Astrology: అనుకున్నది సాధిస్తారు..! కొత్త సంవత్సరం లోపే వీరికి కొత్త జీవితం
New Life Astrology: లక్ష్యాలు, ఆశయాలు, కలలను నెరవేర్చుకోవాలని పట్టుదలతో ప్రయత్నిస్తున్న ఏడు రాశుల వారికి రాబోయే రెండు నెలలు కీలకం కానున్నాయి. కుజుడు, గురువు అనుకూల సంచారం వల్ల మేషం, వృషభం, కర్కాటకం, సింహం, తుల, వృశ్చికం, ధనుస్సు రాశుల వారు తమ కోరికలను నెరవేర్చుకునే అవకాశాలు ఉన్నాయి. కొత్త సంవత్సరం లోపు వీరి జీవితాల్లో సానుకూల మార్పులు వచ్చే అవకాశం ఉంది.

లక్ష్యాలు, ఆశయాలు, కలలను సాధించుకోవడంలో కొన్ని రాశుల వారు అందరికంటే ముందుం టారు. వీరు వీటి కోసం నిర్విరామంగా ప్రయత్నాలు సాగిస్తారు. వీరిలోని పట్టుదల, ఓపిక, సహనం, పరిశ్రమలకు రాబోయే రెండు నెలలు పరీక్షా కాలం కాబోతున్నాయి. కుజ, గురువుల అనుకూలత వల్ల వీరు తప్పకుండా ప్రతిదీ సాధించుకుంటారు. మేషం, వృషభం, కర్కాటకం, సింహం, తుల, వృశ్చికం, ధనూ రాశుల వారు ఈ గ్రహాల అనుకూల సంచారాన్ని బట్టి ఖాయంగా తమ కోరికలు, ఆశలు, ఆశయాలను నెరవేర్చు కునే అవకాశం ఉంది. స్వయం కృషితో వీరికి కొత్త సంవత్సరం లోపల సరికొత్త జీవితం ఏర్పడుతుంది.
మేషం
ప్రణాళికాబద్ధమైన చర్యలకు, పట్టుదలకు, సాహసానికి మారుపేరైన ఈ రాశివారికి ఏ రంగంలో ఉన్నా ఉన్నత పదవుల మీద ఆశ ఎక్కువగా ఉంటుంది. సరైన గుర్తింపు కోసం తాపత్రయపడ తారు. ఇతరులకు భిన్నమైన ఆలోచనలు చేస్తుంటారు. పాలన, ప్రజా సంబంధాలు, సేవా రంగాల్లో ఉన్నత స్థానాలకు చేరుకోవాలన్నది వీరి కోరిక. రాశినాథుఢు కుజుడు నవంబర్ 12న పంచమ స్థానంలో ప్రవేశిస్తున్నందువల్ల దూరదృష్టితో వ్యవహరించి తమ లక్ష్యాలను నెరవేర్చుకుంటారు.
వృషభం
ఈ రాశికి శుక్రుడు అధిపతి అయినందువల్ల ఈ రాశివారిలో విలాస జీవితం మీద, సుఖ సంతో షాల మీదా కోరిక కొద్దిగా ఎక్కువగానే ఉంటాయి. వాటిని నెరవేర్చుకోవడానికి కావలసిన పట్టు దల, ఓర్పు, సహనాలు కూడా వీరికి ఎక్కువే. ధన సంపాదనే ధ్యేయంగా ఉంటుంది. గురు, కుజులు చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల వీరిలో పట్టుదల మరింతగా పెరిగి, ఈ ఏడాది తమ ఆశలు, కోరికలను చాలా వరకు నెరవేర్చుకుంటారు. వీరు అనుకున్నది సాధిస్తారు.
కర్కాటకం
సాధారణంగా ఈ రాశివారికి మనసులో కోరికలు కలగడమే తక్కువ కానీ, కోరిక కలిగితే మాత్రం అది నెరవేరే వరకు విడిచిపెట్టరు. పట్టుదలగా, ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తూ, ఎంతటి శ్రమకైనా ఓర్చుకుంటూ తమ ఆశలను నెరవేర్చుకునే అవకాశం ఉంది. ఏ అవకాశాన్నీ జారవిడుచుకోరు. రాజకీయ ప్రాబల్యం మీదా, ధన సంపాదన మీదా కోరిక ఎక్కువగా ఉంటుంది. గురు, కుజులు ధన స్థానంలో ఉన్నందువల్ల రాజకీయాల్లోనూ, ఆదాయంలోనూ ముందడుగు వేసే అవకాశం ఉంది.
సింహ రాశి
ఈ రాశివారిలో ఆత్మవిశ్వాసం ఓ పాలు ఎక్కువగా ఉంటుంది. ఈ రాశికి అధిపతి అయిన రవిలో కూడా ఆత్మవిశ్వాసం, పట్టుదల, తెగువ వంటివి కాస్తంత ఎక్కువగానే ఉంటాయి. వీరు కలగన్నారంటే అది నెరవేరే వరకూ నిద్రపోరు. వీరిలో అధికారం మీద మోజు ఎక్కువగా ఉంటుంది. రవికి మిత్ర గ్రహాలైన గురు, కుజులు ఈ రాశిలో సంచారం చేయబోతున్నందువల్ల ఉద్యోగంలో అధికారం కోసం, వృత్తి, వ్యాపారాల్లో ఆధిపత్యం కోసం పాటుబడి ఘన విజయం సాధించే అవకాశం ఉంది.
తుల రాశి
ఈ రాశివారిలో దూరదృష్టి ఎక్కువ. భవిష్యత్ ప్రణాళికలు రూపొందించడంలో వీరికి వీరే సాటి. ఎక్కడున్నా తమదే పైచేయిగా ఉండాలని కోరుకుంటారు. లాభ స్థానంలో గురు, కుజుల సంచారం వల్ల వీరు తప్పకుండా తాము అనుకున్నది సాధించే అవకాశం ఉంది. కొత్త సంవత్సరం వచ్చే లోపల వీరు వృత్తి, వ్యాపారాల్లో పైచేయి సాధిస్తారు. ఉద్యోగంలో అందలాలు ఎక్కుతారు. సరికొత్త నైపుణ్యాలను ఒంటబట్టించుకుంటారు. అంచనాలకు మించి బ్యాంక్ బ్యాలెన్స్ కూడగట్టుకుంటారు.
వృశ్చిక రాశి
ఈ రాశివారిలో పైకి కనిపించని మొండితనం, పట్టుదల ఎక్కువగా ఉంటాయి. అవకాశం వచ్చే వరకూ ఓపికగా నిరీక్షించడం వీరికి అలవాటు. రాశ్యధిపతి కుజుడు దశమ స్థానంలో ధన స్థానాధిపతి గురువుతో యుతి చెందబోతున్నందువల్ల ఆస్తిపాస్తులు, గృహ, వాహనాలు సమకూర్చు కోవాలన్న వీరి మనసులోని కోరిక తప్పకుండా నెరవేరే అవకాశం ఉంది. వీరు అనుకున్నది సాధిస్తారు. అవసరమైతే తల్లితండ్రులు, మిత్రుల తోడ్పాటును సంపాదించి అందలాలు ఎక్కుతారు.
ధనుస్సు రాశి
ఈ రాశివారిలో యాంబిషన్ బాగా ఎక్కువగా ఉంటుంది. కలలు కనడం, లక్ష్యాలను నిర్దేశించుకోవడం, వాటిని పట్టుదలగా సాధించుకోవడం వీరి ప్రధాన లక్షణాలు. రాశినాథుడు గురువు భాగ్య స్థానంలో కుజుడితో యుతి చెందబోతున్నందువల్ల, నవంబర్ 12 నుంచి డిసెంబర్ 16 లోపల తమ రాజకీయ లక్ష్యాలను, ఉన్నతోద్యోగ ఆశయాలను తప్పకుండా సాధించుకునే అవకాశం ఉంది. ఉన్నత స్థానాలు, ఉన్నత పదవుల్ని అందుకోవడం, సంపన్నులు కావడం జరుగుతుంది.



