రైతన్నకు భరోసా: 40 లక్షల మందికి రుణమాఫీ …ఈ నెలలోనే చెక్కుల పంపిణీ

కేసీఆర్ సర్కార్ రైతులకు శుభవార్తనందించింది. ఇచ్చిన హామీ... చెప్పిన మాట ప్రకారం.. రైతు రుణ మాఫీని అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటోంది.. ఈ నెలాఖరులోపే రుణ మాఫీ ..

రైతన్నకు భరోసా: 40 లక్షల మందికి రుణమాఫీ ...ఈ నెలలోనే చెక్కుల పంపిణీ
Follow us

|

Updated on: Mar 10, 2020 | 9:39 AM

కేసీఆర్ సర్కార్ రైతులకు శుభవార్తనందించింది. ఇచ్చిన హామీ… చెప్పిన మాట ప్రకారం.. రైతు రుణ మాఫీని అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. దశల వారిగా రైతుల రుణలను మాఫీ చేసేందుకు కసరత్తు చేస్తోంది. అందులో భాగంగానే 25 వేల రుణాలు ఉన్న వారికి ఈ నెలాఖరులోపే మాఫీ చేయనున్నట్టు ప్రకటించి.. అన్నదాతల్లో ఆనందం నింపింది. మిగిలిన రుణాలను కూడా నాలుగు విడతల్లో మాఫీ చేయనున్నట్టు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రకటించారు.

తొలిదశలో రూ.25 వేల లోపు రుణగ్రస్థులకు ఒకేసారి రుణమాఫీ సొమ్ము పంపిణీ చేయడానికి వ్యవసాయశాఖ ఏర్పాట్లు చేస్తోంది. రుణ మొత్తం ఆధారంగా రైతులను అయిదు విభాగాలు చేశారు. కేవలం రూ.25 వేల లోపు మాత్రమే అప్పు ఉన్న 5.83 లక్షల మంది పేర్లతో బ్యాంకులు జాబితాలు సిద్ధం చేశాయి. వీరంతా ఎకరం లోపు భూమి ఉన్న అత్యంత నిరుపేదలై ఉంటారని, వీరికి తొలుత మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి రూ.25 వేలకు ఒక విభాగం చొప్పున జాబితాలు సిద్ధం చేశారు.

రుణమాఫీకి 40.66 లక్షల మంది రైతులు అర్హులు కానున్నారు. ఇందుకోసం ఈ నెలలో రూ.1,198 కోట్లు విడుదల చేయనున్నారు. అయితే, నేరుగా రైతుల ఖాతాల్లోకి నిధులు బదిలీ చేయకుండా సంబంధిత ఎమ్మెల్యేల చేతుల మీదుగా చెక్కుల ద్వారా పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. తక్కువ మొత్తంలో పంట రుణం తీసుకున్న చిన్న, సన్నకారు రైతుల్లో ఎక్కువ మందికి ఉపయోగకరంగా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మిగిలిన రూ.24,736 కోట్లు విడతలవారీగా మాఫీ చేయనున్నారు. అయితే ప్రభుత్వం రుణమాఫీ అమలు మార్గదర్శకాల్లో ఇచ్చే నిబంధనల ఆధారంగా రైతుల సంఖ్యతోపాటు మాఫీ మొత్తం కూడా కొంత తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

ప్రభుత్వం 2014లో మాఫీ సొమ్మును వరుసగా నాలుగేళ్ల పాటు బ్యాంకులకు నేరుగా విడుదల చేసింది. ఇప్పుడు కూడా రూ.25 వేల నుంచి రూ.లక్ష వరకూ బాకీ ఉన్న రైతులకు మొత్తం నాలుగు విడతలుగా చెక్కులు పంపిణీ చేయనున్నారు. మొదటి విడత చెక్కులు వచ్చే జూన్‌లో ఖరీఫ్‌ సాగు ప్రారంభం నాటికి పంపిణీ చేయనున్నట్లు తెలుస్తోంది. రూ.25 వేల లోపు వారికి ఈ నెలాఖరులోగా ఎమ్మెల్యేల ద్వారా నేరుగా చెక్కులు అందిస్తారు.

రెండో విడత పోలింగ్ ప్రశాంతం.. మూడో విడత ప్రచారానికి నేతలు సిద్దం
రెండో విడత పోలింగ్ ప్రశాంతం.. మూడో విడత ప్రచారానికి నేతలు సిద్దం
మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త