Cyber Crime: రూ. 712 కోట్ల స్కామ్‌లో బయటపడ్డ ఉగ్ర కోణం.. సామాన్యుల నుంచి దోచుకున్న డబ్బును
ఉగ్రవాదులు మన వేలుతో మనకన్నునే పొడుస్తున్నారు.. ! మన డబ్బును దోచుకుని మనపైనే దాడులకు పెట్టుబడిగా వాడుకుంటున్నారు. ఇలాంటి ఓ ఉగ్రకోణమే సైబరాబాద్ పోలీసులు బయటపెట్టారు. పెట్టుబడుల పేరుతో మోసమే కాదు.. అంతకుమించిన ఉగ్ర కోణం వెలుగులోకి వచ్చింది. రూ. 712 కోట్ల స్కామ్‌తో పాటు భారీ ఉగ్ర కుట్ర భగ్నమైంది. తాజాగా వెలుగులోకి...
ఉగ్రవాదులు మన వేలుతో మనకన్నునే పొడుస్తున్నారు.. ! మన డబ్బును దోచుకుని మనపైనే దాడులకు పెట్టుబడిగా వాడుకుంటున్నారు. ఇలాంటి ఓ ఉగ్రకోణమే సైబరాబాద్ పోలీసులు బయటపెట్టారు. పెట్టుబడుల పేరుతో మోసమే కాదు.. అంతకుమించిన ఉగ్ర కోణం వెలుగులోకి వచ్చింది. రూ. 712 కోట్ల స్కామ్‌తో పాటు భారీ ఉగ్ర కుట్ర భగ్నమైంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఉగ్ర కోణం ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది.
వివరాల్లోకి వెళితే.. ముందుగా మీకో మెయిల్ వస్తుంది. అందులో ఓ టాస్క్ ఉంటుంది. అది పూర్తి చేస్తే అంతకంతా లాభం. కానీ.. ఆ టాస్క్ పూర్తి చెయ్యాలంటే ముందుగా మనమే పెట్టుబడి పెట్టాలి. మొదట పదివేలు పెడతాం. వాళ్లు కూడా నిజంగానే లాభం చూపిస్తారు. ఈసారి పదిలక్షలు పెడతాం. అంతా స్వాహా. ఇలా దేశంలో 15వేల మంది మోసపోయారు. వాళ్లలో ఇప్పటికే లక్షలు సంపాదిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు కూడా ఉన్నారు. ఇంతకీ ఇలా బాధితులు పెట్టిన పెట్టుబడి ఎక్కడికి వెళ్లిందో, వెళుతోందా తెలుసా.. దుబాయ్‌కి, చైనాకి. క్రిప్టో రూపంలోకి మార్చి దాన్ని ఉగ్రవాద సంస్థలకు ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఆ సొమ్ముతో అదే ఉగ్రవాదులు మళ్లీ మనపైనే కుట్రలు చేస్తుంటారు. అంటే మన వేలుతో మన కన్నునే పొడుస్తున్నారన్నమాట
ఈ ఇన్వెస్ట్‌మెంట్ స్కామ్‌ను సీసీఎస్ ఎన్ఐఏ దృష్టికి తీసుకెళ్‌లింది. దీంతో స్కామ్‌లో ఉగ్రకోణాలను వెలికితీసే పనిలో పడింది NIA. ముంబై, లక్నో, గుజరాత్, హైదరాబాద్‌లో NIA ఆరా తీస్తోంది. నిందితులు 9మందితో పాటు మరికొందరిపై CCS నిఘా పెట్టింది. NIA ఇచ్చే సమాచారం కోసం CCS పోలీసుల ఎదురు చూస్తున్నారు.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..