AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ATMల వద్ద నకిలీ ఫోన్ పేతో అటెన్షన్ డైవర్షన్.. 4 రోజుల్లో రూ.46 వేలు హాం ఫట్‌!

ATMల వద్ద డబ్బు డిపాజిట్ చేసే వారిని టార్గెట్ చేసుకుని, PhonePe ద్వారా డబ్బు పంపుతున్నట్లు నమ్మించి ఓ కేటుగాడు నకిలీ స్క్రీన్‌షాట్‌లు చూపించి నగదు దోచుకునేవాడు. నాలుగు కేసుల్లో మొత్తం రూ.46 వేల మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి వద్ద రూ.10 వేల నగదు, ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం..

ATMల వద్ద నకిలీ ఫోన్ పేతో అటెన్షన్ డైవర్షన్.. 4 రోజుల్లో రూ.46 వేలు హాం ఫట్‌!
ATM Attention Diversion Fraud Cases
Sravan Kumar B
| Edited By: |

Updated on: Apr 18, 2026 | 7:41 PM

Share

హైదరాబాద్ , ఏప్రిల్ 18: హైదరాబాద్ చాంద్రాయగుట్ట పోలీసులు ఏటీఎం సెంటర్లపై దృష్టి సారించి దొంగతనాలకు పాల్పడుతున్న అబ్దుల్లా ఒబైద్ అల్ కతేరిని అరెస్ట్ చేశారు. ATMల వద్ద డబ్బు డిపాజిట్ చేసే వారిని టార్గెట్ చేసుకుని, PhonePe ద్వారా డబ్బు పంపుతున్నట్లు నమ్మించి నకిలీ స్క్రీన్‌షాట్‌లు చూపించి నగదు దోచుకునేవాడు. నాలుగు కేసుల్లో మొత్తం రూ.46 వేల మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి వద్ద రూ.10 వేల నగదు, ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారంతో అదే ATM వద్ద అతన్ని అదుపులోకి తీసుకున్నరు పోలీసులు. ఈ సందర్భంగా పోలీసు బృందాన్ని ఉన్నతాధికారులు అభినందించారు. హైదరాబాద్‌లో ATM సెంటర్లు కేంద్రంగా ‘అటెన్షన్ డైవర్షన్’ మోసాలు పెరుగుతున్నాయి. ఇలాంటి ట్రిక్‌లతో ప్రజలను మోసం చేసే దొంగలు తాజాగా బయటపడ్డారు.

  • 2025 డిసెంబర్ సికింద్రాబాద్లో నిందితుడు ‘గూగుల్ పే ట్రాన్సాక్షన్’ చూపించి రూ.35 వేల మోసం చేసాడు. పోలీసులు CCTV ఫుటేజ్‌ ఆధారంగా నిందితుణ్ణి అరెస్ట్ చేశారు. దాన్లో 3 కేసులు రివీల్ అయ్యాయి.
  • 2024 జూలై మల్కజ్‌గిరిలో UPI యాప్ నకిలీ స్క్రీన్‌షాట్‌తో రూ.28 వేల దోపిడీ జరిగింది. నిందితుడి మొబైల్‌లో 5 కేసుల వివరాలు బయటపడ్డాయి. రూ.8 వేల క్యాష్ పట్టుకున్నారు.
  • 2023 అక్టోబర్, ఖైరతాబాద్ లో ‘PhonePe ఫెయిల్ అయింది, క్యాష్ ఇవ్వండి’ అని మోసం చేసి రూ.52 వేల స్వాహా చేశాడు ఒక అటెన్షన్ డైవర్షన్ దొంగ.

ఈ మోసాలు ATMల వద్ద రష్ hours లో ఎక్కువగా జరుగుతాయి. నిందితులు UPI ట్రాన్సాక్షన్‌ల స్క్రీన్‌షాట్‌లను ఎడిట్ చేసి, ‘నెట్‌వర్క్ సమస్య’ అని చెప్పి నగదు తీసుకుంటారు. పోలీసులు ప్రజలకు యాప్ప్‌లో ట్రాన్సాక్షన్ కన్ఫర్మ్ చేసుకోవాలని, అన్‌నోన్ వ్యక్తులతో ఇలాంటి డీల్స్ చేయవద్దని హెచ్చరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరి ఈ మోసాల నుంచి ఎలా రక్షించుకోవాలి?

  • UPI ట్రాన్సాక్షన్ తప్పనిసరిగా మీ ఫోన్‌లో కన్ఫర్మ్ చేసుకోవాలి.
  • నకిలీ స్క్రీన్‌షాట్‌లు గుర్తించండి – QR కోడ్ లేదా అసాధారణ ఫాంట్ ఉంటే అలర్ట్ అవ్వండి.
  • ATMల వద్ద ఒంటరిగా డీల్స్ చేయవద్దు. సందేహాస్పదుల్ని పోలీసులకు రిపోర్ట్ చేయండి.
  • హైదరాబాద్‌లో ఇలాంటి కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు పెట్రోలింగ్‌ను బలోపేతం చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us