వావ్.. ఇది విన్నారా..? ప్రసాదాలు.. హోం డెలీవరీ అట..!

పండుగలు వస్తే.. ఇళ్లల్లో ఉండే ఆ హడావిడే వేరు. కొత్త బట్టలు.. ఘుమ ఘుమ లాడే పిండివంటలతో.. ఇంటిలో సువాసనలు వెదజల్లుతూంటాయి. అలాగే.. ప్రస్తుతమున్న.. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో.. పండుగ ఆచారాలు.. మర్చిపోతున్నారు కొందరు. అన్ని రకాల పిండివంటలను స్వయంగా చేసుకుని తినే టైమ్ కూడా ఉండటం లేదు. అందరూ.. హోటళ్లపైనే పడుతున్నారు. అందులోనూ.. ఆర్గానిక్ ఫుడ్‌కి ఇంకా మంచి రెస్పాన్స్ వస్తోంది. అలా ఓ వ్యక్తికి వచ్చిన ఆలోచనే.. ఇప్పుడు కొత్తగా ఉంది. పండుగలకు […]

వావ్.. ఇది విన్నారా..? ప్రసాదాలు.. హోం డెలీవరీ అట..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Sep 02, 2019 | 5:47 PM

పండుగలు వస్తే.. ఇళ్లల్లో ఉండే ఆ హడావిడే వేరు. కొత్త బట్టలు.. ఘుమ ఘుమ లాడే పిండివంటలతో.. ఇంటిలో సువాసనలు వెదజల్లుతూంటాయి. అలాగే.. ప్రస్తుతమున్న.. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో.. పండుగ ఆచారాలు.. మర్చిపోతున్నారు కొందరు. అన్ని రకాల పిండివంటలను స్వయంగా చేసుకుని తినే టైమ్ కూడా ఉండటం లేదు. అందరూ.. హోటళ్లపైనే పడుతున్నారు. అందులోనూ.. ఆర్గానిక్ ఫుడ్‌కి ఇంకా మంచి రెస్పాన్స్ వస్తోంది. అలా ఓ వ్యక్తికి వచ్చిన ఆలోచనే.. ఇప్పుడు కొత్తగా ఉంది. పండుగలకు చేసుకునే పిండి వంటలను.. డోర్ డెలివరీ చేస్తే ఎలా ఉంటుంది..? మనకో రూపాయి వస్తుంది.. వాళ్లకు టైం సేవ్ అవుతుంది కదా..! అని దీన్నే తమ వ్యాపారంగా మార్చుకున్నారు హైదరాబాద్‌లోని ఓ హోటల్ యాజమాన్యం.

అందులోనూ.. ఇప్పుడు వినాయక చవితి సందర్భంగా.. నోరూరించే పిండి వంటలు.. ఇక్కడ లభిస్తాయంటూ.. వాళ్ల వ్యాపారాన్ని విస్తరించుకుంటున్నారు. టైం సేవ్.. తక్కువ డబ్బులు.. నోరూరించే పిండివంటలు రెక్కలు కట్టుకుని వచ్చేస్తాయి..? ఇంకే కావాలి.. వీళ్ల బలహీనతే.. వారికి పెట్టుబడిగా మారింది. గణేష్ చతుర్థి.. దాదాపు 11 రోజుల పాటు ఎంతో.. ఆర్భాటంగా జరుగుతాయి. దీంతో.. ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు.. ప్రసాదాలు మీ ఇంటికే డోర్ డెలివరీ చేస్తామంటూ.. ఆఫర్ ఇచ్చారు హైదరాబాద్‌లోని ‘ఆంధ్రా తాలింపు’ హోటల్ నిర్వాహకులు. గణేష్ ప్రసాదం కిట్ పేరుతో.. కేజీ ఉండ్రాళ్లు, 10 పూర్ణాలు, 10 గారెలు, హాఫ్ కేజీ పులిహోర, హాఫ్ కేజీ చక్కెర పొంగలి, హాఫ్ కేజీ రవ్వ కేసరి.. ప్యాక్స్‌ను కేవలం రూ.470లకే అందిస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. ప్రసాదాలు చేయడం రాని వాళ్లు.. టైం సరిపోవడం లేదు అనే.. వాళ్లు.. హ్యాపీగా ఆర్డర్ పెట్టేసేయండి మరి.

Hyderabad hotel offers Vinayaka Chavithi Prasadalu Home delivery