Hyderabad: హోటల్, ట్రయల్ రూమ్స్‌లో సీక్రెట్ కెమెరాలు.. బెదిరింపులతో డబ్బులు వసూలు!
షాపింగ్ మాల్స్ లో ట్రయల్ రూమ్స్.. లాడ్జిల్లో హోటల్ రూమ్స్... అమ్మాయిలు ఉండే హాస్టల్లో బాత్రూమ్స్... ఇలా ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా సీక్రెట్ కెమెరాస్సును పెట్టి మహిళల మానప్రాణాలను బజారుకి ఈడుస్తున్నారు కొంతమంది కిరాతకులు గుట్టు చప్పుడు కాకుండా సీక్రెట్ కెమెరాలను అమర్చి బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇక ఆ కళ్ళల్లో పడితే అంతే ప్రపంచ కళ్ళల్లో పడినట్లే . చీమ తలంతా కెమెరాతో మహిళల..
షాపింగ్ మాల్స్ లో ట్రయల్ రూమ్స్.. లాడ్జిల్లో హోటల్ రూమ్స్.. అమ్మాయిలు ఉండే హాస్టల్లో బాత్రూమ్స్.. ఇలా ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా సీక్రెట్ కెమెరాస్సును పెట్టి మహిళల మానప్రాణాలను బజారుకి ఈడుస్తున్నారు కొంతమంది కిరాతకులు గుట్టు చప్పుడు కాకుండా సీక్రెట్ కెమెరాలను అమర్చి బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇక ఆ కళ్ళల్లో పడితే అంతే ప్రపంచ కళ్ళల్లో పడినట్లే . చీమ తలంతా కెమెరాతో మహిళల మానప్రాణాలతో చెలగాటమాడుతున్నారు కొందరు ఆకతాయిలు.
సినిమా థియేటర్లు షాపింగ్ మాల్స్ హోటల్లో రెస్టారెంట్లు గెస్ట్ హౌస్ చాలామంది కుటుంబ సభ్యులతో కలిసి వెళ్తారు. కొందరు ఆకతాయిలు నిర్వాహకులు వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. విచ్చలవిడిగా దొరుకుతున్నటువంటి hidden స్పై కెమెరాలతో రహస్యంగా ఉన్నటువంటి వారిని చిత్రీకరిస్తున్నారు. ప్రేమ జంటలు ఏకాంతంగా గడిపేందుకు హోటల్ గదులకు వెళ్తే గదిలో ఉన్నప్పుడు చిత్రీకరిస్తున్నారు. వాటిని పెట్టుకునే ఆ జంటలను బెదిరించి డబ్బులు గుంజుతున్నారు. అశ్లీల వీడియోలను సైట్లలో సామాజిక మాధ్యమాలలో పెట్టి బెదిరింపులకు పాల్పడుతున్నారు కొందరు ఆకతాయిలు.
శంషాబాద్ లోని ఒక హోటల్ లో యజమాని అశ్లీల వీడియోలకు బానిస అయ్యాడు. అదే వంకర బుద్ధితో హోటల్ గదుల్లో చిన్న కెమెరాలను ఏర్పాటు చేశాడు. అక్కడికి వచ్చే ప్రేమ జంటల కలిసి ఉన్న వీడియోలతో వారిని బెదిరించి డబ్బులను డిమాండ్ చేసేవాడు. ఏడాది నుంచి వందలాదిమంది వీడియోలను సేకరించి డబ్బులను డిమాండ్ చేస్తున్నాడు. అసలు విషయం బయటకు రావడంతో పోలీసులు అతన్ని అరెస్టు చేసిన రిమాండ్ కు తరలించారు. మరొకవైపు నగరంలోని ప్రముఖ షాపింగ్ మాల్‌లోని ట్రయల్ రూమ్‌లో స్పై కెమెరాను గమనించిన ఓ మహిళ యజమానికి ఫిర్యాదు చేసింది. అక్కడ పని చేసే ఉద్యోగి దానిని ఏర్పాటు చేసినట్లు గుర్తించి ఆ మహిళకు కొంత పరిహారం అందజేసి గుట్టుచప్పుడు కాకుండా పంపించేశారు.
అయితే రహస్య కెమెరాలతో భయాందోళనలకు గురి చేస్తున్న షాపింగ్ మాల్స్, హోటల్స్ నిర్వాహకులపై కఠినంగా వ్యవహరిస్తామని హైదరాబాద్ సిటీ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. బాధితులు ఎవరైనా ఉంటే డయల్ 100కు కాల్ చేయాలని ఆయన సూచించారు. మరోవైపు ఆన్‌లైన్‌లో విచ్చలవిడిగా లభ్యం అవుతున్న స్పై కెమెరాల ద్వారా బగ్ డిటెక్టర్ ద్వారా గుర్తించి అవకాశం ఉంటుందని తెలిపారు. అయినప్పటికీ మహిళల భద్రత పట్ల ఏ మాత్రం బాధ్యత లేకుండా రహస్య కెమెరాలు ఏర్పాటు చేసి మహిళల ప్రాణ స్థానాలతో చల్లగాటమాడితే సహించేది లేదని అంటున్నారు పోలీసు ఉన్నతాధికారులు.
ఇది కూడా చదవండి: Gold Price: మహిళలకు అదిరిపోయే శుభవార్త.. తగ్గిన బంగారం ధర.. ఎంత తగ్గిందో తెలుసా?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి