేయడం, నిబంధనలు ఉల్లంగించి వాహనాలు నడపడం వల్ల ఎంతో మంది మృత్యువాత పడుతున్నారు. ఇక హైదరాబాద్‌లో వాహనదారులకు హద్దు అదుపు లేకుండా పోతోంది. ట్రాఫిక్‌ పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా ఎంతో మంది వాహనదారులు నిబంధనలు ఉల్లంఘిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా నగరంలో రాంగ్‌ రూట్‌లో కూడా పోయేవారి సంఖ్య పెరిగిపోతోంది. దీని వల్ల ప్రమాదాలు కూడా భారీగా జరుగుతున్నాయి. ఈ సమస్యను అరికట్టేందుకు ఇటీవల నుంచి ట్రాఫిక్ శాఖ భారీ స్థాయిలో స్పెషల్ డ్రైవ్స్ నిర్వహిస్తోంది. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల వివరాల ప్రకారం అక్టోబర్ మొదటి వారంలోనే వారంరోజుల ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించారు. ఇందులో భాగంగా 10,652 మంది వాహనదారులపై రాంగ్‌ సైడ్‌ డ్రైవింగ్‌ కేసులు నమోదు చేశారు.

ఇది కూడా చదవండి: Jio Plans: జియోలో కేవలం రూ.150లోపే అద్భుతమైన ప్లాన్స్‌.. 28 రోజుల వ్యాలిడిటీ!

నగరంలోని మల్టీలేన్ రోడ్లు, యూ-టర్న్‌లు, మార్కెట్‌ ప్రాంతాలు, రెసిడెన్షియల్ జోన్‌ల వద్ద ఎక్కువగా ఇలాంటి నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా రద్దీగా ఉండే సమయాల్లో ద్విచక్ర వాహనదారులు ట్రాఫిక్‌ను తప్పించేందుకు మధ్య డివైడర్‌లను దాటడం, రాంగ్‌ రూట్‌లో వాహనాలు నడపడం లాంటివి చేయడం వల్ల అధికంగా ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తించారు.

సీసీటీవీల ద్వారా పర్యవేక్షణ:

ఇక వాహనదారులు నిబంధనలు ఉల్లంగిస్తుండటంతో ట్రాఫిక్‌ పోలీసులు సీసీటీవీ పుటేజీల ద్వారా పర్యవేక్షిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తూ రాంగ్‌ రూట్లో వెళ్లేవారిపై కేసులు నమోదు చేస్తున్నారు. గత కొన్నేళ్లలో రాంగ్‌ సైడ్‌ డ్రైవింగ్ చేయడం వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు చెబుతున్నారు. పోలీసు సిబ్బంది పరిమితంగా ఉన్నా, రోడ్ల భద్రత కోసం ఈ డ్రైవింగ్ అలవాటును అరికట్టేందుకు నిరంతర చర్యలు కొనసాగిస్తున్నామని ట్రాఫిక్‌ పోలీసులు చెబుతున్నారు. అయితే హైదరాబాద్‌ నగరంలో రాంగ్‌ రూట్లో వచ్చే వారిపై ప్రత్యేక నిఘా పెడుతున్నామని, వీరి వల్లనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తించామని ట్రాఫిక్‌ పోలీసులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: Fact Check: టాటా నుంచి బైక్‌లు.. ధర కేవలం రూ.55,999లకే.. మైలేజీ 100కి.మీ.. నిజమేనా?

వారు ఇంకా నిర్లక్ష్యంగా నడిపే భారీ వాహనాలపై కఠిన చర్యలు, వాణిజ్య వాహనాలపై క్రమిత తనిఖీలు జరపాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు, మోటారిస్టులు మాత్రం ఇంజినీరింగ్ మార్పులు, సీసీటీవీ ఆధారిత పర్యవేక్షణ, ప్రజలతో కలసి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారానే ఈ సమస్యను తగ్గించవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఇది కూడా చదవండి: PM Kisan: పీఎం కిసాన్‌ 21వ విడత డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలుసా?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి