Hyderabad: హైదరాబాద్‌లోని ఆ ప్రాంతాల్లో స్థలాలు, ఇళ్లు కొంటున్నారా? జాగ్రత్త.. హెచ్చరించిన కమిషనర్
నగరం రోజు రోజుకు అభివృద్ధి చెందుతోంది. జీవనోపాధి, ఉద్యోగం అంటూ వందలాది మంది పొరుగు రాష్ట్రాల నుండి ఇక్కడ తలదాచుకుంటున్నారు. దీంతో జన జీవనం పెరిగింది. నిర్మాణాలు, కట్టడాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో అక్రమ కట్టడాలపై కొరడా ఝులిపిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. అలాంటి కట్టడాలను కూల్చివేత పనిలో నిమగ్నమవుతోంది..
నగరం రోజు రోజుకు అభివృద్ధి చెందుతోంది. జీవనోపాధి, ఉద్యోగం అంటూ వందలాది మంది పొరుగు రాష్ట్రాల నుండి ఇక్కడ తలదాచుకుంటున్నారు. దీంతో జన జీవనం పెరిగింది. నిర్మాణాలు, కట్టడాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో అక్రమ కట్టడాలపై కొరడా ఝులిపిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. అలాంటి కట్టడాలను కూల్చివేత పనిలో నిమగ్నమవుతోంది. చెరువుల, కుంటలను కబ్జా చేయడంతో పాటు.. ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. రంగంలోకి దిగిన ప్రభుత్వం అలాంటి అక్రమ కట్టడాలను కూల్చివేస్తోంది. దీని వల్ల కట్టిన కొద్ది కాలానికే కూలిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. దీని కారణంగా ఆస్తి, ప్రాణ నష్టం జరుగుతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం .. కొన్ని నిషేధిత ప్రాంతాల్లో అక్రమ కట్టడాలపై చర్యలకు దిగుతోంది.ఈ మేరకు హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన చేశారు.
హైదరాబాద్‌లో బఫర్ జోన్స్‌లో స్థలాలు కొనుగోలు చేయవద్దని, అలాగే నిర్మాణాలు కూడా చేపట్టవద్దని రంగనాథ్ పేర్కొన్నారు. అలా చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మొదటి దశలో భాగంగా అక్రమ కట్టడాలను అడ్డుకుంటామని, రెండో దశలో భవనాలు నిర్మించిన వారిపై చర్యలు, కన్ స్ట్రక్షన్స్ కు నిరాకరణ వంటి చర్యలు ఉంటాయన్నారు. ఇక మూడో దశలో చెరువుల పూడిక తీసి వాన నీటిని మళ్లించి పునరుజ్జీవం కల్పిస్తామన్నారు. చెరువుల పరిధిలోని ఆక్రమణలను గుర్తిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే జీహెచ్‌ఎంసీ (GHMC) పరిధిలో చెరువులు, కుంటలు ఉన్నాయని, ఎన్ఆర్ఎస్సీ నివేదిక ప్రకారం 44 ఏళ్లలో చాలా చెరువులు కనుమరుగయ్యాయని అన్నారు. 60 నుండి 80 శాతం వరకు చెరువులు ఆక్రమణలకు గురయ్యాయని వివరించారు.
చెరువులను పునరుద్దరిస్తాం:
ఇక భవిష్యత్తులో వీటిని అడ్డుకోకపోతే హైదరాబాద్ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు రంగనాథ్. గొలుసు కట్టు చెరువులన్నీ పునరుద్దరిస్తామని చెప్పారు. చెరువులకు నీటిని మళ్లించే నాలాలు పూడుకు పోయాయని, చెరువుల పరీక్షణకు అందరితో కలిసి మేథో మథనం చేస్తామని అన్నారు. చందా నగర్‌లో గతేడాది బఫర్ జోన్‌లో నిర్మాణాలకు అనుమతులిచ్చారని, ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్స్ ఎవరూ స్థలాలు కొనుగోలు చేయవద్దన్నారు. ఇలా అక్రమాలు పాల్పడకుండా ఉండేందుకు హైడ్రాకు త్వరలోనే ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఏర్పాటు అవుతుందని అన్నారు.
ఇది కూడా చదవండి: Operation Hydra: స్పీడ్ పెంచిన ఆపరేషన్ హైడ్రా.. ఆ నిర్మాణాలను ఎక్కడికక్కడే కూల్చివేత..
జలవనరుల పరిధిలోని ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ల పరిధిలో అక్రమ నిర్మాణాలకు పాల్పడుతున్న రియల్టర్లు, బిల్డర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ హెచ్చరించారు. ముఖ్యంగా సరస్సుల పరిసరాల్లో ఇళ్లు, అపార్ట్‌మెంట్లు తక్కువ ధరకు లభిస్తున్నందున, నీటి వనరుల దగ్గర ఆస్తులను కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని హైడ్రా కమిషనర్ ప్రజలకు సూచించారు. సరస్సుల నుండి 30 మీటర్ల బఫర్ జోన్‌లో ఆస్తులు ఉన్నాయో లేదో ధృవీకరించాలని. మరిన్ని వివరాల కోసం హైడ్రాను సంప్రదించాలని ఆయన కోరారు.
నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్‌ఆర్‌ఎస్‌సి) గణాంకాల ప్రకారం.. గత 45 ఏళ్లలో హైదరాబాద్ చుట్టుపక్కల నీటి వనరుల విస్తీర్ణం 61% తగ్గిందని, కేవలం 39% మాత్రమే మిగిలి ఉందని రంగనాథ్ పేర్కొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి