హైదరాబాద్ మెట్రో రైలుకు మూడు జాతీయ అవార్డులు
ఎంతో బిజీగా ఉండే హైదరాబాద్ నగరంలో.. ప్రయాణం ఎంత నరకమో.. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతీ ఒక్కరూ ఎక్స్‌పీరియన్స్ చేసే ఉంటారు. ఒక్కసారి ట్రాఫిక్‌లో ఇరుక్కున్నామా..

ఎంతో బిజీగా ఉండే హైదరాబాద్ నగరంలో.. ప్రయాణం ఎంత నరకమో.. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతీ ఒక్కరూ ఎక్స్‌పీరియన్స్ చేసే ఉంటారు. ఒక్కసారి ట్రాఫిక్‌లో ఇరుక్కున్నామా.. అంతే. అలాంటి ప్రయాణాన్ని వేగం, సౌకర్యవంతంగా మార్చేసింది హైదరాబాద్ మెట్రో. గంటలు పట్టే.. ప్రయాణానికి.. నిమిషాల్లో గమ్యస్థానాలకు చేరవేస్తుంది. ఇప్పటికే హైదాబాద్ నగరవ్యాప్తంగా.. చాలామంది ఈ సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారు. ఇప్పుడు దీని టాపిక్ ఎందుకొచ్చిందంటే.. ఇన్ని సౌకర్యాలు అందించే హైదరాబాద్ మెట్రోకు మూడు నేషనల్ అవార్డ్స్ వచ్చాయట.
హైదరాబాద్ ఎల్ అండ్ టీ మెట్రో రైలు ప్రాజెక్ట్ విషయంలో మెరుగైన పనితీరు కనబర్చినందుకు మూడు జాతీయ అవార్డులు లభించాయి. ఇటీవల బెంగుళూరులో నిర్వహించిన పీఆర్‌సీఐ గ్లోబల్ కమ్యునికేషన్స్ సదస్సులో భాగంగా.. ఎల్‌అండ్‌టీ మెట్రో కార్పొరేషన్ కమ్యునికేషన్స్ అధినేత అనిందితా సిన్హా ఈ అవార్డులను అందుకున్నారు. పీఆర్‌సీఐ అవార్డులు దక్కడం గర్వకారణంగా ఉందని ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో ఎండీ, సీఈవో కేవీబీ రెడ్డి తెలిపారు. అనతికాలంలో మెట్రోలకు ప్రయాణికుల సంఖ్య పెరిగేందుకు విశేషంగా కృషి చేసిన కార్పొరేట్ కమ్యునికేషన్ విభాగాన్ని వారు అభినందించారు.

Read More: ఒంటరైన మారుతీరావు భార్య.. నేరం ఎవరిది? శిక్ష ఎవరికి!
Read More also this: శ్మశాన వాటికలో ఉద్రిక్త పరిస్థితులు.. కడసారి చూపుకు నోచుకోని అమృత
ఇది కూడా చదవండి: అమృత, ప్రణయ్‌ల లవ్‌స్టోరిపై సినిమా.. హీరో ఎవరంటే?