AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trivikram : ఇదేందయ్యా ఇది.. హీరోయిన్ కాళ్లు మొక్కబోయిన స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్.. అసలేం జరిగిందంటే..

దీపావళి కానుకగా థియేటర్లలో సందడి చేయనున్న చిత్రాల్లో ‘ఆదర్శ కుటుంబం’ ఒకటి. విక్టరీ వెంకటేశ్ కథానాయకుడిగా, శ్రీనిధి శెట్టి కథానాయికగా నటించిన ఈ మూవీని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించారు. ఇప్పటికే అడియన్స్ ముందుకు రావాల్సిన ఈ మూవీ పలుమార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే ఎన్నో వాయిదాల తర్వాత అక్టోబర్ 30న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ఈ చిత్రం సిద్ధమవుతోంది. ఈ క్రమంలో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.

Trivikram : ఇదేందయ్యా ఇది.. హీరోయిన్ కాళ్లు మొక్కబోయిన స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్.. అసలేం జరిగిందంటే..
Trivikram
Rajitha Chanti
|

Updated on: Oct 28, 2026 | 6:47 PM

Share

టాలీవుడ్ సినీ పరిశ్రమలో మాటల మాంత్రికుడిగా తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన మేధస్సు, డైలాగ్ డెలివరీ, సెన్సాఫ్ హ్యూమర్ ఎప్పుడూ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగానే ఉంటాయి. ముఖ్యంగా ఆయన సినిమాలకు, అందులో వచ్చే డైలాగ్స్ కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. గుంటూరు కారం సినిమా తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకున్న గురూజీ.. ఇప్పుడు ఆదర్శ కుటుంబం మూవీతో రాబోతున్నారు. విక్టరీ వెంకటేశ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ మూవీలో హీరోయిన్ శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తుంది. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించింది చిత్రయూనిట్. అయితే ఈ సినిమా వేడుకలో ఆయన చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఏకంగా ఒక స్టార్ డైరెక్టర్ హోదాలో ఉన్న త్రివిక్రమ్.. అందరి ముందే ఒక యంగ్ హీరోయిన్ కాళ్లు మొక్కేందుకు ప్రయత్నించడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఎక్కువ మంది చదివినవి : Soundarya : సౌందర్యతో 3 బ్లాక్ బస్టర్స్ చేశా.. ఆమె భర్త ఇప్పుడు ఏం చేస్తున్నారంటే.. టాలీవుడ్ హీరో కామెంట్స్..

విక్టరీ వెంకటేష్ హీరోగా, శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న తాజా కుటుంబ కథా చిత్రం ‘ఆదర్శ కుటుంబం’. అక్టోబర్ 30న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఘనంగా ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు చిత్ర యూనిట్‌తో పాటు దర్శకుడు త్రివిక్రమ్ హాజరయ్యారు. ఈ ఈవెంట్ జరుగుతున్న సమయంలో స్టేజ్ మీద ఒక ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. హీరోయిన్ శ్రీనిధి శెట్టి త్రివిక్రమ్ కూర్చున్న చోటుకి వచ్చి ఆప్యాయంగా పలకరిస్తూ ఆయన కాళ్లకు నమస్కరించబోయింది. వెంటనే త్రివిక్రమ్ సైతం ఆమెను గౌరవిస్తూ సరదాగా కాళ్లు మొక్కేందుకు కిందికి వంగడంతో అందరూ షాకయ్యారు.

ఎక్కువ మంది చదివినవి : ఏముంటది మావ ఈ పాట.. 32 ఏళ్లుగా యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న లవ్ సాంగ్.. అప్పట్లో లవర్ కోసం తెగ పాడేవారు..

సడన్‌గా స్టార్ డైరెక్టర్ అలా చేసేసరికి షాకైన శ్రీనిధి శెట్టి వెంటనే తేరుకుని ఆయన్ని వారిస్తూ, వెనువెంటనే ఆయన కాళ్లకు నమస్కరించింది. ఈ అనూహ్య పరిణామానికి అక్కడున్నవారందరూ నవ్వుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుండగా.. “టాలీవుడ్‌లో ఇంత సరదాగా ఉండే దర్శకుడు త్రివిక్రమ్ ఒక్కరే” అంటూ నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Aamani: మా కాంబినేషన్ అంటే అప్పట్లో సూపర్ హిట్.. ఆ హీరోతో ఎక్కువ సినిమాలు చేశా.. ఆమని ..

త్రివిక్రమ్ వీడియో..

View this post on Instagram

A post shared by TV9 Telugu (@tv9telugu)

ఎక్కువ మంది చదివినవి :  Ramya Krishna : మేమిద్దరం మంచి ఫ్రెండ్స్.. ఆ పాటతోనే కృష్ణవంశీతో నా కనెక్షన్ మొదలైంది.. రమ్యకృష్ణ..

Follow Us
శ్రీనిధిని ఆటపట్టించిన త్రివిక్రమ్.. కాళ్లమొక్కబోయిన డైరెక్టర్..
శ్రీనిధిని ఆటపట్టించిన త్రివిక్రమ్.. కాళ్లమొక్కబోయిన డైరెక్టర్..
ఏపీలోని ఈ జిల్లాలకు భారీ వర్షసూచన
ఏపీలోని ఈ జిల్లాలకు భారీ వర్షసూచన
రాగి ముద్ద తింటే నిజంగా ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?  
రాగి ముద్ద తింటే నిజంగా ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?  
అభిషేక్ శర్మ ఈ సీక్రెట్ ఫాలో చేస్తే మీరూ ఓ కాటేరమ్మ కొడుకే..!
అభిషేక్ శర్మ ఈ సీక్రెట్ ఫాలో చేస్తే మీరూ ఓ కాటేరమ్మ కొడుకే..!
భారత్‌లో ముందుగానే రిలీజ్ కానున్న 'అవెంజర్స్: డూమ్స్‌డే’
భారత్‌లో ముందుగానే రిలీజ్ కానున్న 'అవెంజర్స్: డూమ్స్‌డే’
ఇంటి గోడలకు పగుళ్లు వస్తున్నాయా? ఏ పగులుకు ఏ మెటీరియల్‌ వాడాలి?
ఇంటి గోడలకు పగుళ్లు వస్తున్నాయా? ఏ పగులుకు ఏ మెటీరియల్‌ వాడాలి?
 లుంగీతో వచ్చి చీర కట్టుకున్న వ్యక్తులు.. టీవీ9 కెమెరాకు చిక్కిన
 లుంగీతో వచ్చి చీర కట్టుకున్న వ్యక్తులు.. టీవీ9 కెమెరాకు చిక్కిన
రజినీకాంత్ మెచ్చిన సినిమా.. అడియన్స్ హృదయాలను హత్తుకుంటున్న మూవీ.
రజినీకాంత్ మెచ్చిన సినిమా.. అడియన్స్ హృదయాలను హత్తుకుంటున్న మూవీ.
ధ్వజో యోగం.. దీపావళికి అనుకోకుండా కోటీశ్వరులయ్యే రాశులు వీరే!
ధ్వజో యోగం.. దీపావళికి అనుకోకుండా కోటీశ్వరులయ్యే రాశులు వీరే!
అనుకున్నది సాధిస్తారు..! కొత్త సంవత్సరం లోపే వీరికి కొత్త జీవితం
అనుకున్నది సాధిస్తారు..! కొత్త సంవత్సరం లోపే వీరికి కొత్త జీవితం