AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నో టీవీ.. నో ఫోన్.. 7 ఏళ్లకే 12 భాషలు మాట్లాడుతోన్న టాలీవుడ్ హీరోయిన్ కూతురు.. ఫొటోస్ వైరల్

ఇప్పుడు చిన్న పిల్లలు కూడా స్మార్ట్ ఫోన్ కు అడిక్ట్ అయిపోతున్నారు. ఆన్ లైన్ గేమ్స్, యూట్యూబ్ వీడియోస్ అంటూ ఎక్కువసేపు వాటితోనే గడుపుతున్నారు. అయితే హీరోయిన్ ఆసిన్ కూతురు మాత్రం వేరే. కేవలం రెండో తరగతి చదువుతున్న ఈ చిన్నారి అనర్గళంగా 12 భాషలు మాట్లాడగలదు.

నో టీవీ.. నో ఫోన్.. 7 ఏళ్లకే 12 భాషలు మాట్లాడుతోన్న టాలీవుడ్ హీరోయిన్ కూతురు.. ఫొటోస్ వైరల్
Asin Daughter Arin
Basha Shek
|

Updated on: Oct 28, 2026 | 6:08 PM

Share

ఒకప్పుడు దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది ఆసిన్ తొట్టుంకల్. ముఖ్యంగా తెలుగులో స్టార్ హీరోలతో కలిసి సూపర్ హిట్ సినిమాల్లో యాక్ట్ చేసిందీ అందాల తార. ‘గజిని’, ‘అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి’, ‘శివమణి’, ‘లక్ష్మీ నరసింహ’, ‘ఘర్షణ’, ‘చక్రం’, ‘అన్నవరం’, తదితర సూపర్ హిట్ చిత్రాలు ఆసిన్ కు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. ఒక్క తెలుగులోనే కాదు తమిళం, హిందీ భాషల్లోనూ స్టార్ హీరోయిన్ గా క్రేజ్ సంపాదించుకుంది ఆసిన్. అయితే హీరోయిన్ గా కెరీర్ పీక్స్ ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకుంది. 2016లో మైక్రోమాక్స్ సహ వ్యవస్థాపకుడు రాహుల్ శర్మను వివాహం చేసుకుంది ఆసిన్. 2017లో ఈ దంపతులకు ఒక కుమార్తె జన్మించింది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన ఈ ముద్దుగుమ్మ తన ఫ్యామిలీని చూసుకోవడానికే ఎక్కువ సమయం కేటాయిస్తోంది. ఇదిలా ఉంటే ఇటీవలే 41వ పుట్టిన రోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది ఆసిన్. ఇదే క్రమంలో ఆసిన్ గురించి, కూతురు ఆరిన్ గురించి రాహుల్ శర్మ చెప్పిన విషయాలు ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి.

‘నా లైఫ్ లో ముఖ్యమైన విషయం అసిన్‌ని పెళ్లి చేసుకోవడం. నా వెనుకున్న బలం ఆమెనే. ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు, అది ఎలాంటి దైనా సరే ‘ధైర్యంగా.. ముందుకు సాగిపో’ అని ఆమె వెన్ను తట్టి చెబుతుంది. నన్ను, నా అభిరుచిని అర్థం చేసుకుంటుంది. మన జీవిత భాగస్వామి మనల్ని ముందుకు నడిపించే వ్యక్తి అయి ఉండాలి కానీ వెనక్కి లాగే వ్యక్తి కాకూడదు. నా విషయంలో అసిన్ అలాంటి వ్యక్తే. నా జీవితంలో ఆమె పాత్ర ఎంత గొప్పదో మాటల్లో చెప్పలేను’ అని రాహుల్ చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

ఇదే క్రమంలో తన కూతురు అరిన్ గురించి మాట్లాడిన రాహుల్ శర్మ ‘ మాకు అందమైన కుమార్తె ఉంది. ఆమె కొరియన్, జపనీస్, థాయ్, చైనీస్ సహా దాదాపు 12 భాషలను అర్థం చేసుకోవడంతో పాటు మాట్లాడగలదు. నేను మాత్రం రెండు భాషలు మాట్లాడటానికే కిందా మీద పడుతున్నాను. ఇంగ్లిష్, హిందీతోనే సరిపెట్టుకుంటున్నాం. టీవీ చూడడం, మొబైల్ ఫోన్లు ఉపయోగించడం లాంటివి ఆరిన్ చేయదు. అరిన్ చదువుతున్న స్కూల్ కంటే మా ఇంట్లోనే ఎక్కువ పుస్తకాలు ఉన్నాయేమో. ప్రస్తుతం ఆమె రెండో తరగతి చదువుతోంది. అయినప్పటికీ, ఎనిమిది, తొమ్మిదో తరగతులకు సంబంధించిన పుస్తకాలు కూడా ఇప్పటికే ఇంట్లో ఉన్నాయి. ఇదంతా అసిన్ కృషే’ అని రాహుల్ గర్వంగా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆసిన్ కూతురి ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరలవుతున్నాయి.

Asin Daughter Arin

Asin Daughter Arin

ఇంటి నిండా పుస్తకాలే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us