జూపార్కుల అభివృద్ధికి ‘ZAPAT’ మాస్టర్‌ప్లాన్
రాబోయే ఇరవై ఎళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలో జూపార్కులు, ఉద్యానవనాల అభివృద్ధిపై అటవీశాఖ మాస్టర్‌ప్లాన్‌ను రూపొందిస్తున్నది. అటవీ, పర్యావరణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అధ్యక్షతన సోమవారం హైదరాబాద్‌లో నెహ్రూ జూలాజికల్‌పార్క్‌లో జూస్ అండ్ పార్క్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (జాపాట్) పాలకమండలి సమావేశమై 2020-2040 కోసం ప్రణాళికలు రూపొందించింది. రాష్ట్రంలోని తొమ్మిది జూపార్కులు, జాతీయపార్కుల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆదేశించారు. నెహ్రూజులాజికల్ పార్కును దేశంలోనే మొదటిస్థానంలో నిలిపేందుకు కృషి చేయాలని సూచించారు. […]
రాబోయే ఇరవై ఎళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలో జూపార్కులు, ఉద్యానవనాల అభివృద్ధిపై అటవీశాఖ మాస్టర్‌ప్లాన్‌ను రూపొందిస్తున్నది. అటవీ, పర్యావరణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అధ్యక్షతన సోమవారం హైదరాబాద్‌లో నెహ్రూ జూలాజికల్‌పార్క్‌లో జూస్ అండ్ పార్క్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (జాపాట్) పాలకమండలి సమావేశమై 2020-2040 కోసం ప్రణాళికలు రూపొందించింది. రాష్ట్రంలోని తొమ్మిది జూపార్కులు, జాతీయపార్కుల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆదేశించారు. నెహ్రూజులాజికల్ పార్కును దేశంలోనే మొదటిస్థానంలో నిలిపేందుకు కృషి చేయాలని సూచించారు. జూపార్క్‌ల్లో సీసీ కెమెరాల ఏర్పాట్లు, ఫుడ్ కోర్టులు, అదనపు భద్రతా చర్యలను చేపట్టడానికి జాపాట్ పాలకమండలి అనుమతినిచ్చింది.
కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్ ) కింద టెక్ మహీంద్రా కంపెనీ హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ అభివృద్ధికి రూ. కోటి సాయం చేయడానికి ముందుకొచ్చింది. జూపార్క్ ప్రవేశద్వారం పునరాకృతికి, ఫుడ్‌కోర్టుల ఏర్పాటుకు నిధులను వెచ్చించనున్నది. టెక్‌మహీంద్రా ప్రతిపాదనలకు జపాట్ పాలకవర్గం సమ్మతించింది. ఈ సమావేశంలో అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌మిశ్రా, పీసీసీఎఫ్ ప్రశాంత్‌కుమార్ ఝా, అదనపు పీసీసీఎఫ్ మునీంద్ర, చంద్రశేఖర్‌రెడ్డి, జూపార్క్‌ల డైరెక్టర్ సిద్దానంద్ కుక్రేటి తదితరులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి నెహ్రు జూలాజికల్ పార్కులో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఆసియాటిక్ జాతికి చెందిన సింహాలు, ఆస్ట్రిచ్ జాతికి చెందిన పక్షులను సందర్శకుల కోసం ఎన్‌క్లోజర్‌లలోకి వదిలారు.
జూ జంతువుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మంచి పరిణామమని కొందరు పరిరక్షకులు విశ్వసిస్తారు, ఎందుకంటే సందర్శకుల సంఖ్య-మామూలు రోజులలో 10,000-15,000 రోజులు, సెలవుదినాలలో 30,000-40,000 వరకు పెరగడం-జూ యొక్క పర్యావరణంపై ఒత్తిడిని పెంచుతోంది .వార్షిక సందర్శకులు ఒక దశాబ్దం క్రితం 19 లక్షలు ఉండేవారు. వారి సంఖ్య 2017-18 లో 29 లక్షలకు పెరిగింది. కొత్త జంతుప్రదర్శనశాలను నెలకొల్పి జీవావరణవ్యవస్థకు నష్టం కలిగించకుండా ఉండాలని ప్రజలు కోరుతున్నారు.
వానలు సమృద్ధిగా కురిసిన వెంటనే రాష్ట్రంలో హరితహారం పెద్దఎత్తున ప్రారంభించడానికి సిద్ధంగా ఉండాలని అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ప్రశాంత్‌కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆయన సోమవారం సచివాలయంలో అటవీశాఖ అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. అడవులలోపల, వెలుపల మొ క్కలు నాటడంతో పాటు ప్రతీవైల్డ్‌లైఫ్ డివిజన్‌లో గడ్డిమైదానాలను ఏర్పాటు చేయాలని సూచించారు.