Anchor Suma : సుమ అంత ఎనర్జీగా ఉండటానికి అసలు రహస్యం ఇదే.. ఫిట్‌నెస్ సీక్రెట్ రివీల్ చేసిన యాంకర్..
యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకప్పుడు సీరియల్స్, సినిమాల ద్వారా బుల్లితెరపై, వెండితెరపై సందడి చేసిన ఆమె.. ఇప్పుడు పూర్తిగా హోస్టుగా బిజీ అయ్యారు. ముఖ్యంగా ప్రతి సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో సుమ చేసే సందడి అంతా ఇంత కాదు. ఒకరోజులో వరుస ఈవెంట్స్, షెడ్యూల్స్ ద్వారా ఎంతో బిజీగా ఉంటారు. అయితే యాంకర్ సుమ ఎనర్జీ సీక్రెట్, డైట్ గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ తెగ ఆసక్తి చూపిస్తుంటారు.

తెలుగు బుల్లితెరపై ఏళ్లుగా చెక్కుచెదరని ప్రజాదరణతో దూసుకుపోతున్న ప్రముఖ యాంకర్ సుమ కనకాల. రోజులో వరుస ఈవెంట్స్ చేస్తూ ఎంతో బిజీగా ఉండే సుమ ఎనర్జీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గంటల తరబడి స్టేజ్ పైన నిలబడి అందరినీ నవ్విస్తూ, వినోదాన్ని అందించడం ఆమెకే చెల్లింది. అంతటి సుదీర్ఘమైన షూటింగ్ షెడ్యూల్స్ మధ్యలో కూడా సుమ ఏమాత్రం అలసిపోకుండా ఎప్పుడూ ఒకే రకమైన ఉత్సాహంతో ఎలా ఉండగలుగుతారనేది అభిమానుల్లో ఎప్పుడూ ఆసక్తికరమైన ప్రశ్నే. తాజాగా తన లైఫ్‌స్టైల్, డైట్ , ఎనర్జీ సీక్రెట్స్‌పై సుమ స్పందిస్తూ ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. తన ఎనర్జీ వెనుక ఎలాంటి పెద్ద రహస్యాలు లేవని, కేవలం సమయపాలన, ఇంట్లో వండుకునే ఆరోగ్యకరమైన ఆహారమే తన బలం అని సుమ తెలిపారు. రోజూ సరైన సమయానికి భోజనం చేయడం అత్యంత ముఖ్యమని ఆమె చెప్పారు. షూటింగ్‌లో ఎంత బిజీగా ఉన్నా మధ్యాహ్నం 1:00 గంట కాగానే కచ్చితంగా లంచ్ బాక్స్ తెరిచి తినేస్తానని వెల్లడించారు. తాను ఎల్లప్పుడూ ఇంట్లో తయారు చేసిన ఫైబర్ సమృద్ధిగా ఉండే ఆహారాన్నే ఎక్కువగా ఇష్టపడతానని పేర్కొన్నారు.
ఎక్కువ మంది చదివినవి : ఏముంటది మావ ఈ పాట.. 32 ఏళ్లుగా యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న లవ్ సాంగ్.. అప్పట్లో లవర్ కోసం తెగ పాడేవారు..
సాధారణంగా, మహిళలు కుటుంబ సభ్యులందరికీ భోజనం పెట్టి, చివరకు తమ గురించి ఆలోచిస్తారని ఆమె పేర్కొన్నారు. అయితే, సుమ ఈ విధానాన్ని మార్చుకుని, ముందుగా తన ఆరోగ్యాన్ని, ఆహారాన్ని సమయానికి తీసుకునేందుకు ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. తాను ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం కూడా సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటుందని ఆమె నమ్మకం.
ఎక్కువ మంది చదివినవి : Soundarya : సౌందర్యతో 3 బ్లాక్ బస్టర్స్ చేశా.. ఆమె భర్త ఇప్పుడు ఏం చేస్తున్నారంటే.. టాలీవుడ్ హీరో కామెంట్స్..
సమయానికి భోజనం చేయడం ప్రాముఖ్యతను సుమ గట్టిగా చెప్పారు. ప్రస్తుత తరం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తూ, ఉద్యోగ సమయాలు మారడం వల్ల చాలా మంది రాత్రుళ్లు ఆలస్యంగా, అంటే 10, 11 లేదా 12 గంటలకు భోజనం చేస్తున్నారని తెలిపారు. దీనివల్ల అసిడిటీ, ఇతర ఆరోగ్య సమస్యలు, కాలేయ సంబంధిత ఇబ్బందులు వస్తాయని హెచ్చరించారు. ఇది ప్రకృతి చక్రానికి విరుద్ధమని, దీర్ఘకాలంలో తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని ఆమె వివరించారు. సరైన సమయంలో, సరైన ఆహారం తీసుకోవడం ద్వారా అనేక అనారోగ్యాలను నివారించవచ్చని ఆమె సూచించారు.
ఎక్కువ మంది చదివినవి : Aamani: మా కాంబినేషన్ అంటే అప్పట్లో సూపర్ హిట్.. ఆ హీరోతో ఎక్కువ సినిమాలు చేశా.. ఆమని ..
యాంకర్ సుమ..
View this post on Instagram
ఎక్కువ మంది చదివినవి : Ramya Krishna : మేమిద్దరం మంచి ఫ్రెండ్స్.. ఆ పాటతోనే కృష్ణవంశీతో నా కనెక్షన్ మొదలైంది.. రమ్యకృష్ణ..
