Hyderabad: హమ్మయ్య.. ఎట్టకేలకు ఆ రూట్‌లో ట్రాఫిక్ కష్టాలు తీరాయ్ బ్రో..
తెలంగాణ ప్రభుత్వం ట్రాఫిక్ సిగ్నల్ సిస్టమ్ లో పనిచేసే అర్కడేస్ కంపెనీతోపాటు జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ విభాగం, ట్రాఫిక్ పోలీసులతో ప్రత్యేక కమిటీ వేసింది. స్టడీ చేసి జంక్షన్ ను తిరిగి ప్రారంభించాలని సిఫారసు చేయడంతో ఈ జంక్షన్ ను తిరిగి ప్రారంభించారు. త్వరలోనే ఈ సెంటర్ లో ఐలాండ్ ఏర్పాటుతో పాటు ఇరువైపులా ఆరు మీటర్లున్న ఫుట్ పాత్ లను మూడు మీటర్లకు కుదించనున్నారు.

హైదరాబాద్ తార్నాక జంక్షన్ వాహనదారులకు అందుబాటులోకి వచ్చింది. గత కొన్నేళ్లుగా మూసి ఉన్న తార్నాక జంక్షన్‌ను హైదరాబాద్ ట్రాఫిక్ సిటీ పోలీసులు రి-ఓపెన్ చేశారు. నేటి నుంచి 15రోజుల పాటు ట్రయిల్ రన్ పోలీసులు నిర్వహించనున్నారు. అనంతరం రెగ్యులర్ గా ట్రాఫిక్ ని దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థ నడుపుతూ అందుబాటులో ఉండనుంది.
తార్నాక జంక్షన్ ఓపెన్ కవడంతో వాహనదారులకు యూటర్న్ కష్టాలు తప్పాయి. దీంతో పాటు వాహనదారులకు ప్రయాణ భారం కూడా తగ్గుతోంది. జంక్షన్ పునరుద్ధరణ జరగడంతో ప్రయాణికుల 8 ఏళ్ల ట్రాఫిక్ సమస్యకు చెక్ పడింది. గతంలో ట్రాఫిక్ మేనేజ్మెంట్ పేరుతో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ జంక్షన్ ను మూసివేసింది. జంక్షన్ సమీపంలో మెట్రో పిల్లర్ అడ్డంగా ఉండడంతో ట్రాఫిక్ జామ్ ను నివారించాలని, వాహనాల రాకపోకలు సులువుగా ఉంటుందని, ట్రాఫిక్ పోలీసుల అవసరముండదని అటు రైల్వే డిగ్రీ కాలేజీ సమీపంలో, ఇటు ఐఐసీటీ సమీపంలో యూ-టర్న్ లను ఏర్పాటు చేశారు. యూ టర్న్ ల వద్ద రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ ఎక్కువ అవ్వడం ఈ చర్యలతో ట్రాఫిక్ సమస్య తీరకపోగా మరింత ఎక్కువైంది.
తెలంగాణ ప్రభుత్వం ట్రాఫిక్ సిగ్నల్ సిస్టమ్ లో పనిచేసే అర్కడేస్ కంపెనీతోపాటు జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ విభాగం, ట్రాఫిక్ పోలీసులతో ప్రత్యేక కమిటీ వేసింది. స్టడీ చేసి జంక్షన్ ను తిరిగి ప్రారంభించాలని సిఫారసు చెయ్యడం దీంతో తార్నాక జంక్షన్ ను తిరిగి ప్రారంభించారు. త్వరలోనే సెంటర్ లో ఐలాండ్ ఏర్పాటుతో పాటు ఇరువైపులా ఆరు మీటర్లున్న ఫుట్ పాత్ లను మూడు మీటర్లకు కుదించనున్నారు. తార్నాక జంక్షన్ కు సమీపంలో రెండు వైపులా ఉన్న బస్ స్టాప్ లను తరలించనున్నారు పోలీసులు… తార్నాక జంక్షన్ తెరవడంతో ఇక్కడ పరిస్థితిని చూసి హైదరాబాద్ నగరంలోని మిగతా చోట్ల ఉన్న యూ-టర్న్ ల సంఖ్య కూడా తగ్గించే ప్రయత్నం పోలీసులు చేయనున్నారు.
అయితే ప్రతిరోజు ఉదయం, సాయంత్రం రద్దీసమయంలో రెండు వైపుల గంటల తరబడి వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ స్తంభిస్తోంది. గతంలో ఒకరిద్దరు ట్రాఫిక్ కానిస్టేబుల్స్ ఉన్నచోట నలుగురు కానిస్టేబుల్స్‌ను డ్యూటీ చేయాల్సి వస్తోంది. అయితే వీటన్నింటికి చెక్ పెట్టేందుకు ఇవాళ్టి నుండి తార్నాక జంక్షన్ ను పునప్రారంభించారు పోలీసులు.. రద్దీ సమయాలను దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ పోలీసులు సమయానికి అనుగుణంగా సిగ్నలింగ్ వ్యవస్థను నిమిషాల వ్యవధిలో ఏర్పాటు చేశారు. 15 రోజులపాటు ట్రయిల్ రన్స్ అనంతరం రద్దీకి అనుగుణంగా సిగ్నలింగ్ టైమింగ్స్ ఏర్పాటు చేయనున్నారు. ఎట్టకేలకు ఎనిమిది సంవత్సరాల తర్వాత తార్నాక జంక్షన్ పున- ప్రారంభం కావడంతో వాహనదారులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. 15 రోజుల తర్వాత తార్నాక జంక్షన్ లో వాహనదారులు రెగులర్ గా రాకపోకలు సాగించనున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




