AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ఉమ్మడి రాజధాని బంధానికి తెర.. ఇకపై తెలంగాణకు శాశ్వత రాజధానిగా హైదరాబాద్

ఉమ్మడి రాజధాని బంధానికి తెరపడింది. ఇక హైదరాబాద్ తెలంగాణకు శాశ్వత రాజధానిగా కొనసాగనుంది. ఏపీకి కేటాయించిన కొన్న భవనాల భవిష్యత్తుపై సందిగ్ధత నెలకొంది. ఆ డీటేల్స్ ఇప్పుడు తెలుసుకుందాం పదండి....

Hyderabad: ఉమ్మడి రాజధాని బంధానికి తెర.. ఇకపై తెలంగాణకు శాశ్వత రాజధానిగా హైదరాబాద్
Hyderabad
Ram Naramaneni
|

Updated on: Jun 03, 2024 | 9:58 AM

Share

ఆంధ్రప్రదేశ్-తెలంగాణ మధ్య పదేళ్లపాటు కొనసాగిన ఉమ్మడి రాజధాని హైదరాబాద్ బంధానికి తెరపడింది. జూన్ 2తో ఉమ్మడి రాజధాని గడువు ముగిసింది. ఏపీ పునర్విభజన చట్టం- 2014లోని సెక్షన్ 5 ప్రకారం… జూన్ 2, 2014 నుంచి హైదరాబాద్ ను ఏపీ, తెలంగాణకు 10 ఏళ్లపాటు హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా కేంద్రం ప్రకటించింది కేంద్రం. ఆ గడువు పూర్తి కావటంతో తెలంగాణకు ఇక నుంచి హైదరాబాద్ శాశ్వత రాజధానిగా ఉండనుంది. అయితే విభజన చట్టంలోని సెక్షన్-8 ప్రకారం హైదరాబాద్ ఉమ్మడి రాజధాని ప్రాంతంలో పౌరుల ప్రాణ, ఆస్తి, రక్షణ, భద్రతను కాపాడే బాధ్యతను గవర్నర్‌కు అప్పగించారు. ఇప్పుడీ గడువు ముగియడంతో ఈ బాధ్యతను ప్రభుత్వం చూసుకుంటుంది. ఏపీకి హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పటికీ విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 2015లోనే అమరావతిని రాజధానిగా ప్రకటించి పాలన అందించారు. 2019లో అధికారాన్ని చేజిక్కించుకున్న వైఎస్ జగన్ మూడు రాజధానులు ప్రకటించినప్పటికీ.. అమరావతి కేంద్రంగానే పాలనను కంటిన్యూ చేశారు. ఈ పదేళ్ల కాలంలో పాలన కోసం హైదరాబాద్ లోనూ పలు భవనాలను ఏపీకి కేటాయించారు.

సోమాజిగూడలోని రాజ్‌భవన్‌కు సమీపంలో ఉన్న లేక్‌వ్యూ అతిథి గృహాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి కేటాయించారు. ఇప్పుడు హైదరాబాద్ లో ఏపీకి కేటాయించిన కొన్న భవనాల భవిష్యత్తుపై సందిగ్ధత నెలకొంది. హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా పదేళ్ల తర్వాత కూడా కొనసాగించాలనే అంశంపై రాజకీయ పార్టీలు ఏవీ స్పందించలేదని ఎక్స్ వేదికగా జై భారత్ నేషనల్ పార్టీ వ్యవస్థాపకుడు లక్ష్మీనారాయణ విమర్శించారు. ఇక ఆ దేవుడే ఏపీని ఆదుకోవాలని లక్ష్మీ నారాయణ అన్నారు.మరోవైపు మాజీ పీసీసీ చీఫ్ డా సాకే శైలజానాథ్ విచారం వ్యక్తం చేస్తూ హైదరాబాద్‎ను ఉమ్మడి రాజధానిగా మరో 10 సంవత్సరాలు పొడిగించాలని డిమాండ్ చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..  

Follow Us