అమృత, ప్రణయ్‌ల లవ్‌స్టోరిపై సినిమా.. హీరో ఎవరంటే?

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అమృత-ప్రణయ్‌ల ప్రేమ ఉదంతం సంచలనంగా మారింది. అమృత తండ్రి మారుతీరావు ఆత్మహత్య చేసుకోవడంతో.. మరోసారి ఈ పేర్లు వినబడుతున్నాయి. ఇప్పుడు ఈ ప్రేమకథ ఆధారంగా ఓ సినిమా రాబోతుంది. ఈ సినిమాని శివనాగేశ్వర్ రావు అనే కొత్త డైరెక్టర్..

అమృత, ప్రణయ్‌ల లవ్‌స్టోరిపై సినిమా.. హీరో ఎవరంటే?
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Mar 10, 2020 | 9:35 AM

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అమృత-ప్రణయ్‌ల ప్రేమ ఉదంతం సంచలనంగా మారింది. అమృత తండ్రి మారుతీరావు ఆత్మహత్య చేసుకోవడంతో.. మరోసారి ఈ పేర్లు వినబడుతున్నాయి. కూతురు కులాంతర వివాహం చేసుకుందని అక్కసుతో అల్లుడు ప్రణయ్‌ని అతిదారుణంగా చంపించాడు మారుతీరావు. ఏడాదిన్నర తర్వాత అల్లుడిని హత్య చేయించిన మారుతీరావు.. ఆదివారం ఉదయం ఆత్మహత్య చేసుకోవడంతో మరోసారి ఈ కేసు సంచలనంగా మారింది. ఆయన్ని కడసారి చూడటానికి వెళ్లిన అమృతకు నిరాశే మిగిలింది. మొత్తం సినిమాటిక్ డ్రామాగా సాగింది అమృత-ప్రణయ్‌ల లవ్ స్టోరి.

అయితే ఇప్పుడు ఈ ప్రేమకథ ఆధారంగా ఓ సినిమా రాబోతుంది. ఈ సినిమాని శివనాగేశ్వర్ రావు అనే కొత్త డైరెక్టర్ తెరకెక్కించనున్నాడు. సీనియర్ నటి అన్నపూర్ణమ్మ ఇందులో ప్రధాన పాత్రలో నటించారట. ఇక ఈ సినిమాకి MNR చౌదరి నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. మాస్టర్ రవితేజ టైటిల్ రోల్ ప్లే చేశాడు. సీనియర్ నటి జమున, బాలాదిత్య, అర్చన కీలక పాత్రల్లో కనిపించనున్నారట. కాగా ఈ సినిమాకి టైటిల్ కూడా ఖరారు చేశారు. అదే ‘అన్నపూర్ణమ్మ గారి మనవడు’. అతి త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని నటుడు బాలాదిత్య మీడియాతో తెలిపారు. అయితే వాస్తవిక ఘటనలను చూపిస్తూనే.. సినిమా పరంగా కూడా టచ్ ఇచ్చాడని తెలిపాడు. కాగా.. ఇందులో అర్చన తనకు జంటగా నటించిందని చెప్పుకొచ్చాడు.

కాగా.. ప్రణయ్‌ చనిపోయి ఏడాదిన్నర అయ్యింది. ఇప్పటివరకూ దీని గురించి ఒక్క సినిమా కూడా రాలేదు. అందులోనూ ఇప్పుడు మారుతీరావు చనిపోవడం సంచలనంగా మారింది. మరోసారి అమృత, ప్రణయ్ పేర్లు బయటకి వచ్చాయి. దాంతో ఈ కథను సినిమాగా తీస్తే ప్రజలు ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్టు తెలిపాడు. అందులోనూ.. ఇలాంటి సినిమాలు యూత్‌కి బాగా ఉపయోగపడతాయని చెప్పారు హీరో బాలాదిత్య.

Read More: ఒంటరైన మారుతీరావు భార్య.. నేరం ఎవరిది? శిక్ష ఎవరికి!

Read More also this: శ్మశాన వాటికలో ఉద్రిక్త పరిస్థితులు.. కడసారి చూపుకు నోచుకోని అమృత