Secunderabad: రూబీ హోటల్ ఫైర్ యాక్సిడెంట్‌పై అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం.. యజమాని అరెస్ట్..
సికింద్రాబాద్ పాస్‌పోర్టు కార్యాలయం సమీపంలో రూబీ లగ్జరీ ప్రైడ్ పేరుతో ఉన్న ఐదంతస్తుల భవనంలో జరిగిన అగ్నిప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. భవనంలోని సెల్లార్, గ్రౌండ్ ఫ్లోర్లలో రూబీ ఎలక్ట్రిక్ వాహనాల షోరూం నడుస్తోంది.
Secunderabad Fire Accident: సికింద్రాబాద్ రూబీ హోటల్‌లో ఫైర్ యాక్సిడెంట్‌పై అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు. ఓనర్ రంజిత్ సింగ్ బగ్గాను అరెస్ట్ చేశారు. ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం డెడ్‌బాడీలను స్వస్థలాలకు తరలించారు. సికింద్రాబాద్ పాస్‌పోర్టు కార్యాలయం సమీపంలో రూబీ లగ్జరీ ప్రైడ్ పేరుతో ఉన్న ఐదంతస్తుల భవనంలో జరిగిన అగ్నిప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. భవనంలోని సెల్లార్, గ్రౌండ్ ఫ్లోర్లలో రూబీ ఎలక్ట్రిక్ వాహనాల షోరూం నడుస్తోంది. మిగిలిన నాలుగు అంతస్తుల్లో హోటల్ నిర్వహిస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వేడికి షోరూంలోని ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలు పేలాయి. దీంతో పరిసర ప్రాంతంలో దట్టమైన పొగ ఆవహించింది. ఘటనపై క్లూస్ టీమ్ ప్రైమరీ రిపోర్ట్ సిద్ధం చేసింది. సెల్లార్‌లో 5 సిలిండర్లు, 40ఈ బైక్‌లు, బైక్‌లు, 2 టు వీలర్లు, ఒక జనరేటర్ ఉన్నట్టు గుర్తించారు. జనరేటర్ లేదంటే ఈ బైక్‌లో షార్ట్ సర్య్కూట్ కారణంగా ప్రమాదం జరిగి ఉండొచ్చన‌్న అనుమానాలు ఉన్నాయి. లిథియం బ్యాటరీలు మంటల్లో కాలిపోవడంతో పొగ ఎక్కువగా వ్యాపించిందన్నారు అధికారులు.
ప్రమాదానికి కారణమైన ఎలక్ట్రిక్ వాహనాల షోరూం నిబంధనలకు విరుద్దంగా ఏర్పాటు చేసినట్లుగా పోలీసులు తేల్చారు. ఈ కేసులో బగ్గా రంజిత్‌తో పాటు మరొకరిపై కేసు నమోదు చేశారు. ఇక 8మంది మృతుల్లో ఏడుగురిని గుర్తించారు. మరో పది మంది బాధితులు ఆస్పత్రిలో చికిత్సనందిస్తున్నారు. వారిలో బెంగళూరుకి చెందిన జయంత్ పరిస్థితి విషమంగా ఉంది. హెచ్‌ఆర్‌సీ చైర్మన్ స్పాట్‌ని సందర్శించారు. రద్దీ ప్రదేశాల్లో ఇలాంటి షోరూంలు పెట్టడం సరికాదన్నారు.
దట్టమైన పొగతో ఊపిరాడక చనిపోయారు. నిజానికి సెల్లార్‌లో ఎలాంటి వాణిజ్య వ్యాపారాలు చేయకూడదు.. కానీ యాజమాని అందుకు విరుద్దంగా వ్యవహరించాడు. భవన యజమానిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు హోంమంత్రి మహమూద్ అలీ. మరోవైపు అగ్నిప్రమాద ఘటనపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 2లక్షలు.. క్షతగాత్రులకు 50వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు ప్రధాని మోడీ.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..