AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

komatireddy: హైదరాబాద్ నగరవాసులకు గుడ్‌న్యూస్.. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్‌పై మంత్రి కీలక ప్రకటన!

హైదరాబాద్ నగర వాహనదారులకు రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి శుభవార్త చెప్పారు. నగరంలోని ప్రముఖ ఎలివేటెడ్ కారిడార్‌లలో ఒకటైన ఉప్పల్-నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పనులు త్వరలోనే పూర్తి కానున్నాయన్నారు. బుధవారం స్థానిక ఎమ్మెల్యేతో కలిసి కారిడార్‌ పనులను పరిశీలించిన సందర్భంగా మంత్రి ఈ ప్రకటన చేశారు.

komatireddy: హైదరాబాద్ నగరవాసులకు గుడ్‌న్యూస్.. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్‌పై మంత్రి కీలక ప్రకటన!
Komatireddy
Ashok Bheemanapalli
| Edited By: |

Updated on: Jul 16, 2025 | 2:07 PM

Share

హైదరాబాద్ నగర వాహనదారులకు శుభవార్త. నగరంలోని ప్రముఖ ఎలివేటెడ్ కారిడార్‌లలో ఒకటైన ఉప్పల్-నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పనులు త్వరలోనే పూర్తి కానున్నాయి. ఈ మేరకు రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈరోజు మంత్రి స్థానిక ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డితో కలిసి కారిడార్ పనులను పరిశీలించారు.  ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. “కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రాజెక్టు ఆలస్యమైందని.. అయితే ఈ ఏడాది దసరా నాటికి కారిడార్‌ను ప్రజల వినియోగానికి అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఆలస్యానికి ఎవ్వరినీ వ్యక్తిగతంగా బాధ్యులుగా నిలబెట్టాల్సిన అవసరం లేదని మంత్రి తెలిపారు.

ఉప్పల్ చౌరస్తాలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు, ఘట్‌కేసర్, యాదాద్రి, వరంగల్‌ వైపు వెళ్లే వాహనదారులకు వేగవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు ఈ ఎలివేటెడ్ కారిడార్‌ రూపుదిద్దుకుంది. ఈ ఆరు లేన్ల ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం (NHAI) ఆధ్వర్యంలో నిర్మితమవుతోంది. దీని అంచనా వ్యయం రూ. 626.76 కోట్లు కాగా..భూసేకరణ వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోంది. భూసేకరణకి రూ. 330 కోట్ల నుంచి రూ. 768 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా. నిర్మాణానికి ఎదురైన సవాళ్లు ఈ ప్రాజెక్టు 2017లో ప్రారంభమైనా, అనేక సాంకేతిక, పరిపాలనా కారణాలతో పనులు నెమ్మదించాయి. మొదట ప్రాజెక్టును చేపట్టిన గాయత్రీ సంస్థ వెనక్కు తగ్గడంతో జాప్యం ప్రారంభమైంది. భూసేకరణ, యుటిలిటీల మార్పిడి (విద్యుత్ లైన్లు, నీటి పైపులు మొదలైనవి) వంటి సమస్యలు నిర్మాణాన్ని నిలిపివేశాయి.

ఈ ఆలస్యాల కారణంగా రోజూ ఉప్పల్ చౌరస్తా వద్ద ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతూ, ప్రజలు గుంతల రోడ్లపై ప్రయాణిస్తూ తీవ్ర అసౌకర్యాలు అనుభవిస్తున్నారు. ఈ కారిడార్ పూర్తి అయితే హైదరాబాద్ తూర్పు ప్రాంత ప్రజలకు పెద్దగా ఉపశమనం లభిస్తుంది. జాతీయ రహదారి 163 (NH-163) మీద రాకపోకలు సులభతరం అవుతాయి. ఔట్‌ఘట్, యాదాద్రి, వరంగల్ దిశగా ప్రయాణించే వాహనదారులకు ప్రయాణ సమయం తగ్గుతుంది. ఇది పూర్తి అయిన తర్వాత నగర రహదారి మౌలిక సదుపాయాల్లో ఒక కీలక మైలురాయిగా నిలుస్తుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.