Telangana: రూ.8 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ జిల్లా జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి

రంగారెడ్డి జిల్లాలో మరో అవినీతి తిమింగలం ఏసీబీ వలకు చిక్కింది. ఏకంగా జిల్లా జాయింట్ కలెక్టర్ లంచం తీసుకుంటూ దొరికిపోయాడు. భూపాల్ రెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. జేసీతో పాటు పట్టుబడ్డ సీనియర్ అసిస్టెంట్‌‌ మదన్‌ మోహన్‌ను రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకున్నారు.

Telangana: రూ.8 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ జిల్లా జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి
Acb Trap
Follow us

|

Updated on: Aug 13, 2024 | 1:36 PM

రంగారెడ్డి జిల్లాలో మరో అవినీతి తిమింగలం ఏసీబీ వలకు చిక్కింది. ఏకంగా జిల్లా జాయింట్ కలెక్టర్ లంచం తీసుకుంటూ దొరికిపోయాడు. భూపాల్ రెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. జేసీతో పాటు పట్టుబడ్డ సీనియర్ అసిస్టెంట్‌‌ మదన్‌ మోహన్‌ను రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకున్నారు. ధరణిలో డాక్యుమెంట్స్ అప్‌డేట్ కోసం జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు వల పన్ని అదుపులోకి తీసుకున్నారు.

ఈ క్రమంలోనే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం‌, హైదరాబాద్ శివారు నాగోల్‌లోని భూపాల్ రెడ్డి నివాసంతోపాటు సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్ నివాసాల్లోనూ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. భూపాల్ రెడ్డి ఇంట్లో రూ.16 లక్షల నగదు, పెద్ద ఎత్తున ఆస్తి పత్రాలు, నగలు ఏసీబీఅధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. బాధితుడు జక్కిడి ముత్యంరెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో జాయింట్ కలెక్టర్‌ను ఏసీబీ ట్రాప్ చేసింది.

జక్కిడి ముత్యంరెడ్డి అనే రైతు ధరణి వెబ్‌సైట్‌లో ప్రొహిబిటెడ్ భూముల జాబితా నుంచి 14 గుంటల భూమిని తొలగించాలని జిల్లా కలెక్టర్ కార్యాలయానికి దరఖాస్తు చేసుకున్నాడు. ఈ పని పూర్తి చేసేందుకు రూ. 8 లక్షలు ఇవ్వాల్సిందిగా జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి డిమాడ్ చేశాడు. ఈ మొత్తాన్ని సీనియర్ అసిస్టెంట్ మధుమోహన్ రెడ్డికి పెద్ద అంబర్‌పేట్ ఔటర్ రింగ్ ప్రాంతంలో ఇవ్వాలని సూచించాడు. దీంతో బాధితుడి కారులో డబ్బులు తీసుకుంటుండగా మదన్ మోహన్‌ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. జాయింట్ కలెక్టర్ సూచనల మేరకే తాను ఈ డబ్బులు తీసుకుంటున్నట్లు ఏసీబీకి సీనియర్ అసిస్టెంట్ చెప్పారు. అయితే ఇదంతా జరుగుతున్న సమయంలోనే ఏసీబీ అధికారుల ముందే జాయింట్ కలెక్టర్‌కు సీనియర్ అసిస్టెంట్ ఫోన్ చేశాడు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు భూపాల్ రెడ్డితోపాటు, సీనియర్ అసిస్టెంట్ మధుమోహన్‌ను అరెస్ట్ చేశారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..